Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సామెతలు 18:1 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు, అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారముగా నడచువాడు అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 తనకు తానుగా ఉండే వాడు స్వార్థపరుడు. వాడు సరైన ఆలోచనకు వ్యతిరేకం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

1 ఇతరులు అంటే గిట్టనివాడు తాను చేసే వాటిలో స్వార్థపరుడుగా ఉంటాడు. ప్రజలు మంచి సలహాను ఇచ్చినప్పుడు అతడు కోపగించుకుంటాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 స్నేహం లేని వ్యక్తి స్వార్థ ప్రయోజనాలను వెంటాడుతాడు, అన్ని మంచి తీర్పులకు వ్యతిరేకంగా గొడవలు ప్రారంభిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సామెతలు 18:1
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

మీరు మాతో రాకపోతే నా పట్ల మీ ప్రజల పట్ల మీరు కనికరం చూపించారని ఎవరికైనా ఎలా తెలుస్తుంది? ఈ భూమి మీద ఉన్న ఇతర ప్రజల నుండి నన్ను, మీ ప్రజలను ఏది ప్రత్యేకపరుస్తుంది?” అని అడిగాడు.


హృదయంలో ఉన్న బాధ దానికే తెలుస్తుంది, దాని సంతోషంలో మరొకరు పాలివారు కాలేరు.


గొడవ ప్రారంభించడం ఆనకట్టకు గండి కొట్టడం లాంటిది; కాబట్టి వివాదం చెలరేగడానికి ముందే ఆపండి.


పుకార్లు చెప్తూ తిరిగేవారు నమ్మకద్రోహం చేసేవారు కాబట్టి ఎక్కువగా మాట్లాడేవారిని దూరం ఉంచాలి.


తగవులకు దూరముగా ఉండడం మనుష్యులకు ఘనత, మూర్ఖులు జగడాన్నే కోరును.


నా కుమారుడా, యెహోవాకు రాజుకు భయపడు, తిరుగుబాటు చేసే అధికారులతో జతకలవకు.


తనకు కాని తగాదాను బట్టి తొందర పడేవాడు దాటిపోవుచున్న కుక్కచెవులు పట్టుకొను వానితో సమానుడు.


నా కుమారుడా, జ్ఞానాన్ని వివేకాన్ని నీ దగ్గర భద్రంగా చూచుకో, వాటిని నీ కళ్ళెదుట నుండి తొలగిపోనివ్వకు;


ఆలోచన చెప్పడం, మంచి జ్ఞానాన్ని ఇవ్వడం నా పని; నేను అంతరార్థం కలిగి ఉన్నాను, పరాక్రమం నాదే.


నేనిప్పుడు ఆనందించే వారితో కలిసి కూర్చోలేదు, వారితో ఎప్పుడూ సంతోషించలేదు. మీ చేయి నా మీద ఉంది మీరు నాలో కోపాన్ని నింపారు కాబట్టి నేను ఒంటరిగా కూర్చున్నాను.


“అనేక సంవత్సరాలుగా మేము చేస్తున్నట్లుగా అయిదవ నెలలో దుఃఖిస్తూ ఉపవాసం ఉండాలా?” అని సైన్యాల యెహోవా మందిరంలోని యాజకులను, ప్రవక్తలను అడిగారు.


అందుకు యేసు వారితో, “ఎందుకంటే పరలోక రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు.


పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనం వంటిది. ఒకడు దానిని కనుగొనగానే దానిని మరల దాచిపెట్టి, సంతోషంతో వెళ్లి తనకు ఉన్నదంతా అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.


చాలా ప్రొద్దున, ఇంకా చీకటిగా ఉండగానే యేసు నిద్రలేచి, ఇంటి నుండి బయలుదేరి తాను ప్రార్థించే ఏకాంత స్థలానికి వెళ్లారు.


అందుకు ఆయన ఈ విధంగా చెప్పారు, “దేవుని రాజ్యం గురించిన మర్మానికి సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది. కాని బయటివారికి ప్రతి విషయం ఉపమాన రీతిగానే చెప్పబడింది.


అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కోసం ప్రత్యేకపరచబడిన పౌలు అనే నేను క్రీస్తు యేసు దాసుడను.


కాబట్టి, “వారి మధ్య నుండి బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండండి, అని ప్రభువు చెప్తున్నాడు. అపవిత్రమైన దానిని తాకకండి, అప్పుడు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను.


చీలిన డెక్కలు ఉండి నెమరువేసే ఏ జంతువునైనా మీరు తినవచ్చు.


అలాంటివారు సహజ సంబంధులు, వీరు ఆత్మలేనివారిగా ఉండి, మీలో విభేదాలు పుట్టిస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ