Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 20:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు. “ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 మేము యెహోవాకు మొఱ పెట్టగా ఆయన మా మొఱను విని, దూతను పంపి ఐగుప్తులోనుండి మమ్మును రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేషు పట్టణములో ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 అయితే మేము యెహోవాను సహాయం అడిగాము. యెహోవా మా మొర విని, మాకు సహాయం చేసేందుకు ఒక దేవదూతను పంపించాడు. యెహోవా మమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. “ఇదిగో ఇప్పుడు మేము నీ దేశ సరిహద్దు అయిన కాదేషులో ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అయితే మేము యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఆయన మా మొర ఆలకించాడు దేవదూతను పంపి, ఈజిప్టు నుండి మమ్మల్ని బయటకు తీసుకువచ్చాడు. “ఇప్పుడు మేము కాదేషులో ఉన్నాము, ఈ పట్టణం మీ సరిహద్దుల చివర ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 20:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఫరో దగ్గరగా వస్తుండగా, ఇశ్రాయేలీయులు పైకి చూసినప్పుడు ఈజిప్టువారు తమ వెనుక రావడం చూశారు. వారు భయపడి యెహోవాకు మొరపెట్టారు.


అప్పుడు ఇశ్రాయేలీయుల సైన్యానికి ముందు నడుస్తున్న దేవదూత వారి వెనుకకు వెళ్లాడు. మేఘస్తంభం కూడా వారి ఎదుట నుండి కదిలి వారి వెనుకకు వెళ్లి,


“ఇదిగో, మార్గమంతటిలో మిమ్మల్ని కాపాడి నేను సిద్ధం చేసి ఉంచిన చోటికి మిమ్మల్ని తీసుకురావడానికి ఒక దేవదూతను మీకు ముందుగా పంపుతున్నాను.


నేను నా దూతను మీకు ముందుగా పంపి కనానీయులను, అమోరీయులను, హిత్తీయులను, పెరిజ్జీయులను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్లగొడతాను.


అంతేకాక, ఈజిప్టు వారిచేత బానిసలుగా చేయబడిన ఇశ్రాయేలీయుల మూలుగును నేను విన్నాను, నా నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాను.


నా దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్ళు మూయించారు. అవి నాకు హాని చేయలేదు, ఎందుకంటే ఆయన దృష్టిలో నేను నిర్దోషిని. రాజా! మీ ఎదుట కూడా నేను ఏ తప్పు చేయలేదు” అన్నాడు.


మా పూర్వికులు ఈజిప్టుకు వెళ్లారు. చాలా కాలం మేమక్కడ ఉన్నాము. ఈజిప్టువారు మా పట్ల, మా పూర్వికుల పట్ల దారుణంగా ప్రవర్తించారు,


“మీ దేశం మీదుగా మమ్మల్ని వెళ్లనివ్వండి. మీ పొలాల వైపు, ద్రాక్షతోటల పొలాల వైపు తిరగము, మీ బావులలోని నీళ్లు త్రాగము. మీ దేశం పొలిమేర దాటే వరకు రాజమార్గంలోనే వెళ్తాము.”


కాదేషు నుండి బయలుదేరి ఎదోము సరిహద్దులో ఉన్న హోరు పర్వతం దగ్గర దిగారు.


మీ దేవుడైన యెహోవా ఈజిప్టులో మీ కళ్ళెదుట మీ కోసం శోధనలతో, సూచకక్రియలతో, అద్భుతాలతో, యుద్ధంతో, బలమైన హస్తంతో, చాచిన చేతితో మహా భయంకరమైన కార్యాలతో సమస్త కార్యాలను చేసినట్లు ఏ దేవుడైన తన కోసం ఒక దేశం నుండి మరొక దేశాన్ని బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడా?


ఆయన మీ పూర్వికులను ప్రేమించి వారి సంతతిని ఎంపిక చేసుకున్నారు కాబట్టి, మీకంటే బలమైన గొప్ప దేశాలను మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి దేశంలోనికి మిమ్మల్ని తీసుకువచ్చి, ఈ రోజు ఇస్తున్నట్లుగా వారి దేశాన్ని మీకు స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఆయన తన సన్నిధితో, తన మహాబలంతో మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించారు.


యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన భాగం, ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన సీను ఎడారి వరకు విస్తరించి ఉంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ