Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 3:7 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 నేను జ్ఞానిని గదా అని నీవనుకొనవద్దు యెహోవాయందు భయభక్తులుగలిగి చెడుతనము విడిచిపెట్టుము

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

7 నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నీకు నీవే తెలివైన వానినని అనుకోవద్దు; యెహోవా పట్ల భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 3:7
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

వెంటనే దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యెహోవా మందిరంలోనికి వెళ్లి ఆరాధించాడు. తర్వాత అతడు తన ఇంటికి తిరిగివచ్చి భోజనం తెమ్మని చెప్పాడు. వారు భోజనం వడ్డించగానే అతడు తిన్నాడు.


నాకన్నా ముందు అధిపతులుగా ఉన్నవారు ప్రజలపై భారాన్ని మోపి వారి నుండి నలభై షెకెళ్ళ వెండిని, ఆహారాన్ని ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. వారి సహాయకులు కూడా ప్రజల మీద భారం మోపారు. అయితే దేవుని భయం ఉన్న నేను అలా చేయలేదు.


ఊజు దేశంలో యోబు అనే వ్యక్తి ఉండేవాడు. అతడు నిర్దోషమైనవాడు, యథార్థవంతుడు; దేవుడంటే భయం కలిగి చెడుకు దూరంగా ఉండేవాడు.


అంతేకాక మనుష్యజాతితో, “యెహోవాకు భయపడడమే జ్ఞానం దుష్టత్వాన్ని విడిచిపెట్టడమే వివేకం” అని అన్నాడు.


అందుకు మోషే ప్రజలతో, “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి దేవుడు వచ్చారు, తద్వార మీరు పాపం చేయకుండా దేవుని భయం మీలో ఉంటుంది” అని చెప్పాడు.


జ్ఞాని యెహోవాకు భయపడి చెడు నుండి తప్పుకుంటాడు, మూర్ఖులు కోపిష్ఠులై కూడా భద్రంగా ఉన్నట్లు భావిస్తారు.


యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం జీవపుఊట, అది ఓ వ్యక్తిని మరణ ఉరుల నుండి తప్పిస్తుంది.


ప్రేమ, నమ్మకత్వం వలన పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుంది; యెహోవాయందలి భయం వలన కీడు తొలగిపోతుంది.


సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.


తన కళ్లకు తాను జ్ఞానియైన వాన్ని చూశావా? వానికన్నా బుద్ధిహీనునికి ఎక్కువ నిరీక్షణ.


వాని మూర్ఖత్వం ప్రకారం బుద్ధిహీనునికి సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు తన కళ్లకు తాను జ్ఞానిని అని అనుకుంటాడు.


ధనవంతులు తమ కళ్లకు తామే జ్ఞానులు; వివేకంగల పేదవారు వారు ఎంత మోసపూరితమైనవారో చూస్తారు.


తమను తాము నమ్ముకొనేవారు బుద్ధిహీనులు, కాని జ్ఞానం కలిగి నడచుకునేవారు క్షేమంగా ఉంటారు.


యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండడం, చెడును అసహ్యించుకోవడమే; గర్వం, అహంకారం, చెడు పనులను చేయుట, అబద్ధపు మాటలు నాకు అసహ్యము.


ఇవన్నీ విన్న తర్వాత, అన్నిటి ముగింపు ఇదే: దేవునికి భయపడాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఇదే మనుష్యులందరి కర్తవ్యము.


తమకు తామే జ్ఞానులమని తమ దృష్టిలో తామే తెలివైనవారమని అనుకునేవారికి శ్రమ.


సహోదరీ సహోదరులారా, మీరు అహంకారులుగా ఉండకూడదని మీకు ఈ మర్మం తెలియాలని నేను కోరుకుంటున్నాను. అది ఏంటంటే యూదేతరులంతా లోపలికి ప్రవేశించే వరకు ఇశ్రాయేలు ప్రజలు కొంతవరకు కఠినం చేయబడ్డారు.


ఒకరితో ఒకరు ఐక్యమత్యం కలిగి జీవించండి. గర్వం ఉండవద్దు కాని మీకన్న తక్కువ స్థాయిలో ఉన్న ప్రజలతో కూడా సహవాసం చేయండి. అహంకారం ఉండవద్దు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ