Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 24:20 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

20 అప్పుడు బిలాము, అమాలేకును చూసి ఈ సందేశాన్ని ఇచ్చాడు: “అమాలేకు దేశాల్లో మొదటిది, కానీ దాని అంతం పూర్తి నాశనమే!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

20 మరియు అతడు అమాలేకీయులవైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనెను – అమాలేకు అన్యజనములకు మొదలు వాని అంతము నిత్యనాశనమే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

20 ఇంకా బిలాము అమాలేకీయులవైపు చూసి ప్రవచనం చెప్తూ, “ఒకప్పుడు అమాలేకు దేశాల్లో గొప్ప దేశం. కాని దాని అంతం నాశనమే” అన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

20 తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు: “దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది. కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

20 అప్పుడు బిలాము, అమాలేకును చూసి ఈ సందేశాన్ని ఇచ్చాడు: “అమాలేకు దేశాల్లో మొదటిది, కానీ దాని అంతం పూర్తి నాశనమే!”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 24:20
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఏశావు కుమారుడైన ఎలీఫజుకు తిమ్నా అనే ఉంపుడుగత్తె కూడా ఉంది. ఆమె అమాలేకును కన్నది. వీరు ఏశావు భార్య ఆదా యొక్క మనవళ్లు.


అమాలేకీయులలో తప్పించుకున్న మిగిలిన వారందరిని చంపి, ఈ రోజు వరకు వారక్కడ నివసించారు.


ఈ సంఘటనలు జరిగిన తర్వాత, రాజైన అహష్వేరోషు అగగీయుడైన హమ్మెదాతా కుమారుడైన హామానుకు ఇతర సంస్థానాధిపతులందరికన్నా ఉన్నత స్థానాన్ని ఇచ్చి అతన్ని గౌరవించాడు.


కాబట్టి అలా చేయమని రాజు ఆజ్ఞాపించాడు. షూషనులో ఆజ్ఞ జారీ చేయబడింది, వారు హామాను యొక్క పదిమంది కుమారులను ఉరితీశారు.


తర్వాత యెహోవా మోషేతో, “అమాలేకు పేరును ఆకాశం క్రింద ఉండకుండ పూర్తిగా కొట్టివేస్తాను, కాబట్టి జ్ఞాపకం చేసుకునేలా దీనిని ఒక గ్రంథంలో వ్రాసి యెహోషువకు వినిపించు” అని చెప్పారు.


అతడు, “యెహోవా సింహాసనానికి వ్యతిరేకంగా తమ చేతిని పైకి ఎత్తారు, కాబట్టి యెహోవా అమాలేకీయులతో తరతరాల వరకు యుద్ధం చేస్తూనే ఉంటారు” అన్నాడు.


రెఫీదీములో అమాలేకీయులు వచ్చి ఇశ్రాయేలీయులపై దాడి చేశారు.


యాకోబు నుండి రాజ్యమేలేవాడు వస్తాడు. అతడు పట్టణంలో మిగిలిన వారిని నాశనం చేస్తాడు.”


కుప్ర తీరం నుండి ఓడలు వస్తాయి; అవి అష్షూరును, ఏబెరును అణచివేస్తాయి, అయితే మీరు కూడా పతనమవుతారు.”


వాటి బొక్కెనల నుండి నీళ్లు పారుతున్నాయి; వాటి విత్తనాలకు సమృద్ధిగా నీళ్లుంటాయి. “వారి రాజు అగగు కంటే గొప్పవాడు; వారి రాజ్యం హెచ్చింపబడుతుంది.


ఇశ్రాయేలీయులు పంటలు వేసినప్పుడు మిద్యానీయులు, అమాలేకీయులు, ఇతర తూర్పున ఉండే ప్రజలు ఆ దేశం మీద దాడి చేసేవారు.


అతడు ధైర్యంగా పోరాడి అమాలేకీయులను హతం చేసి ఇశ్రాయేలీయులను దోచుకున్నవారి చేతిలో నుండి వారిని విడిపించాడు.


సైన్యాల యెహోవా చెప్పింది ఇదే, ‘ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు అమాలేకీయులు దారిలో వారిని అడ్డగించినందుకు నేను వారిని శిక్షిస్తాను.


దావీదు అతని మనుష్యులు మూడవ రోజున సిక్లగుకు చేరుకున్నారు. అంతలో అమాలేకీయులు దక్షిణదేశం మీద సిక్లగు మీద దాడిచేసి సిక్లగును దోచుకొని దానిని కాల్చివేశారు.


దావీదు సాయంత్రం మొదలుపెట్టి మరునాటి సాయంత్రం వరకు వారిని చంపుతూ ఉంటే, ఒంటెల మీద ఎక్కి పారిపోయిన నాలుగువందలమంది యువకులు తప్ప మరియెవరూ తప్పించుకోలేకపోయారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ