Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మత్తయి 21:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 “ ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారీ చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’ అని సీయోను కుమారితో చెప్పండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 –ఇదిగో నీ రాజు సాత్వికుడై, గాడిదను భారవాహక పశువుపిల్లైయెన చిన్న గాడిదను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారితో చెప్పుడి అనునది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 “ఇదిగో నీ రాజు దీనుడుగా గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడని సీయోను కుమారితో చెప్పండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 “‘గాడిదనెక్కి వినయంగా నీ రాజు వస్తున్నాడు చూడు! బరువు మోసే గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు చూడు!’ అని సీయోను కుమారితో చెప్పండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 “ ‘ఇదిగో, గాడిద మీద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారీ చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నాడు’ అని సీయోను కుమారితో చెప్పండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

5 “ ‘ఇదిగో, గాడిద, గాడిదపిల్ల మీద, సాత్వికునిగా స్వారి చేస్తూ, నీ రాజు నీ దగ్గరకు వస్తున్నారు,’ అని సీయోను కుమారితో చెప్పండి.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మత్తయి 21:5
39 ပူးပေါင်းရင်းမြစ်များ  

రాజదండం యూదా దగ్గర నుండి తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండం తొలగదు, అది ఎవరికి చెందుతుందో అతడు వచ్చేవరకు తొలగదు, దేశాలు అతనికి విధేయులై ఉంటాయి.


రాజు సీబాను చూసి, “వీటిని ఎందుకు తెచ్చావు?” అని అడిగాడు. అందుకు సీబా, “గాడిదలు రాజు ఇంటివారు ఎక్కి వెళ్లడానికి, రొట్టె పండ్లు మీతో ఉన్నవారు తినడానికి, ద్రాక్షరసం అరణ్యంలో అలసిపోయిన వారు త్రాగడానికి” అని జవాబిచ్చాడు.


రాజు వారితో, “మీ ప్రభు సేవకులను మీతో తీసుకెళ్లి, నా కుమారుడైన సొలొమోనును నా కంచరగాడిద మీద ఎక్కించి దిగువనున్న గిహోనుకు తీసుకెళ్లండి.


సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో, యెరూషలేములో తన దగ్గర ఉంచాడు.


తద్వార నేను మీ స్తుతులను సీయోను కుమారీ ద్వారాల దగ్గర ప్రకటిస్తాను, మీ రక్షణలో నేనానందిస్తాను.


సీయోను ప్రజలారా, బిగ్గరగా కేకలువేస్తూ సంతోషంతో పాడండి, ఎందుకంటే, మీ మధ్య ఉన్న ఇశ్రాయేలు పరిశుద్ధుడు గొప్పవాడు.”


సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తైన పర్వతం ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, నీ గొంత్తెత్తి బలంగా భయపడకుండా ప్రకటించు; యూదా పట్టణాలకు, “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు.


భూమి అంచుల వరకు యెహోవా చేస్తున్న ప్రకటన: “ ‘ఇదిగో నీ రక్షకుడు వస్తున్నాడు! ఆయన ఇచ్చే బహుమానం ఆయన దగ్గరే ఉంది ఆయన ఇచ్చే జీతం ఆయన దగ్గరే ఉంది’ అని సీయోను కుమార్తెతో చెప్పండి.”


యెహోవానైన నేను వారికి దేవునిగా ఉంటాను, నా సేవకుడైన దావీదు వాటికి అధిపతిగా ఉంటాడు. యెహోవానైన నేను మాట చెప్పాను.


“ ‘నా సేవకుడైన దావీదు వారికి రాజు. వారందరికి ఒకే కాపరి ఉంటాడు. వారు నా ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, నా శాసనాలను పాటించే విషయంలో వారు జాగ్రత్త వహిస్తారు.


అయితే యూదా వారికి నా ప్రేమను చూపించి వారిని రక్షిస్తాను; విల్లు, ఖడ్గం, యుద్ధం, గుర్రాలు, రౌతుల వల్ల కాదు, కాని వారి దేవుడనైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను.”


“అయితే బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబాల మధ్య నీవు చిన్నదానివైనప్పటికి, నా కోసం ఇశ్రాయేలు మీద పరిపాలన చేసే అధిపతి నీలో నుండి వస్తాడు, ఆయన పూర్వకాలం నుండి శాశ్వతకాలం ఉన్నవాడు.”


యాకోబు నుండి రాజ్యమేలేవాడు వస్తాడు. అతడు పట్టణంలో మిగిలిన వారిని నాశనం చేస్తాడు.”


నేను సౌమ్యుడను, వినయ హృదయం గలవాడను కాబట్టి నా కాడి మీమీద ఎత్తుకుని నా దగ్గర నేర్చుకోండి, అప్పుడు మీ ఆత్మలకు విశ్రాంతి దొరుకుతుంది.


వారు, “యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాం” అని చెప్పారు.


“ ‘యూదయ దేశంలోని బేత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం తక్కువదానివి కావు; ఎందుకంటే నా ప్రజలైన ఇశ్రాయేలీయులను కాపాడే అధిపతి నీలో నుండి వస్తాడు.’”


శిష్యులు వెళ్లి, యేసు తమకు ఆదేశించిన ప్రకారం చేశారు.


ఆయన మోషే మొదలుకొని ప్రవక్తలందరు లేఖనాల్లో తనను గురించి వ్రాసిన విషయాలను వారికి వివరించారు.


అప్పుడు నతనయేలు, “రబ్బీ, నీవు దేవుని కుమారుడవు; నీవు ఇశ్రాయేలుకు రాజువు” అని సమాధానం ఇచ్చాడు.


క్రీస్తు యొక్క వినయం సౌమ్యతను బట్టి నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలు అనే నేను మీతో ముఖాముఖిగా ఉన్నపుడు “పిరికివాన్ని” కాని మీకు దూరంగా ఉన్నపుడు “ధైర్యశాలిని.”


అంతేకాక, రాజు గుర్రాలను అధిక సంఖ్యలో సంపాదించవద్దు, వాటిని ఇంకా ఎక్కువ సంపాదించుకునేందుకు ప్రజలను ఈజిప్టుకు తిరిగి వెళ్లనివ్వకూడదు. ఎందుకంటే, “మీరు మరలా ఆ త్రోవలో వెళ్లకూడదు” అని యెహోవా మీకు చెప్పారు.


అతనికి నలభైమంది కుమారులు, ముప్పైమంది మనుమలు ఉన్నారు. వారు డెబ్బై గాడిదల మీద స్వారీ చేసేవారు. అతడు ఎనిమిది సంవత్సరాలు ఇశ్రాయేలును నడిపించాడు.


తెల్ల గాడిదల మీద స్వారీ చేసేవారలారా, తివాచీల మీద కూర్చునే వారలారా, త్రోవలో నడిచే వారలారా, ఇది గమనించండి!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ