Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 3:25 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

25 ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

25 అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహా గోపురమువరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను; అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

25 ఆ భాగాన్ని ఆనుకుని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజు భవనం ఉండే మహా గోపురం దాకా ఊజై కొడుకు పాలాలు బాగు చేశాడు. దాని పక్కన పరోషు కొడుకు పెదాయా బాగు చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

25 ఊజై కుమారుడు పాలాలు ప్రాకారపు మలుపు నుంచి గోపురం దాకా పనిచేశాడు. రాజు పై అంతస్తు దగ్గర, అది రాజుగారి రక్షకభటుల ఆవరణానికి దగ్గర వున్న గోవురం. పరోషు కొడుకు పెదాయా పొలాలు పక్కన పని చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

25 ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 3:25
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు.


అప్పుడు ధర్మశాస్త్ర శాస్త్రియైన ఎజ్రా చెక్కతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడ్డాడు. అతని కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కీయా, మయశేయా అనేవారు ఉన్నారు; ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాము అనేవారు ఉన్నారు.


‘నేను విశాలమైన పై గదులున్న గొప్ప రాజభవనాన్ని నిర్మించుకుంటాను’ అని అతడు అనుకుంటాడు. కాబట్టి దానికి పెద్ద కిటికీలు చేయించుకుని, దేవదారుతో పలకలు అతికి వాటికి ఎరుపురంగు పూసి అలంకరిస్తాడు.


బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు.


యిర్మీయా ఇంకా కావలివారి ప్రాంగణంలో బంధించబడి ఉండగా, యెహోవా వాక్కు అతనికి రెండవసారి వచ్చింది:


రాజైన సిద్కియా యిర్మీయాను కావలివారి ప్రాంగణంలో ఉంచి, పట్టణంలోని రొట్టెలన్నీ పూర్తిగా అయిపోయే వరకు ప్రతిరోజు రొట్టెలు చేసేవారి వీధి నుండి ఒక రొట్టె ఇవ్వమని ఆజ్ఞాపించాడు. కాబట్టి యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు.


వారు అతన్ని త్రాళ్లతో పైకి లాగి బందీకానా నుండి పైకి లేపారు. యిర్మీయా కావలివారి ప్రాంగణంలో ఉండిపోయాడు.


బబులోనీయులు రాజభవనాలన్నిటిని ప్రజల ఇళ్ళను తగలబెట్టి యెరూషలేము గోడలను పడగొట్టారు.


మందకు కావలికోటగా, సీయోను కుమార్తె దుర్గంగా ఉన్న నీకైతే, మునుపటి అధికారం తిరిగి ఇవ్వబడుతుంది; యెరూషలేము కుమార్తెకు రాజ్యాధికారం వస్తుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ