Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 2:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 పట్టణ గోడకు, ఆలయానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ఉండబోయే ఇంటికి దూలాలు, మ్రానులు ఇచ్చేలా రాజు అడవులపై అధికారియైన ఆసాపుకు ఉత్తరం ఇవ్వండి” అని అడిగాను. నా దేవుని కృప హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి రాజు నా అభ్యర్థన విన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 పట్టణప్రాకారమునకును, మందిరముతో సంబంధించిన కోటగుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని, దూలములు మ్రానులు ఇచ్చునట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయ్యుడని అడిగితిని; ఆలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తముకొలది రాజు నా మనవి ఆలకించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 రాజుగారి అడవులపై అధికారి అయిన ఆసాపుకు కూడా లేఖ రాసి ఇవ్వండి. యెరూషలేం ఆలయం దగ్గర ఉన్న కోట తలుపుల కోసం, కోట గోడ కోసం, నేను నివసించబోయే ఇంటి దూలాల కోసం అతడు కలప ఇవ్వాలి.” దేవుని కరుణా హస్తం నాపై ఉన్నందువల్ల రాజు నా మనవి విన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 నగర ప్రాకార ద్వారాలకూ, గోడలకూ, ఆలయ ప్రాకారానికీ, నా యింటికీ కలప కావాలి. తమ అడవులకు బాధ్యుడైన అధికారి ఆసాపుకి ఒక లేఖ ఇవ్వండి.” రాజు నాకు లేఖలే కాకుండా, నేను కోరినవన్నీ ఇచ్చాడు. నా పట్ల దేవుని దయ కారణంగా రాజు ఇవన్నీ చేశాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 పట్టణ గోడకు, ఆలయానికి సంబంధించిన కోట గుమ్మాలకు, నేను ఉండబోయే ఇంటికి దూలాలు, మ్రానులు ఇచ్చేలా రాజు అడవులపై అధికారియైన ఆసాపుకు ఉత్తరం ఇవ్వండి” అని అడిగాను. నా దేవుని కృప హస్తం నాకు తోడుగా ఉంది కాబట్టి రాజు నా అభ్యర్థన విన్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 2:8
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు ఆ మనుష్యుడు, “ఇకమీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు, ఎందుకంటే నీవు దేవునితో, మనుష్యులతో పోరాడి గెలిచావు” అని అన్నాడు.


అయితే వారి దేవుని దృష్టి యూదుల పెద్దలను కాపాడుతూ ఉంది కాబట్టి ఈ సమాచారం దర్యావేషుకు చేరి అతని దగ్గర నుండి వ్రాతపూర్వక జవాబు వచ్చేవరకు వారు పని చేయడం ఆపలేదు.


ఇశ్రాయేలీయుల దేవుని మందిరపు పనిలో సహకరించేలా యెహోవా అష్షూరు రాజు హృదయాన్ని మార్చి వారికి సంతోషాన్ని కలిగించినందుకు వారు ఏడు రోజులు పులియని రొట్టెల పండుగను ఆనందంతో జరుపుకున్నారు.


అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను: యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు.


ఈ ఎజ్రా బబులోను నుండి తిరిగి వచ్చాడు. అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇచ్చిన మోషే ధర్మశాస్త్రంలో ఆరితేరిన శాస్త్రి. తన దేవుడైన యెహోవా హస్తం అతనికి తోడుగా ఉన్నందున అతడు అడిగిన వాటన్నిటిని రాజు అతనికి ఇచ్చాడు.


తన దేవుని కరుణాహస్తం అతనికి తోడుగా ఉన్నందుకు అతడు మొదటి నెల మొదటి రోజున బబులోను నుండి బయలుదేరి, అయిదవ నెల మొదటి రోజున యెరూషలేము చేరుకున్నాడు.


నా సోదరుడైన హనానీతో పాటు కోటకు అధిపతియైన హనన్యాను యెరూషలేముపై అధికారులుగా నియమించాను. హనన్యా నమ్మకమైనవాడు, అందరికంటే ఎక్కువగా దేవుని భయం ఉన్నవాడు.


యెహోవా చేతిలో రాజు హృదయం నీటి కాలువ ఆయనకు ఇష్టులైన వారివైపు దాని త్రిప్పుతారు.


తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను.


పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను.


మీరు ఇది చూసినప్పుడు మీ హృదయం సంతోషిస్తుంది మీరు గడ్డిలా వర్ధిల్లుతారు; యెహోవా యొక్క చేతి బలం తన సేవకులకు తెలియజేయబడుతుంది, కాని ఆయన కోపం తన శత్రువులకు చూపించబడుతుంది.


ఆ అధిపతి దానియేలు పట్ల దయ కరుణ చూపించేలా దేవుడు చేశారు.


అయితే ఈ రోజు వరకు దేవుడు నాకు సహాయం చేశాడు; కాబట్టి క్రీస్తు శ్రమపడి, చనిపోయినవారిలో నుండి మొదటివానిగా లేస్తాడనేది, తన సొంత ప్రజలకు, యూదేతరులకు వెలుగును ప్రచురిస్తుందని మోషే ప్రవక్తలు చెప్పినవి మించి ఏమి చెప్పకుండా ఇక్కడ నిలబడి గొప్పవారికి అల్పులకు ఒకేలా సాక్ష్యం చెప్తున్నాను” అని చెప్పాడు.


కానీ దేవుడు అతనికి తోడుగా ఉండి, అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించారు. ఆయన యోసేపుకు జ్ఞానం ఇచ్చి ఈజిప్టు రాజైన ఫరో దయ పొందుకొనేలా చేశారు. కాబట్టి ఫరో ఈజిప్టు దేశమంతటిమీద అలాగే అతని రాజభవనం మీద కూడా అతన్ని అధికారిగా నియమించాడు.


మీ పట్ల నాకున్న శ్రద్ధనే తీతు హృదయంలో కూడా కలిగించిన దేవునికి కృతజ్ఞతలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ