12 పొరబాటున ఒకని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజమునెదుట నిలుచువరకువాడు మరణశిక్ష నొందకూడదు గనుక ప్రతిహత్య చేయువాడు రాకుండ అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును.
12 పొరబాటున ఎవరినైనా చంపినవాడు వాటిలోకి పారిపోవచ్చు. తీర్పు కోసం నరహంతకుడు సమాజం ఎదుట నిలిచే వరకూ వాడు మరణశిక్ష పొందకూడదు కాబట్టి ప్రతికారం తీర్చుకునేవాడి నుండి అవి మీకు ఆశ్రయం కల్పిస్తాయి.
12 చనిపోయిన మనిషి కుటుంబంనుండి, దెబ్బకు దెబ్బతీయాలని చూచే వారి బారినుండి అతడు క్షేమంగా ఉంటాడు. అతనికి న్యాయస్థానంలో తీర్పు జరిగేంతవరకు అతడు క్షేమంగా ఉంటాడు.
ఇప్పుడు నా కుటుంబమంతా నీ సేవకురాలినైన నా మీదికి లేచి, ‘తన సోదరుని కొట్టి చంపినవాన్ని మాకు అప్పగించు. వాడు తన సోదరుని చంపాడు కాబట్టి మేము వాన్ని చంపాలి: అప్పుడు వారసుడే లేకుండ పోతాడు’ అని వారు అంటున్నారు. వారు నా భర్త పేరును గాని వారసులను గాని భూమి మీద మిగలకుండా, నా దగ్గర మిగిలి ఉన్న ఏకైక మండే బొగ్గును చల్లార్చాలని చూస్తున్నారు” అని చెప్పింది.
ఇశ్రాయేలీయులలో ఎవరైనా లేదా వారిలో నివసించే విదేశీయులెవరైనా అనుకోకుండ ఎవరినైనా చంపితే వారు ఈ నిర్ణయించబడిన పట్టణాలకు పారిపోవచ్చు, సమాజం ముందు విచారణ జరిగే వరకు రక్తపు పగతో చంపబడరు.