Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మార్కు 4:39 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 అందుకాయన లేచి గాలిని గద్దించి–నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా, గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 ఆయన లేచి గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ, “శాంతించు! ఆగిపో!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి ఆగిపోయింది. అంతా ప్రశాంతంగా మారింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

39 ఆయన లేచి గాలిని, అలల్ని గద్దిస్తూ, “ఆగిపో, నెమ్మదించు!” అని ఆజ్ఞాపించాడు. వెంటనే గాలి తీవ్రత తగ్గిపోయింది. అంతటా శాంతం ఏర్పడింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

39 ఆయన లేచి గాలిని గద్దించి, అలలతో, “నిశ్శబ్దం! కదలకుండా ఉండు!” అని చెప్పారు. అప్పుడు గాలి ఆగిపోయి అక్కడ అంతా నిశ్శబ్దమయింది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మార్కు 4:39
21 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇక్కడి వరకు నీవు రావచ్చు ఇంతకు మించి కాదు; నీ అహంకార అలలు ఇక్కడే ఆగిపోవాలి,


అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు, సముద్ర తరంగాలు సద్దుమణిగాయి.


మెరుపులు, వడగళ్ళు, మంచు, మేఘాలు, ఈదురు గాలులు,


యెహోవా ప్రళయజలాల మీద ఆసీనులయ్యారు; ఆయనే నిరంతరం రాజుగా పరిపాలిస్తున్నారు.


సముద్రం యొక్క హోరును, అలల యొక్క ఘోషను దేశాల్లోని కలకలాన్ని నిమ్మళం చేసేవారు ఆయనే.


పొంగే సముద్రాన్ని మీరు అదుపులో ఉంచుతారు; అలలను మీరు అణచివేస్తారు.


నీ కర్ర ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేతిని చాపి దానిని పాయలుగా చేయి అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేలమీద నడిచివెళ్తారు.


ఇశ్రాయేలీయులు సముద్రం గుండా ఆరిన నేల మీద నడిచివెళ్లారు. వారి కుడి ఎడమల వైపు నీళ్లు గోడల వలె నిలబడ్డాయి.


నీరు తమ హద్దులు దాటి రాకుండా దేవుడు సముద్రానికి పొలిమేరను ఏర్పరచినప్పుడు, ఆయన భూమి యొక్క పునాదులు నిర్ణయించినపుడు.


మీరు నాకు భయపడరా?” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు. “నా సన్నిధిలో మీరు వణకరా? నేను సముద్రానికి ఇసుకను ఒక సరిహద్దుగా చేశాను, అది దాటకూడని ఒక నిత్యమైన హద్దు, అలలు ఎగసిపడవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు; అవి గర్జించవచ్చు, కాని అవి దాన్ని దాటలేవు.


ఎవ్వరూ ప్రభువుచేత శాశ్వతంగా త్రోసివేయబడరు.


ఆయన సముద్రాన్ని గద్దించి దానిని ఆరిపోయేలా చేస్తారు; నదులన్నిటినీ ఆయన ఎండిపోయేలా చేస్తారు. బాషాను కర్మెలు ఎండిపోతాయి, లెబానోను పువ్వులు వాడిపోతాయి.


అందుకు ఆయన, “అల్పవిశ్వాసులారా, మీరు ఎందుకంతగా భయపడుతున్నారు?” అని కోప్పడి లేచి గాలులను అలలను గద్దించారు. అప్పుడు అంతా ప్రశాంతంగా మారిపోయింది.


యేసు ఆ పడవ వెనుక భాగంలో, దిండు వేసుకుని నిద్రపోతున్నారు. శిష్యులు ఆయనను నిద్ర లేపి ఆయనతో, “బోధకుడా, మేము మునిగిపోతున్నా నీకు చింత లేదా?” అని అన్నారు.


ప్రజలు గుంపుగా తన దగ్గరకు పరుగెత్తికొని వస్తున్నారని యేసు చూసి, “మూగ, చెవిటి దయ్యమా, ఇతనిలో నుండి బయటకు రా, ఇంకెప్పుడు వానిలో ప్రవేశింపకూడదని నీకు ఆజ్ఞాపిస్తున్నాను” అని ఆ అపవిత్రాత్మను గద్దించారు.


అందుకు యేసు, “మాట్లాడకు!” అని అంటూ, “వానిలో నుండి బయటకు రా!” అని గద్దించారు. అప్పుడు ఆ దయ్యం వానికి ఏ గాయం చేయకుండ వారందరి ముందు వానిని పడవేసి బయటకు వచ్చేసింది.


కాబట్టి ఆయన ఆమె వైపుకు వంగి జ్వరాన్ని గద్దించారు, జ్వరం ఆమెను వదిలిపోయింది. వెంటనే ఆమె లేచి వారికి పరిచారం చేయడం మొదలుపెట్టింది.


కాబట్టి శిష్యులు ఆయన దగ్గరకు వెళ్లి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అని అంటూ ఆయనను లేపారు. ఆయన లేచి, గాలిని ఉప్పొంగుతున్న నీటిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ