Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నెహెమ్యా 1:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి యేడ్చి, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి, ఆకాశమందలి దేవుని యెదుట విజ్ఞాపన చేసితిని.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి, కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 యెరూషలేము ప్రజలను గురించి, ప్రాకారం గురించీ ఈ విషయాలు విన్నాక, నేను చాలా కలత చెందాను. నేను కూర్చుండి విలపించాను. నా విచారానికి అవధి లేకపోయింది. నేను కొన్ని రోజులపాటు ఉపవాసం వుండి, పరలోక దేవునికి ప్రార్థనలు చేశాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 ఈ మాటలు విన్నప్పుడు నేను క్రింద కూర్చుని ఏడ్చాను. కొన్ని రోజుల వరకు దుఃఖంతో ఉపవాసముండి పరలోకంలో ఉన్న దేవునికి ప్రార్థించాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నెహెమ్యా 1:4
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో నేలపై పడుకున్నాడు.


వారు శపించబడి నాశనమవుతారని ఈ స్థలం గురించి ఈ ప్రజల గురించి నే చెప్పిన మాటలు విని నీ హృదయం స్పందించి నీవు యెహోవా ఎదుట తగ్గించుకొని నీ బట్టలు చింపుకొని నా సన్నిధిలో ఏడ్చావు కాబట్టి, నేను కూడా నీ మనవి విన్నానని యెహోవా చెప్తున్నారు.


తర్వాత సొలొమోను అయిదు మూరల పొడవు, అయిదు మూరల వెడల్పు మూడు మూరల ఎత్తుతో ఒక ఇత్తడి వేదికను తయారుచేసి, బయటి ఆవరణ మధ్యలో ఉంచాడు. అతడు వేదికపై నిలబడి, ఇశ్రాయేలు సమాజమంతటి సమక్షంలో మోకరిల్లి, ఆకాశం వైపు చేతులు చాపాడు.


“పర్షియా రాజైన కోరెషు చెప్పేది ఇదే: “ ‘పరలోకపు దేవుడైన యెహోవా నాకు భూమిపై ఉన్న అన్ని రాజ్యాలను ఇచ్చారు. యూదాలోని యెరూషలేములో తనకు మందిరాన్ని నిర్మించడానికి నన్ను నియమించారు.


ఎజ్రా దేవుని మందిరం ఎదుట నేలమీద పడి ఏడుస్తూ పాపాలను ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీయులలో స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు పెద్ద సమూహంగా అతని చుట్టూ చేరి వారు కూడా బిగ్గరగా ఏడ్చారు.


ఇది విని నేను నా చొక్కా, పై వస్త్రం చింపుకుని, తలవెంట్రుకలు, గడ్డం పీక్కుని దిగ్భ్రాంతితో కూర్చుండిపోయాను.


తర్వాత, సాయంత్రపు బలి అర్పించే సమయానికి నేను నా అవమానం నుండి లేచి, చినిగిన చొక్కా పై వస్ర్తంతోనే మోకాళ్లమీద పడి, నా దేవుడైన యెహోవా వైపు చేతులెత్తి


అందుకు నేను, “పరలోకపు దేవుడే మాకు విజయాన్ని ఇస్తారు కాబట్టి ఆయన సేవకులమైన మేము పునర్నిర్మాణం మొదలుపెడతాము. మీకు యెరూషలేములో భాగం గాని, చారిత్రాత్మకమైన హక్కు గాని లేదు” అని వారితో చెప్పాను.


అప్పుడు రాజు, “నీకు ఏమి కావాలి?” అని అడిగాడు. నేను పరలోకపు దేవునికి ప్రార్థనచేసి,


జనులు యెహోవా నామానికి భయపడతారు, భూరాజులంతా మీ మహిమ ఎదుట వణకుతారు.


పరలోక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.


బబులోను నదుల దగ్గర మనం కూర్చుని సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.


ఆ సమయంలో దానియేలు అనే నేను మూడు వారాలు విలపిస్తూ ఉన్నాను.


దానియేలు, అతని స్నేహితులు, బబులోనులో ఉన్న ఇతర జ్ఞానులతో పాటు చంపబడకుండునట్లు, పరలోక దేవుడు ఆ మర్మాన్ని తెలియజేసేలా ఆయన కరుణ కోసం ప్రాధేయపడమని వారిని బలవంతం చేశాడు.


కాబట్టి నేను ప్రభువైన దేవుని వైపు తిరిగి ప్రార్థన, విన్నపం ద్వారా ఆయనను ప్రాధేయపడ్డాను, ఉపవాసముండి, గోనెపట్ట చుట్టుకొని, బూడిద మీద పోసుకున్నాను.


అందుకతడు, “నేను హెబ్రీయున్ని; సముద్రాన్ని ఎండిన నేలను సృజించిన పరలోక దేవుడైన యెహోవాను ఆరాధిస్తాను” అన్నాడు.


“నీ నియమించబడిన పండుగలకు రాలేక దుఃఖించే వారందరినీ నేను మీ మధ్య నుండి తొలగిస్తాను. వారు మీకు భారంగా నిందగా ఉన్నారు.


ఆనందించే వారితో కలిసి ఆనందించండి, దుఃఖించేవారితో కలిసి దుఃఖించండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ