Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 12:39 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱెల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయీం ద్వారం మీదగా వెళ్లి, పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, హనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్ళి, గొర్రెల ద్వారం వరకూ ఎక్కి బందీ గృహం ద్వారం దగ్గర నిలిచారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

39 తర్వాత వాళ్లు ఈ క్రింది ద్వారాలు దాటారు: ఎఫ్రాయిము గుమ్మము, పురాతన గుమ్మము, మత్స్య గుమ్మము హనాన్యేలు శిఖరము, శతశిఖరము, గొర్రెల ద్వారం దాటి చివరకు కావలి ద్వారం దగ్గర ఆగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 వారు ఎఫ్రాయిం ద్వారం మీదగా వెళ్లి, యెషానా గుమ్మాన్ని, చేప గుమ్మాన్ని, హనానేలు గోపురాన్ని, వందవ గోపురాన్ని దాటి గొర్రెల గుమ్మం వరకు వెళ్లి కాపలా గుమ్మం దగ్గర ఆగారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 12:39
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బేత్-షెమెషులో అహజ్యా మనుమడు, యోవాషు కుమారుడు, యూదా రాజైన అమజ్యాను పట్టుకున్నాడు. అప్పుడు యెహోయాషు యెరూషలేముకు వచ్చి ప్రాకారాన్ని, ఎఫ్రాయిం ద్వారం నుండి మూల ద్వారం వరకు దాదాపు నాలుగు వందల మూరలు పడగొట్టాడు.


అప్పుడు కృతజ్ఞతాగీతాలు పాడే గాయకుల రెండు బృందాలు, నేను, నాతో పాటు ఉన్న అధికారులలో సగం మంది దేవుని మందిరంలో నిలబడ్డాము.


ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు అతని సోదరులైన యాజకులును వెళ్లి గొర్రెల గుమ్మాన్ని కట్టి ప్రతిష్ఠించి దాని తలుపులు నిలబెట్టారు. వందవ గోపురం వరకు, హనానేలు గోపురం వరకు వారు నిర్మించి ప్రతిష్ఠించారు.


ఆ ప్రక్క భాగాన్ని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహా గోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగుచేశాడు. దాని ప్రక్కన పరోషు కుమారుడైన పెదాయా బాగుచేశాడు.


చేప గుమ్మాన్ని హస్సెనాయా కుమారులు తిరిగి కట్టారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు అమర్చారు.


యెషానా గుమ్మాన్ని పాసెయ కుమారుడైన యెహోయాదా బెసోద్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేశారు. వారు దానికి దూలాలు పెట్టి, తలుపులు నిలబెట్టి, తాళాలు గడియలు బిగించారు.


అలాగే ప్రజలందరు వెళ్లి కొమ్మలు తెచ్చి తమ ఇళ్ళ కప్పుల మీద, తమ వాకిటిలో, దేవుని ఆలయ ఆవరణంలో, నీటి గుమ్మపు వీధిలో, ఎఫ్రాయిం గుమ్మపు వీధిలో తాత్కాలిక నివాసాలు కట్టుకున్నారు.


యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “హనానేలు గోపురం నుండి మూల ద్వారం వరకు ఈ పట్టణం నా కోసం తిరిగి కట్టబడే రోజులు వస్తున్నాయి.


బబులోను రాజు సైన్యం యెరూషలేము మీద దాడి చేస్తున్నప్పుడు యిర్మీయా ప్రవక్త యూదా రాజభవనంలోని కావలివారి ప్రాంగణంలో బంధించబడ్డాడు.


“ఆ దినాన యెరూషలేములో ఉన్న చేప ద్వారం నుండి ఏడుపు, పట్టణ దిగువ భాగం నుండి రోదన, కొండల దిక్కునుండి గొప్ప నాశనం వస్తుంది, అని యెహోవా ప్రకటిస్తున్నారు.


యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బేతెస్ద అనబడే ఒక కోనేరు ఉంది. దాని చుట్టూ అయిదు మండపాలు ఉన్నాయి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ