నహూము 1:14 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 నీనెవే, నీ గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: “నీ పేరు పెట్టుకునే సంతతివారు ఎవరూ ఉండరు. నీ దేవతల గుడిలో ఉన్న ప్రతిమలను, విగ్రహాలను నాశనం చేస్తాను. నీవు నీచుడవు, కాబట్టి, నీ సమాధిని సిద్ధం చేస్తాను.” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 నీనెవే, యెహోవా నిన్నుబట్టి ఆజ్ఞ ఇచ్చునదేమనగా–నీ పేరు పెట్టుకొనువారు ఇకను పుట్టక యుందురు, నీ దేవతాలయములో చెక్కబడిన విగ్రహమేగాని పోతపోసిన ప్రతిమయేగాని యొకటియులేకుండ అన్నిటిని నాశనముచేతును. నీవు పనికిమాలినవాడవు గనుక నేను నీకు సమాధి సిద్ధపరచుచున్నాను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 నీనెవే పట్టణమా, నీ గురించి యెహోవా ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే, నీ పేరు పెట్టుకొనేవాళ్ళు ఇకపై పుట్టరు. నీ ఆలయాల్లో చెక్కిన విగ్రహాలను, పోతవిగ్రహాలను ఒక్కటి కూడా లేకుండా అన్నిటినీ నాశనం చేస్తాను. నువ్వు నీచుడవు గనక నీకు సమాధి సిద్ధం చేస్తున్నాను. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్14 అష్షూరు రాజా, నీ విషయంలో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. “నీ పేరు పెట్టుకోటానికి నీ సంతతివారు ఉండరు. నీ దేవుళ్ల ఆలయాలలో నెలకొల్పిన, చెక్కిన విగ్రహాలను, లోహపు బొమ్మలను నేను తీసివేస్తాను. నేను నీ కొరకు నీ సమాధిని తయారు చేస్తున్నాను. నీవు ముఖ్యుడవు కావు!” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 నీనెవే, నీ గురించి యెహోవా ఇలా ఆజ్ఞాపించారు: “నీ పేరు పెట్టుకునే సంతతివారు ఎవరూ ఉండరు. నీ దేవతల గుడిలో ఉన్న ప్రతిమలను, విగ్రహాలను నాశనం చేస్తాను. నీవు నీచుడవు, కాబట్టి, నీ సమాధిని సిద్ధం చేస్తాను.” အခန်းကိုကြည့်ပါ။ |