Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 21:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 మీ తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, బంధువులు, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, వారు మీలో కొందరిని చంపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 తల్లిదండ్రులూ, అన్నదమ్ములూ, బంధువులూ, స్నేహితులే మిమ్మల్ని పట్టిస్తారు. వారు మీలో కొంతమందిని చంపిస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 మీ తల్లి తండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు మీకు ద్రోహం చేస్తారు. మీలో కొందర్ని చంపి వేస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 మీ తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, బంధువులు, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, వారు మీలో కొందరిని చంపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

16 మీ తల్లిదండ్రులు, సహోదరులు, సహోదరీలు, బంధువులు, స్నేహితుల చేత మీరు అప్పగించబడతారు, వారు మీలో కొందరిని చంపుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 21:16
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ బంధువులు, నీ సొంత కుటుంబ సభ్యులు కూడా, నీకు నమ్మకద్రోహం చేశారు; వారు నీ మీద పెద్దగా అరుస్తూ మాట్లాడారు. కాబట్టి వారు నీ గురించి మంచిగా మాట్లాడినా వారిని నమ్మవద్దు.


“ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు, స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు.


“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు; పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.


“సహోదరుడు సహోదరున్ని, తండ్రి తన బిడ్డను మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తల్లిదండ్రుల మీద తిరగబడి వారిని చంపిస్తారు.


ఎలాగంటే, కుమారుని మీదికి తండ్రి, తండ్రి మీదికి కుమారుడు, కుమార్తెకు మీదికి తల్లి, తల్లి మీదికి కుమార్తె, కోడలు మీదికి అత్త, అత్త మీదికి కోడలు, ఇలా వారు విడిపోతారు.


ఎందుకంటే మీ విరోధులు ఎదిరించడానికి గాని, నిరాకరించడానికి గాని వీలుకాని మాటలను జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను.


నన్ను బట్టి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ద్వేషిస్తారు.


అలా రాజు, యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించాడు.


వారు స్తెఫెనును రాళ్లతో కొడుతున్నప్పుడు అతడు, “యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకో” అని ప్రార్థించాడు.


వారు గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, తాము ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి అపవాది మీద విజయం పొందారు; వారు చావడానికి వెనుకంజ వేయలేదు తమ ప్రాణాలను ప్రేమించలేదు.


సాతాను సింహాసనం ఉన్న స్థలంలో నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నా నామానికి నిజంగా కట్టుబడి ఉన్నావు. సాతాను నివసించే నీ పట్టణంలో నాకు నమ్మకమైన సాక్షిగా ఉన్న అంతిప అనేవాడు హతసాక్షిగా చంపబడిన దినాల్లో కూడ నాలో నీ విశ్వాసాన్ని వదలకుండా ఉన్నావు.


ఆ వధించబడిన గొర్రెపిల్ల అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వధించబడిన వారి ఆత్మలను ఒక బలిపీఠం క్రింద చూశాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ