Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 5:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 మరియు నేను–మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందనుబట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింప కూడదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 నేను ఇలా అన్నాను “మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నుండి వచ్చే నిందను బట్టి మన దేవుని పట్ల భయం కలిగి ఉండాలి కదా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 సరే, నేను ఇంకా ఇలా కొనసాగించాను: “మీరు చేస్తున్న పని సరైనది కాదు. దేవునిపట్ల భయభక్తులు కలిగి వుండాలన్న విషయం మీకు తెలుసు ఇతరులు చేసే సిగ్గుచేటైన పనులు మీరు చెయ్యకూడదు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 నేను ఇంకా మాట్లాడుతూ, “మీరు చేస్తున్న పని సరియైనది కాదు. యూదేతరులైన శత్రువుల నిందలు తప్పించుకోడానికి మన దేవునికి భయపడకుండా నడుచుకుంటారా?

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 5:9
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

అందుకు అబ్రాహాము అన్నాడు, “ఈ స్థలంలో దేవుని భయం లేదు, ‘నా భార్యను బట్టి వారు నన్ను చంపేస్తారు’ అని నాలో నేను అనుకున్నాను.


మూడవ రోజున యోసేపు వారితో, “మీరు ఒక పని చేస్తే బ్రతికి ఉంటారు, ఎందుకంటే నేను దేవునికి భయపడేవాన్ని:


కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు.


మా దేవా! ప్రార్థన వినండి, మేము తిరస్కరించబడిన వారము. వారి నిందలు వారి తలల మీదికే త్రిప్పండి. వారే పరాయి దేశానికి బందీలుగా పోవాలి!


నేను, నా సోదరులు నా పనివారు కూడా ప్రజలకు డబ్బు ధాన్యం అప్పుగా ఇచ్చాము. కాని ఆ అప్పులన్నీ రద్దు చేస్తున్నాము.


నాకన్నా ముందు అధిపతులుగా ఉన్నవారు ప్రజలపై భారాన్ని మోపి వారి నుండి నలభై షెకెళ్ళ వెండిని, ఆహారాన్ని ద్రాక్షరసాన్ని తీసుకునేవారు. వారి సహాయకులు కూడా ప్రజల మీద భారం మోపారు. అయితే దేవుని భయం ఉన్న నేను అలా చేయలేదు.


ఒకవేళ మీ కోపం యొక్క శక్తి ఎవరు గ్రహించగలరు! మీ ఉగ్రత మీకు చెందిన భయంలా భీకరంగా ఉంటుంది.


హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు.


అమాయకులకు జరిమానా విధించడం మంచిది కాకపోతే, నిజాయితీగల అధికారులను కొట్టడం సరికాదు.


తీర్పుతీర్చుటలో దుష్టుని ఎడల పక్షపాతము చూపుటయు, అమాయకులకు న్యాయం తప్పించుటయు సరికాదు.


ఒక వ్యక్తి తెలివిలేనివాడుగా ఉండడం మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును.


ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సూక్తులే: న్యాయం తీర్చుటలో పక్షపాతము చూపుట మంచిది కాదు


వారు ఏ దేశాల మధ్యకు వెళ్లినా నా పరిశుద్ధ నామాన్ని అపవిత్రం చేశారు, ఎలా అంటే, ‘వారు యెహోవా ప్రజలే అయినప్పటికీ వారు ఆయన దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చింది’ అని వారి గురించి చెప్తారు.


వారి నుండి వడ్డీ లేదా లాభం తీసుకోకండి, అయితే మీ దేవునికి భయపడండి, తద్వారా వారు మీ మధ్యనే జీవించడం కొనసాగించవచ్చు.


ఆ తర్వాత యూదయ, గలిలయ సమరయ ప్రాంతాల్లో ఉన్న సంఘం కొంత సమయం ప్రశాంతాన్ని ఆనందిస్తూ బలపడింది. దేవుని భయాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మచేత ప్రోత్సాహింపబడి, సంఘం సంఖ్య మరింత పెరిగింది.


“నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది” అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది.


కాబట్టి యవ్వన విధవరాండ్రకు నేను చెప్పేది ఏంటంటే, వారు పెళ్ళి చేసుకుని పిల్లలను కని, తమ గృహాలను శ్రద్ధగా చూసుకొంటూ, తమను నిందించడానికి విరోధికి అవకాశమివ్వకుండా చూసుకోవాలి.


స్వీయ నియంత్రణ కలిగి పవిత్రులుగా ఉండమని, తమ గృహాలలో పనులను చేసుకుంటూ దయ కలిగి ఉండమని, తన భర్తలకు విధేయత కలిగి ఉండమని బోధించగలరు, అప్పుడు దేవుని వాక్యాన్ని ఎవరూ దూషించలేరు.


దేవుని ఎరుగనివారు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.


నా కుమారులారా, ఇలా చేయవద్దు. నేను విన్న ఈ విషయం యెహోవా ప్రజల మధ్యలో వ్యాపించడం మంచిది కాదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ