Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నహూము 3:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను నీకు వ్యతిరేకిని, నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, దేశాలకు నీ నగ్నత్వాన్ని రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 నీవు చేసిన అధిక జారత్వమునుబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే–నేను నీకు విరోధినైయున్నాను, నీ చెంగులు నీ ముఖముమీద కెత్తి జనములకు నీ మానమును రాజ్యములకు నీ యవమానమును నేను బయలుపరతును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే “నేను నీకు విరోధిని. నీ బట్టలు నీ ముఖం పైకి ఎత్తి ప్రజలకు నీ మర్మాంగాలను చూపిస్తాను. రాజ్యాలకు నీ అవమానాన్ని బట్టబయలు చేస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “నీనెవె, నీకు నేను విరోధిని. నీ బట్టలను నీ ముఖంమీదకి లాగుతాను. నీ నగ్నత్వాన్ని రాజ్యాలన్నిటికీ చూపిస్తాను. ఆ రాజ్యాలన్నీ నీవు సిగ్గుపడటం చూస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “నేను నీకు వ్యతిరేకిని, నేను నీ వస్త్రాలను నీ ముఖం మీదుగా ఎత్తి, దేశాలకు నీ నగ్నత్వాన్ని రాజ్యాలకు నీ అవమానాన్ని చూపిస్తాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నహూము 3:5
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

“నాకే ఎందుకు ఇలా జరిగింది?” అని నిన్ను నీవు ప్రశ్నించుకుంటే నీ అనేక పాపాల కారణంగానే నీ వస్త్రాలు చింపబడ్డాయి నీ శరీరం అసభ్యంగా తాకబడింది.


“నీ అవమానం కనబడేలా నీ ముఖం మీది బట్టను నేను లాగివేస్తాను.


సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అహంకారి, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నీ శ్రమ దినం వచ్చింది, నీవు శిక్షించబడే సమయం వచ్చింది.


నీకు ఇష్టమైన నీ ప్రేమికులందరిని నీవు ప్రేమించినవారిని అలాగే నీవు ద్వేషించిన వారందరిని పోగుచేస్తాను. నీ చుట్టూ వారిని పోగు చేసి వారు నీ నగ్న శరీరాన్ని చూసేలా వారి ఎదుట నిన్ను వివస్త్రను చేస్తాను.


యెహోవా ఇలా చెప్తున్నారు: ‘ఓ ఇశ్రాయేలూ, నేను నీకు విరోధంగా ఉన్నాను. ఒర నుండి నా ఖడ్గాన్ని దూసి నీలో ఉన్న నీతిమంతులను, దుర్మార్గులను హతమారుస్తాను.


నేను రోషంతో నా కోపాన్ని చూపించగా కోపాగ్రతతో వారు నిన్ను శిక్షిస్తారు. వారు నీ ముక్కు నీ చెవులు నరికివేస్తారు, నీలో మిగిలి ఉన్నవారు కత్తివేటుకు కూలిపోతారు. నీ కుమారులను కుమార్తెలను వారు తీసుకెళ్తారు, నీలో మిగిలిన వారు అగ్నిచేత కాల్చబడతారు.


వారు ద్వేషంతో నిన్ను బాధిస్తారు. నీవు వేటి కోసం కష్టపడ్డావో వాటన్నిటిని తీసుకుంటారు. వారు నిన్ను నగ్నంగా వదిలివేయగా నీ వేశ్యాత్వం వలన కలిగిన అవమానం బహిర్గతమవుతుంది.


కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: తూరు పట్టణమా, నేను నీకు విరోధిని. సముద్రంలో అలలు పొంగినట్లు అనేక జనాంగాలను నీ మీదికి రప్పిస్తాను.


షాఫీరు వాసులారా, దిగంబరులై సిగ్గు పడుతూ దాటి వెళ్లండి. జయనాను నివాసులు బయటకు రారు. బేత్-ఏజెల్ శోకంలో ఉంది; అది ఇక ఎన్నడు మిమ్మల్ని కాపాడదు.


సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు “నేను నీకు వ్యతిరేకిని, నీ రథాల నుండి పొగ వచ్చేలా కాల్చివేస్తాను, ఖడ్గం నీ కొదమ సింహాలను చంపివేస్తుంది. నేను భూమ్మీద నీకు ఏ ఎర దొరక్కుండా చేస్తాను. నీ దూతల స్వరాలు ఇక వినబడవు.”


కీర్తికి బదులుగా నీకు అవమానం కలుగుతుంది కాబట్టి ఇప్పుడు నీ వంతు! నీవు కూడా త్రాగి నీ నగ్నత్వాన్ని చూపించుకుంటావు. యెహోవా కుడిచేతిలోని పాత్ర నీ దగ్గరకు వస్తోంది, అవమానం నీ కీర్తిని కప్పివేస్తుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ