Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 9:37 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

37 మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

37 మా పాపములనుబట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతివిస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరములమీదను మా పశువులమీదను అధికారము చూపుచున్నారు గనుక మాకు చాల శ్రమలు కలుగుచున్నవి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

37 మా పాపాలను బట్టి నువ్వు మా మీద నియమించిన రాజులకు మా భూముల్లో పండిన పంటలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. వారు తమ ఇష్టం వచ్చినట్టు మా శరీరాల మీదా, మా పశువుల మీదా పెత్తనం చెలాయిస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

37 ఈ భూమిలో పంట పుష్కలమైనదే కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది. ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు. తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు. దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

37 మా పాపాల కారణంగా దాని అపారమైన పంటంతా మీరు మామీద నియమించిన రాజులు అనుభవిస్తున్నారు. తమకు ఇష్టం వచ్చినట్లు మా శరీరాల మీద మా పశువులమీద అధికారం చెలాయిస్తున్నారు. మేము చాలా శ్రమ అనుభవిస్తున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 9:37
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

అంతేకాక, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఒకవేళ వీరే ఈ పట్టణాన్ని కట్టి దాని ప్రాకారాలు తిరిగి నిర్మిస్తే వారు పన్నులు గాని కప్పం గాని లేదా సుంకం గాని చెల్లించరు. తద్వారా రాజ్య ఆదాయానికి నష్టం కలుగుతుంది.


అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను: యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు.


అంతేకాక, యాజకులలో, లేవీయులలో, సంగీతకారులలో, ద్వారపాలకుల్లో, దేవాలయ సేవకులలో లేదా ఇతర పనివారిలో ఎవరి మీద హోదా పన్ను గాని, కప్పం గాని, సుంకం గాని, విధించే అధికారం మీకు లేదని గ్రహించండి.


“యూదేతరులకు అమ్మివేయబడిన మన తోటి యూదులను మా శక్తికొలది మేము విడిపించాము. మీరు మీ సొంత ప్రజలను అమ్ముతున్నారు; వారు మరలా మనకు అమ్మబడవచ్చా?” అని అడిగినప్పుడు వారేమి మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు.


మమ్మల్ని వెంటాడేవారు మా వెనుకే ఉన్నారు; మేము అలసిపోయాము, కాని విశ్రాంతి దొరకడం లేదు.


నేను మీకు విరోధంగా నా ముఖం పెడతాను, తద్వార మీ శత్రువులతో ఓడిపోతారు; మిమ్మల్ని ద్వేషించేవారే మిమ్మల్ని పరిపాలిస్తారు, ఎవరూ తరమకుండానే మీరు పారిపోతారు.


వారు ఆయనతో, “మేము అబ్రాహాము సంతతివారం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు మీరు విడుదల పొందుతారని ఎలా చెప్తారు?” అన్నారు.


మీకు తెలియని ప్రజలు మీ భూమి, మీ శ్రమ ఉత్పత్తి చేసే వాటిని తింటారు, మీ జీవితమంతా క్రూరమైన అణచివేత తప్ప మీకు ఏమీ ఉండదు.


మీరు ద్రాక్షతోటలు నాటి వాటిని శ్రమపడి సేద్యం చేస్తారు కాని ద్రాక్షరసం త్రాగరు, ద్రాక్షపండ్లు ఏరుకోరు, కారణం పురుగులు వాటిని తినేస్తాయి.


అందువల్ల ఆకలి, దాహం, నగ్నత్వం, పేదరికంలో, యెహోవా మీకు వ్యతిరేకంగా పంపే శత్రువులకు మీరు సేవ చేస్తారు. మిమ్మల్ని నాశనం చేసే వరకు ఆయన మీ మెడ మీద ఇనుప కాడి మోపుతాడు.


మీరు నాశనమయ్యే వరకు వారు మీ పశువుల పిల్లలను, మీ భూమిలోని పంటలను మ్రింగివేస్తారు. మీరు నాశనమయ్యే వరకు వారు మీకు ధాన్యం గాని, క్రొత్త ద్రాక్షరసం గాని, ఒలీవనూనె గాని, మీ పశువుల దూడలను గాని, మీ మందల గొర్రెపిల్లలను వదిలిపెట్టరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ