Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మీకా 1:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. నేను నక్కలా అరుస్తాను, గుడ్లగూబలాగా మూలుగుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 దీని చూచి నేను కేకలు వేయుచు ప్రలాపించుచున్నాను, ఏమియులేకుండ దిగం బరినై నక్కలు అరచునట్లు అరచుచున్నాను. నిప్పుకోడి మూల్గునట్లు మూల్గుచున్నాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

8 ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను. నేను పాదరక్షలుకూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను. నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను. నిప్పుకోళ్లలా మూల్గుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 దీనిని బట్టి నేను ఏడుస్తూ విలపిస్తాను; నేను చెప్పులు లేకుండా, దిగంబరిగా బయట తిరుగుతాను. నేను నక్కలా అరుస్తాను, గుడ్లగూబలాగా మూలుగుతాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మీకా 1:8
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజైన హిజ్కియా పాలన యొక్క పద్నాలుగవ సంవత్సరంలో అష్షూరు రాజైన సన్హెరీబు యూదా దేశంలోని కోటగోడలున్న పట్టణాలన్నిటి మీద దాడిచేసి వాటిని స్వాధీనం చేసుకున్నాడు.


మొర్దెకై జరిగిందంతా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని వేదనతో గట్టిగా ఏడుస్తూ పట్టణంలోనికి వెళ్లాడు.


నేను నక్కలకు సోదరుడనయ్యాను, గుడ్లగూబలకు సహచరుడనయ్యాను.


నేను ఎడారి గుడ్లగూబలా, శిధిలాల మధ్య బిగ్గరగా అరిచే గుడ్లగూబలా ఉన్నాను.


ఎడారి జీవులు అక్కడ పడుకుంటాయి, వారి ఇళ్ళ నిండ నక్కలు ఉంటాయి; గుడ్లగూబలు అక్కడ నివసిస్తాయి కొండమేకలు అక్కడ గంతులు వేస్తాయి.


దాని కోటలలో హైనాలు, దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. దాని కాలం ముగిసిపోతుంది దాని రోజులు పొడిగించబడవు.


అందువల్ల యాజెరు ఏడ్చినట్లు నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ ఎల్యాలెహు, నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను. నీ పండిన ఫలాల కోసం నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి.


కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.


అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.


ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా వణకండి; భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, వణకండి మీ మంచి బట్టలు తీసివేసి మీ నడుముకు గోనెపట్ట కట్టుకోండి.


అయ్యో, నా వేదన, నా వేదన! నేను నొప్పితో విలపిస్తున్నాను. అయ్యో, నా హృదయ వేదన! నా గుండె నాలో కొట్టుకుంటుంది, నేను మౌనంగా ఉండలేను. నేను బూరధ్వని విన్నాను; నేను యుద్ధ కేకలు విన్నాను.


అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.


నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.


సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”


“మనుష్యకుమారుడా! ఈజిప్టు అల్లరిమూకల కోసం విలపించు పాతాళంలోకి దిగివెళ్లే వారితో పాటు ఆమెను, బలమైన దేశాల కుమార్తెలను భూమికి అప్పగించు.


ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”


అతడు తన వస్త్రాలను తీసివేసి సమూయేలు ఎదుటనే ప్రవచించాడు. అతడు ఆ రోజు రాత్రి పగలు పై బట్ట లేకుండా పడి ఉన్నాడు. అందువల్లనే, “సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా?” అనే సామెత పుట్టింది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ