సంఖ్యా 2:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ప్రత్యక్షపు గుడారము లేవీయుల పాళెముతో పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమతమ ధ్వజములనుబట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 సన్నిధి గుడారం శిబిరం నుండి మిగిలిన గోత్రాలన్నిటి మధ్యలో లేవీయులతో కలసి ముందుకు కదలాలి. వారు శిబిరంలోకి ఏ క్రమంలో వచ్చారో అదే క్రమంలో శిబిరం నుండి బయటకు వెళ్ళాలి. ప్రతి ఒక్కడూ తన స్థానంలో ఉండాలి. తన పతాకం దగ్గరే ఉండాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 “ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు లేవీ వంశంవారు తర్వాత బయల్దేరతారు. సన్నిధి గుడారం వారితో బాటు ఇతర వంశాలవారి మధ్య ఉంటుంది. వారు బయల్దేరి వెళ్లే క్రమంలోనే వారి నివాసం ఏర్పాటు చేసుకొంటారు. ప్రతి వ్యక్తి తన వంశ ధ్వజం దగ్గర ఉంటాడు. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 తర్వాత సమావేశ గుడారం, శిబిరాల మధ్యలో లేవీయుల శిబిరం ఉంటుంది. వారు ఉన్న ఈ క్రమంలోనే, ప్రతి ఒక్కరూ తమ జెండా క్రింద తమ స్థలంలో ఉంటారు. အခန်းကိုကြည့်ပါ။ |