Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




సంఖ్యా 13:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 కాబట్టి వారు వెళ్లి సీను ఎడారి నుండి లెబో హమాతు వైపున, రెహోబు వరకు ఆ దేశాన్ని పరిశీలించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 కాబట్టి ఆ వ్యక్తులు బయల్దేరి వెళ్ళారు. వారు లెబో హమాతు అనే ప్రాంతానికి దగ్గరగా సీను అరణ్యం నుండి రెహోబు వరకూ వెళ్లి సంచారం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 అప్పుడు వారు ఆ దేశాన్ని పరిశీలించి చూసారు. వారు సీను అరణ్యం నుండి రెహోబు, లెబ్రోహమాతు వరకు వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 కాబట్టి వారు వెళ్లి సీను ఎడారి నుండి లెబో హమాతు వైపున, రెహోబు వరకు ఆ దేశాన్ని పరిశీలించారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




సంఖ్యా 13:21
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

హదదెజెరు సైన్యమంతటిని దావీదు ఓడించిన సంగతి హమాతు రాజైన తోయు విన్నప్పుడు,


దమస్కు గురించి: “హమాతు, అర్పదు చెడువార్త విని భయంతో క్రుంగిపోయారు. వారు హృదయంలో కలవరపడ్డారు, నెమ్మది లేని సముద్రంలా ఆందోళన పడుతున్నారు.


అతడు పట్టుబడ్డాడు. అతన్ని హమాతు దేశంలోని రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ రాజు అతనికి శిక్ష విధించాడు.


తర్వాత అది దమస్కు హమాతు మధ్య సరిహద్దులో ఉన్న బెరోతా సిబ్రాయిము వరకు, చివరకు హౌరాను సరిహద్దులో ఉన్న హజెర్-హత్తికోను వరకు వెళ్తుంది.


మీరు కల్నేకు వెళ్లి చూడండి; అక్కడినుండి హమాతుకు వెళ్లండి, తర్వాత ఫిలిష్తీయలోని గాతుకు వెళ్లండి. మీ రెండు రాజ్యాల కంటే అవి గొప్పవా? వాటి నేల మీకంటే పెద్దది కాదా?


సంవత్సరం మొదటి నెలలో ఇశ్రాయేలు సమాజమంతా సీను ఎడారికి చేరి కాదేషులో దిగారు. అక్కడ మిర్యాము చనిపోయి పాతిపెట్టబడింది.


ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం నీళ్ల దగ్గర తిరుగుబాటు చేసినప్పుడు, మీరిద్దరు వారి దృష్టిలో నన్ను పరిశుద్ధునిగా గౌరవించకుండా అవిధేయత చూపారు.” (ఈ నీళ్లు సీను అరణ్యంలో మెరీబా కాదేషు నీళ్లు.)


ఎసోన్-గెబెరు నుండి బయలుదేరి సీను ఎడారిలో ఉన్న కాదేషుకు వచ్చారు.


హోరు పర్వతం నుండి లెబో హమాతు వరకు అక్కడినుండి సరిహద్దు సెదాదు వరకు వెళ్తూ,


వారు అక్కడినుండి కొండ ప్రాంతానికి ఎక్కి వెళ్లి ఎష్కోలు లోయకు వచ్చి దాన్ని పరిశీలించారు.


అసలు ఇలా జరిగిందంటే, మీరు సీను ఎడారిలోని మెరీబా కాదేషు నీళ్ల దగ్గర ఇశ్రాయేలీయుల ముందు మీరిద్దరూ నా పట్ల నమ్మకద్రోహం చేశారు, ఇశ్రాయేలీయుల ఎదుట మీరు నా పరిశుద్ధతను గౌరవించకపోవడము.


గెబాలీయుల ప్రాంతం; హెర్మోను పర్వతం క్రింద బయల్-గాదు నుండి లెబో హమాతు వరకు తూర్పున ఉన్న లెబానోను ప్రాంతమంతా.


యూదా గోత్రానికి దాని వంశాల ప్రకారం కేటాయించబడిన భాగం, ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన సీను ఎడారి వరకు విస్తరించి ఉంది.


ఆ ప్రజలు సీదోనుకు దూరంగా ఉండడం, ఎవరితో సంబంధం లేకపోవడం చేత వారిని కాపాడే మనుష్యులే లేరు. ఆ పట్టణం బేత్-రెహోబు దగ్గర లోయలో ఉంది. దానీయులు ఆ పట్టణాన్ని పునర్నిర్మించి అక్కడ స్థిరపడ్డారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ