Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




మలాకీ 3:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 “నేను నియమించిన ఆ రోజున వారు నాకు విలువైన స్వాస్థ్యంగా ఉంటారు. తండ్రి తనను సేవించే తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను” అని అంటూ సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 నేను నియమింపబోవు దినము రాగా వారు నావారై నా స్వకీయ సంపాద్యమై యుందురు; తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 “నేను నియమించే రోజు సమీపించినప్పుడు వారు నావారుగా, నా ప్రత్యేక సొత్తుగా ఉంటారు. తండ్రి తనను సేవించే కొడుకును కనికరించే విధంగా నేను వారిని కనికరిస్తాను” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా సెలవిస్తున్నాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 ఆ ప్రజలు నాకు చెందినవాళ్లు. నేను వారికి దయ చూపుతాను. ఒక మనిషి అతనికి విధేయులయ్యే పిల్లల యెడల చాలా దయగలిగి ఉంటాడు. అదే విధంగా, నేను నా అనుచరులయెడల దయగలిగి ఉంటాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 “నేను నియమించిన ఆ రోజున వారు నాకు విలువైన స్వాస్థ్యంగా ఉంటారు. తండ్రి తనను సేవించే తన కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరిస్తాను” అని అంటూ సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




మలాకీ 3:17
40 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు తమను తాము పవిత్రపరచుకుని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి వెళ్లి గుమ్మాలను కనిపెట్టుకుని ఉండాలని లేవీయులను ఆజ్ఞాపించాను. నా దేవా, వీటిని బట్టి కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి! మీ మహా ప్రేమను బట్టి నా మీద దయ చూపించండి.


యెహోవాకు భయపడేవారిని అనగా పిల్లలను పెద్దలను ఆయన దీవిస్తారు.


యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.


మీరిప్పుడు నాకు పూర్తిగా లోబడి నా ఒడంబడికను పాటిస్తే, అన్ని దేశాల్లో మీరు నా విలువైన ఆస్తి అవుతారు. ఈ భూమి అంతా నాదే అయినా,


కాని ఇప్పుడు, దయచేసి వారి పాపాలను క్షమించండి, వారిని మీరు క్షమించకపోతే మీరు వ్రాసిన గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయండి” అని అడిగాడు.


నా ప్రియుడు నావాడు నేను ఆయన దానను; తామర పువ్వుల మధ్య ఆయన నెమ్మదిగా సంచరిస్తున్నాడు.


ఆ రోజు యెహోవా కొమ్మ అందంగా, మహిమగలదిగా ఉంటుంది; ఇశ్రాయేలులో తప్పించుకున్నవారికి భూమి పంట అతిశయంగా, ఘనతగా ఉంటుంది.


అయితే యాకోబూ, నిన్ను సృజించిన యెహోవా ఇశ్రాయేలూ, నిన్ను రూపించినవాడు ఇలా చెప్తున్నారు: “భయపడకు నేను నిన్ను విడిపించాను. పేరు పెట్టి నిన్ను పిలిచాను; నీవు నా వాడవు.


వారు నా కోసం నేను నిర్మించుకున్న ప్రజలు, వారు నా సుత్తిని ప్రకటిస్తారు.


ఎఫ్రాయిం నా ప్రియ కుమారుడు, నేను ఇష్టపడే బిడ్డ కాదా? నేను తరచుగా అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, నేను ఇప్పటికీ అతన్ని జ్ఞాపకముంచుకుంటాను. కాబట్టి నా హృదయం అతని కోసం ఆశపడుతుంది; అతని మీద నాకు చాలా కనికరం ఉంది,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“ఆ కాలం తర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో నేను చేసే నిబంధన ఇదే” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నా ధర్మశాస్త్రాన్ని వారి మనస్సుల్లో ఉంచి, దాన్ని వారి హృదయాల మీద వ్రాస్తాను. నేను వారి దేవుడనై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు.


“ ‘తర్వాత నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను చూసి, నీవు ప్రేమకు తగిన వయస్సులో ఉన్నావు కాబట్టి నా వస్త్రాన్ని నీపై వేసి నీ నగ్న శరీరాన్ని కప్పాను. నేను నీతో ప్రమాణం చేసి నిబంధన చేసుకున్నప్పుడు నీవు నా దానివి అయ్యావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


శాసనం అమలులోకి రాకముందే ఆ దినం గాలికి కొట్టుకుపోయే పొట్టులా కనుమరుగు కాక ముందే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకముందే, యెహోవా ఉగ్రత దినం మీ మీదికి రాకముందే సమకూడండి.


ఈ మూడవ వంతు ప్రజలను నేను అగ్నిలో నుండి వెండిని శుద్ధి చేసినట్లు వారిని శుద్ధి చేస్తాను బంగారాన్ని పరీక్షించినట్లు వారిని పరీక్షిస్తాను. వారు నా పేరట మొరపెడతారు, నేను వారికి జవాబిస్తాను. ‘వారు నా ప్రజలు’ అని నేనంటాను, ‘యెహోవా మా దేవుడు’ అని వారంటారు.”


“కుమారుడు తన తండ్రిని గౌరవిస్తాడు, దాసుడు తన యజమానిని గౌరవిస్తాడు, కానీ ఒకవేళ నేను మీ తండ్రినైతే, మరి నా గౌరవం ఏది? నేను యజమానినైతే, నాకెందుకు భయపడరు?” అని సైన్యాల యెహోవా అంటున్నారు. “యాజకులైన మీరు నా నామాన్ని అవమానిస్తున్నారు. “అయినా మీరు, ‘మేము మీ నామాన్ని ఎలా అవమానిస్తున్నాము?’ అని అంటారు.


నేను నియమించే ఆ రోజున దుర్మార్గులు మీ కాళ్లక్రింద ధూళిలా ఉంటారు, మీరు వారిని త్రొక్కివేస్తారు” అని సైన్యాల యెహోవా చెప్తున్నారు.


అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్నవారితో, “నా తండ్రి ఆశీర్వాదం పొందిన వారలారా; రండి! లోకం సృజింపబడినప్పటి నుండి మీ కోసం సిద్ధపరచి ఉంచిన మీ వారసత్వ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి.


“తండ్రీ, నీవు నన్ను సృష్టికి పునాది వేయబడక ముందే ప్రేమించి నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడడానికి నేను ఎక్కడ ఉంటానో అక్కడ, నీవు నాకు ఇచ్చిన వారందరు కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను.


దేవుడు తన సొంత కుమారుని ఇవ్వడానికి వెనుతీయక మనందరి కోసం ఆయనను అప్పగించినప్పుడు తన కుమారునితో పాటు మనందరికి అన్ని సమృద్ధిగా ఇవ్వకుండా ఎలా ఉండగలరు?


అయితే ప్రతి ఒక్కరు తమ క్రమాన్ని బట్టి బ్రతికించబడతారు. క్రీస్తు ప్రథమ ఫలము. తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనకు చెందినవారు బ్రతుకుతారు.


మీరు వెలపెట్టి కొనబడ్డారు. కాబట్టి మీ శరీరాలతో దేవుని మహిమపరచండి.


ఇంకా, “నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు, అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”


యేసు క్రీస్తుకు సంబంధించినవారు శరీరాన్ని దాని వాంఛలతో దురాశలతో సిలువ వేశారు.


ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు మీరు పవిత్ర ప్రజలు. భూమి మీద ఉన్న ప్రజలందరిలో యెహోవా మిమ్మల్ని తన విలువైన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు.


ఎందుకంటే, మీరు మీ దేవుడైన యెహోవాకు పరిశుద్ధ ప్రజలు. ఈ భూమి మీద ప్రజలందరిలో నుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తన సొంత ప్రజలుగా, విలువైన ఆస్తిగా ఎన్నుకున్నారు.


యేసు క్రీస్తు మన అతిక్రమాలన్నిటి నుండి మనల్ని విడిపించడానికి మంచి చేయడానికి ఆసక్తి కలిగిన తన ప్రజలుగా మనల్ని పవిత్రపరచాలని తనను తాను అర్పించుకున్నారు.


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ