నెహెమ్యా 1:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 వారు నాతో, “చెరలో పడకుండ బయటపడ్డవారు మన దేశంలోనే ఉన్న ఎంతో శ్రమను అవమానాన్ని అనుభవిస్తున్నారు. యెరూషలేము గోడ కూలిపోయింది. దాని గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 వారు–చెరపట్టబడినవారిలో శేషించినవారు ఆ దేశములో బహుగా శ్రమను నిందను పొందు చున్నారు; మరియు యెరూషలేముయొక్క ప్రాకారము పడద్రోయబడినది; దాని గుమ్మములును అగ్నిచేత కాల్చ బడినవని నాతో చెప్పిరి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అందుకు వారు “చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు. నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది. కోట తలుపులు కాలిపోయాయి” అని నాతో చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్3 హనానీయ, అతనితో ఉన్న వాళ్లూ ఇలా చెప్పారు: “నెహెమ్యా, చెరనుంచి తప్పించుకొనిపోయి యింకా యూదాలోనే ఉన్న యూదులు చాలా యిబ్బందుల్లో వున్నారు. వాళ్లకి అనేక సమస్యలు ఎదురౌతున్నాయి. వాళ్లు చాలా సిగ్గుతోను, అనేక కష్టాలతోను వుంటున్నారు. ఎందుకంటే, యెరూషలేము ప్రాకారం కూల్చబడింది. దాని ద్వారాలు దగ్ధం చేయబడ్డాయి.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 వారు నాతో, “చెరలో పడకుండ బయటపడ్డవారు మన దేశంలోనే ఉన్న ఎంతో శ్రమను అవమానాన్ని అనుభవిస్తున్నారు. యెరూషలేము గోడ కూలిపోయింది. దాని గుమ్మాలు అగ్నితో కాల్చబడ్డాయి” అని చెప్పారు. အခန်းကိုကြည့်ပါ။ |