Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 15:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 ఒక్కొక్క గొఱ్ఱెపిల్లతోకూడ దహనబలిమీదనేమి బలిమీదనేమి పోయుటకై ముప్పావు ద్రాక్షారసమును పానార్పణముగా సిద్ధపరచవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 ఒక్కొక్క గొర్రెపిల్లతో పాటు దహనబలి మీద గాని, బలి మీద గాని పొయ్యడానికి ముప్పావు లీటర్ల ద్రాక్షారసం పానార్పణగా సిద్ధం చెయ్యాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 ఒక గొర్రెపిల్లను దహనబలిగా నీవు అర్పించిన ప్రతిసారీ ముప్పావు ద్రాక్షారసం పానార్పణంగా నీవు సిద్ధం చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 దహనబలి లేదా బలి కోసం తెచ్చే ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం పానార్పణంగా తేవాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 15:5
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

సమృద్ధిగా దహనబలి పశువుల సమాధానబలుల ఉన్నాయి, దానితో పాటు దహనబలుల క్రొవ్వు దహనబలులతో పాటు పానార్పణలు ఉన్నాయి. ఆ విధంగా యెహోవా మందిరంలో సేవ మళ్ళీ ప్రారంభించడం జరిగింది.


ఆ డబ్బుతో నీవు బలి అర్పించడానికి కావలసిన ఎడ్లు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు, వాటి భోజనార్పణలు, పానార్పణలతో పాటు కొని, యెరూషలేములోని నీ దేవుని ఆలయ బలిపీఠం మీద వాటిని అర్పించాలి.


నేను రక్షణ పాత్రను పైకెత్తి యెహోవా పేరట మొరపెడతాను.


దంచి తీసిన ఒక పావు హిన్ ఒలీవనూనెతో కలిపిన ఒక ఓమెరు నాణ్యమైన పిండిని, ఒక పావు హిన్ ద్రాక్షారసాన్ని పానార్పణగా మొదటి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి.


నన్ను మీతో దూరానికి తీసుకెళ్లండి; త్వరగా! రాజు తన అంతఃపురాల్లోకి నన్ను తీసుకెళ్లనివ్వండి. నీ విషయం మేము గొప్పగా సంతోషిస్తున్నాము; నీ ప్రేమను ద్రాక్షరసం కన్నా ఎక్కువగా పొగడుతాము. వారు నిన్ను పొగడడం ఎంత మంచి విషయం!


“ ‘ఒకవేళ అర్పణ మంద నుండి తెచ్చిన దహనబలి అర్పణ అయితే, గొర్రెల నుండి గాని లేదా మేకల నుండి గాని, మీరు లోపం లేని మగవాటినే అర్పించాలి.


దాని భోజనార్పణతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండిని నూనెతో కలిపి యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలిగా ఒక పావు హిన్ ద్రాక్షరసాన్ని పానార్పణగా సమర్పించాలి.


“ ‘ఒకవేళ మీరు మంద నుండి ఒక పశువును సమాధానబలిగా యెహోవాకు అర్పిస్తే, మగదైనా ఆడదైనా మీరు లోపం లేనిదే అర్పించాలి.


ఒకవేళ మీరు గొర్రెపిల్లను అర్పిస్తే, దానిని యెహోవా సన్నిధికి తీసుకురావాలి.


ధాన్యంతో యువకులు క్రొత్త ద్రాక్షరసంతో యువతులు వర్ధిల్లుతారు. వారు ఎంతో ఆకర్షణీయంగా అందంగా ఉంటారు!


ప్రతి కోడె లేదా పొట్టేలు, ప్రతి గొర్రెపిల్ల లేదా మగ మేకపిల్ల ఈ విధంగా సిద్ధపరచబడాలి.


“ ‘భోజనార్పణ కోసం పొట్టేళ్ళతో పాటు రెండు ఓమెర్ల నాణ్యమైన పిండి ఒక హిన్‌లో మూడవ వంతు నూనెతో కలిపి తేవాలి,


ప్రతి కోడెతో పాటు పానార్పణగా అర హిన్ ద్రాక్షరసం ఉండాలి; పొట్టేలుతో పాటు, హిన్‌లో మూడవ వంతు ద్రాక్షరసం; ప్రతి గొర్రెపిల్లతో పాటు ఒక పావు హిన్ ద్రాక్షరసం అర్పించాలి. సంవత్సరంలో ప్రతి అమావాస్యకు అర్పించాల్సిన దహనబలి ఇది.


దానితో పాటు ఒక పావు హిన్ పులియబెట్టిన పానీయాన్ని పానార్పణగా ప్రతి గొర్రెపిల్లతో పాటు అర్పించాలి. పరిశుద్ధాలయం దగ్గర యెహోవాకు పానార్పణ పోయాలి.


మీ విశ్వాస యాగంలో దానికి సంబంధించిన సేవలో నేను పానార్పణంగా పోయబడినప్పటికి, మీతో కలిసి సంతోషించి ఆనందిస్తాను.


ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది.


“అయితే ద్రాక్షవల్లి, ‘చెట్లపై రాజుగా ఉండి అటు ఇటూ ఊగడం కోసం దేవునికి మనుష్యులకు సంతోషాన్ని ఇచ్చే నా ద్రాక్షరసాన్ని ఇవ్వడం మానివేయాలా?’ అన్నది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ