Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 24:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 సింహమువలెను ఆడుసింహమువలెను అతడు క్రుంగి పండుకొనెను అతనిని లేపువాడెవడు? నిన్ను దీవించువాడు దీవింపబడును నిన్ను శపించువాడు శపింపబడును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 అతడు సింహంలా, ఆడ సింహంలా పొంచి ఉంటాడు. అతని విశ్రాంతికి భంగం కలిగించేవాడెవడు? అతన్ని దీవించే ప్రతివాడికీ దీవెన వస్తుంది గాక, అతన్ని శపించే ప్రతివాడికీ శాపం వస్తుంది గాక” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు. వారు నిద్రపోతున్న కొదమ సింహంలా ఉన్నారు. దానిని మేల్కొలి పేందుకు ఎవడికి ధైర్యం చాలదు. నిన్ను ఆశీర్వదించే వారు ఆశీర్వాదం పొందుతారు. నిన్ను ఎవరైనా శపిస్తే వారికి గొప్ప కష్టాలు వస్తాయి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 సింహంలా ఆడు సింహంలా వారు ముడుచుకుని పడుకుంటారు, వారిని ధైర్యంగా ఎవరు లేపగలరు? “ఓ ఇశ్రాయేలు, నిన్ను దీవించే వారు దీవించబడుదురు గాక నిన్ను శపించేవారు శపించబడుదురు గాక!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 24:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

నిన్ను దీవించే వారిని దీవిస్తాను, శపించే వారిని శపిస్తాను; నిన్ను బట్టి భూమి మీద ఉన్న సర్వ జనాంగాలు దీవించబడతారు.”


జనాంగాలు నీకు సేవ చేయాలి, జనాలు నీకు తలవంచాలి. నీ సోదరులకు నీవు ప్రభువుగా ఉంటావు, నీ తల్లి యొక్క కుమారులు నీకు తలవంచాలి. నిన్ను శపించేవారు శపించబడతారు నిన్ను దీవించే వారు దీవించబడతారు.”


యూదా, నీవు ఒక కొదమసింహం; నా కుమారుడా, నీవు వేటాడి తిరిగి వచ్చావు. అతడు సింహంలా కాళ్లు ముడుచుకుని, ఆడ సింహంలా పడుకుంటాడు, అతన్ని లేపడానికి ఎవరు తెగిస్తారు?


ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు.


సింహాసనానికి ఆరు మెట్లున్నాయి. దానికి ఒక బంగారు పాదపీఠం కట్టి ఉంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి.


హామాను తనకు జరిగిందంతా తన భార్య జెరషుకు, తన స్నేహితులందరికి తెలియజేశాడు. అతని సలహాదారులు, అతని భార్య జెరెషు అతనితో అన్నారు, “ఎవరి ఎదుట నీ పతనం ప్రారంభమైందో, ఆ మొర్దెకై యూదుడు కాబట్టి, అతని ఎదుట నీవు నిలబడలేవు, నీవు ఖచ్చితంగా పడిపోతావు.”


దానిని లేపే సాహసం ఎవరు చేయలేరు. అలాంటప్పుడు నా ఎదుట ఎవరు నిలబడగలరు?


యెరూషలేము యొక్క సమాధానం కోసం ప్రార్థించండి. “యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు క్షేమంగా ఉందురు గాక!


ఆయన కుమారున్ని ముద్దాడండి, లేకపోతే ఆయన కోపం ఒక క్షణంలో రగులుకుంటుంది. మీ మార్గం మీ నాశనానికి నడిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఉగ్రత క్షణంలో రగులుకుంటుంది. ఆయనను ఆశ్రయించువారు ధన్యులు.


మీరు ఆయన చెప్పేది జాగ్రత్తగా విని నేను చెప్పేవాటన్నిటిని చేస్తే, నేను మీ శత్రువులకు శత్రువుగా ఉంటాను, మిమ్మల్ని వ్యతిరేకించే వారిని వ్యతిరేకిస్తాను.


యెహోవా నాతో చెప్పే మాట ఇదే: తప్పించడానికి గొర్రెల కాపరులందరు కలిసివచ్చి ఎన్ని శబ్దాలు చేసినా భయపడకుండా వారి కేకలకు కలవరపడకుండా సింహం ఒక కొదమసింహం తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యాల యెహోవా యుద్ధం చేయడానికి సీయోను పర్వతం మీదికి దాని కొండ మీదికి దిగి వస్తారు.


యాకోబు సంతానంలో మిగిలినవారు దేశాల మధ్య, అనేక జనాల మధ్య, అడవి మృగాలలో సింహంలా, గొర్రెల మందలలో దూరి, ఎవ్వరూ విడిపించలేనంతగా వాటిని త్రొక్కి చీల్చే కొదమసింహంలా ఉంటారు.


అయితే దేవుడు బిలాముతో, “నీవు వారితో వెళ్లొద్దు. వారు దీవించబడినవారు కాబట్టి నీవు వారిని శపించకూడదు” అని అన్నారు.


నీవు వచ్చి వీరిని శపించాలి, ఎందుకంటే వారు నా శక్తికి మించి ఉన్నారు. బహుశా అప్పుడు నేను వీరిని ఓడించి ఈ స్థలం నుండి తరిమివేయగలుగుతాను. నీవు ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారని, నీవు ఎవరిని శపిస్తే వారు శపించబడతారని నాకు తెలుసు.”


ప్రజలు ఆడ సింహంలా లేస్తారు; వారు తమకు తాము సింహంలా లేస్తారు అది తన వేట మాంసాన్ని మ్రింగివేసే వరకు దాని బాధితుల రక్తం త్రాగే వరకు విశ్రాంతి తీసుకోదు” అని చెప్పబడుతుంది.


బిలాము మీద బాలాకుకు కోపం రగులుకుంది. చేతులు చరుస్తూ అతనితో, “నా శత్రువులను శపించమని నిన్ను పిలిపిస్తే, వారిని మూడుసార్లు దీవించావు.


“అందుకు ఆ రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేశారు కాబట్టి, నాకు చేసినట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.


“అందుకు రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.


అందుకు సౌలు, “ప్రభువా, నీవెవరు?” అని అడిగాడు. అప్పుడు ఆ స్వరం అతనితో, “నేను నీవు హింసిస్తున్న యేసును


మీ దేవుడైన యెహోవా ఈ శాపాలన్నింటినీ మిమ్మల్ని ద్వేషించే, మిమ్మల్ని హింసించే మీ శత్రువులపైకి తెస్తారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ