Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




నహూము 2:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 దోచుకొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రాయేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 దోపిడీ దారులు యాకోబు సంతతి వారిని దోచుకున్నా వాళ్ళ ద్రాక్ష తోటలను నరికివేసినా ఇశ్రాయేలీయుల వైభవం వలే యెహోవా యాకోబు సంతతి వారికి పూర్వ వైభవం తిరిగి కల్పిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 ఎందుకంటే ఇశ్రాయేలు ప్రభావంవలె యాకోబుకు తన ప్రభావాన్ని యెహోవా తిరిగి ఇస్తున్నాడు. అష్షూరీయులు ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేశారు. వారి ద్రాక్షాచెట్లను నాశనం చేశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 దోపిడిదారులు యాకోబును దోచుకున్నప్పటికీ, వారి ద్రాక్షతీగెలను నాశనం చేసినప్పటికీ, యెహోవా ఇశ్రాయేలు వైభవంలా, యాకోబు వైభవాన్ని తిరిగి ఇస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




నహూము 2:2
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

మన వారసత్వాన్ని మన కోసం ఏర్పాటు చేశారు. అది తాను ప్రేమించిన యాకోబు గర్వకారణము. సెలా


“నీవు విడిచిపెట్టబడి, ద్వేషించబడి నీ మార్గంలో ఎవరూ ప్రయాణించకపోయినా, నేను నిన్ను శాశ్వత ఘనతగా అన్ని తరాలకు ఆనందంగా చేస్తాను.


ఇదిగో, నా పేరు ఉన్న పట్టణం మీదికి నేను విపత్తు రప్పించబోతున్నాను, మీరు నిజంగా శిక్షించబడరా? మీరు శిక్షించబడకుండా ఉండరు, ఎందుకంటే నేను భూమిపై నివసించే వారందరిపై ఖడ్గాన్ని రప్పిస్తున్నాను, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’


“మోయాబు యవ్వన నుండి ప్రశాంతంగా ఉండింది, ఒక బాన నుండి మరొక బానలో పోయబడని, అడుగున మడ్డితో ఉన్న ద్రాక్షరసంలా ఉండింది, అది చెరలోకి వెళ్లలేదు. కాబట్టి దాని రుచి ఎప్పటిలాగే ఉంది, దాని సువాసన మారలేదు.”


ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా? రాత్రివేళ దొంగలు వస్తే, వారికి కావలసినంత వారు దొంగిలించరా?


వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలీయులు చెదరిపోయిన దేశాల నుండి నేను వారిని బయటకి తీసుకువస్తాను. వారిని చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి సమకూర్చి వారి స్వదేశానికి తిరిగి రప్పిస్తాను.


వారు ఇకపై తమ విగ్రహాలతో, నీచమైన చిత్రాలతో గాని వారి నేరాలతో గాని తమను తాము అపవిత్రం చేసుకోరు, ఎందుకంటే వారు పాపాలు చేస్తూ నివసించిన ప్రతి స్థలం నుండి నేను వారిని రక్షించి, వారిని శుద్ధి చేస్తాను. వారు నా ప్రజలుగా ఉంటారు, నేను వారికి దేవుడనై ఉంటాను.


ఇశ్రాయేలు విస్తరించిన ద్రాక్షచెట్టు; అతడు బాగా ఫలించాడు. అతడు ఫలించినకొద్దీ, అతడు ఎక్కువ బలిపీఠాలను కట్టాడు. అతని భూమి సారవంతమైన కొద్ది, అతడు తన పవిత్ర రాళ్లను అలంకరించాడు.


ఆమె కొల్లగొట్టబడి దోచుకోబడి పాడుచేయబడుతుంది! హృదయాలు కరిగిపోతున్నాయి, మోకాళ్లు వణుకుతున్నాయి, శరీరాలు వణుకుతున్నాయి, ప్రతీ ముఖం పాలిపోతుంది.


ముట్టడివేసే సమయానికి నీళ్లు తోడుకో, నీ కోటలను బలపరచుకో! బురదలోకి దిగు, ఇటుకలు తయారుచేయడానికి బురదను త్రొక్కు, ఇటుక బట్టీలను సిద్ధపరచు.


ఆ దినాన యెరూషలేమా, నీవు నా మీద తిరుగబడి చేసిన పనుల గురించి నీవు సిగ్గుపడవు, ఎందుకంటే నీ గర్వాన్ని బట్టి సంతోషించేవారిని నేను నీలో నుండి తొలగిస్తాను. నా పరిశుద్ధ కొండపై ఇంకెప్పుడు నీవు గర్వపడవు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ