Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మత్తయి 10:41 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనేవారు నీతిమంతుని ఫలం పొందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తఫలము పొందును; నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

41 ప్రవక్త అని ఒక ప్రవక్తను చేర్చుకొనేవాడు ప్రవక్తకు దక్కే ప్రతిఫలం పొందుతాడు. నీతిమంతుడని ఒక నీతిమంతుణ్ణి చేర్చుకొనేవాడు నీతిమంతుని ప్రతిఫలం పొందుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

41 ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతుడని నీతిమంతుని చేర్చుకొనేవారు నీతిమంతుని ఫలం పొందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

41 ప్రవక్త అని, ప్రవక్తను చేర్చుకొనేవారు ప్రవక్త ఫలం పొందుతారు. నీతిమంతులు అని, నీతిమంతులను చేర్చుకొనేవారు, నీతిమంతుల ఫలం పొందుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మత్తయి 10:41
27 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఇప్పుడు ఆ మనుష్యుని భార్యను తనకు ఇవ్వు, అతడు ప్రవక్త కాబట్టి నీకోసం ప్రార్థన చేస్తాడు, నీవు బ్రతుకుతావు. ఒకవేళ ఆమెను తిరిగి ఇవ్వకపోతే, నీవు, నీకు సంబంధించిన వారందరు చస్తారు.”


మీకు మేలు కలుగుతుందని నీతిమంతులకు చెప్పండి ఎందుకంటే వారు తాము చేసిన క్రియల ప్రతిఫలాన్ని అనుభవిస్తారు.


ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.


“అందుకు వారు, ‘ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలితో ఉండడం లేదా దాహంతో ఉండడం లేదా పరదేశిగా ఉండడం లేదా బట్టలు లేనివానిగా ఉండడం లేదా రోగిగా లేదా చెరసాలలో ఉండడం చూసి సహాయం చేయలేదు?’ అడుగుతారు.


“అందుకు రాజు, ‘ఈ నా సహోదర సహోదరీలలో బహు అల్పులైనవారికి చేయలేదు కాబట్టి నాకు చేయనట్లే అని ఖచ్చితంగా మీతో చెప్తున్నాను’ అని వారితో అంటాడు.


“మీరు ఇతరులకు కనబడాలని వారి ముందు మీ నీతి క్రియలను చేయకుండ జాగ్రత్తపడండి. ఎందుకంటే మీరు అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి దగ్గర ఫలం పొందరు.


అప్పుడు మీరు ఉపవాసం ఉన్నారని కనిపించని మీ తండ్రికి తప్ప ఇతరులకు తెలియదు; రహస్యంగా చేసింది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.


మీరు చేసే సహాయం రహస్యంగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చేసింది కూడా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.


అయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని, కనిపించని మీ తండ్రికి ప్రార్థన చేయండి. మీరు రహస్యంగా చేసేది చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు.


అడిగే ప్రతి ఒక్కరు పొందుకుంటారు; వెదికేవారు కనుగొంటారు; తట్టేవారికి తలుపు తీయబడుతుంది.


కాబట్టి ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆమె మాతో, “నేను ప్రభువు విశ్వాసినని మీరు భావిస్తే, నా ఇంటికి వచ్చి ఉండవలసిందే” అని తన ఇంటికి రమ్మని బ్రతిమాలి మమ్మల్ని ఆహ్వానించింది.


నేను అలాగే సంఘమంతా ఆనందించేలా ఆతిథ్యమిచ్చే గాయి మీకు వందనాలు తెలియజేస్తున్నాడు. ఈ పట్టణ ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిగా ఉన్న ఎరస్తు, మన సహోదరుడైన క్వర్తు మీకు తమ వందనాలు తెలియజేస్తున్నారు.


నేను ఇష్టపూర్వకంగా ప్రకటిస్తే నాకు బహుమానం దొరుకుతుంది. నాకు నేనుగా కాకపోయినా నామీద నమ్మకంతో నాకు అప్పగించబడిన పనిని మాత్రమే నేను చేస్తున్నాను.


దేవుడు అన్యాయస్థుడు కాడు; ఆయనపై మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి ఆయన ప్రజలకు మీరు చేసిన చేస్తున్న సహాయాన్ని మరచిపోయేవాడు కాడు.


మనం ఇంతవరకు దేనికోసం పని చేశామో దానిని కోల్పోకుండా మీ బహుమానాన్ని సంపూర్ణంగా పొందుకునేలా జాగ్రత్త వహించండి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ