నెహెమ్యా 9:15 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 మీరు వారి ఆకలి తీర్చడానికి పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చి దాహం తీర్చడానికి బండలో నుండి నీళ్లు రప్పించారు; మీరు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి స్వాధీనం చేసుకోమని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 వారి ఆకలి తీర్చుటకు ఆకాశమునుండి ఆహారమును వారి దాహము తీర్చుటకు బండలోనుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణముచేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికాజ్ఞాపించితివి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 వారి ఆకలి తీరేలా ఆకాశం నుండి ఆహారం, దాహం తీర్చడానికి బండ నుండి నీళ్ళు రప్పించావు. వాళ్లకు నువ్వు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆజ్ఞ ఇచ్చావు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు. వాళ్లు దప్పి గొన్నప్పుడు వాళ్లకి నీవు బండ నుంచి మంచి నీళ్లిచ్చావు. వాళ్లకి చెప్పావు, ‘రండి, ఈ భూమి తీసుకోండని’ నీవు నీ శక్తిని వినియోగించి వారికోసం ఆ భూమిని తీసుకున్నావు! အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 మీరు వారి ఆకలి తీర్చడానికి పరలోకం నుండి ఆహారాన్ని ఇచ్చి దాహం తీర్చడానికి బండలో నుండి నీళ్లు రప్పించారు; మీరు వారికి ఇస్తానని ప్రమాణం చేసిన దేశానికి వెళ్లి స్వాధీనం చేసుకోమని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။ |
తమకిష్టమైన విగ్రహాలను పూజించాలని నా ధర్మశాస్త్రాన్ని పాటించకుండ నా శాసనాలను అనుసరించకుండ నా సబ్బాతులను అపవిత్రం చేసినందుకు, నేను వారికి ఇస్తానని చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, అన్ని దేశాల్లో అతి సుందరమైన దేశంలోనికి నేను వారిని తీసుకురానని వారు అరణ్యంలో ఉండగానే నా చేయి పైకెత్తి వారితో ప్రమాణం చేశాను.