Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 1:71 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

71 మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

71 దేవుడు శత్రువుల బారినుండి, మనలను ద్వేషించేవారినుండి మనల్ని రక్షిస్తాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

71 మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

71 మన శత్రువుల చేతి నుండి మరియు మనలను ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 1:71
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

కాని మీ దేవుడైన యెహోవాను భయభక్తులతో ఆరాధించాలి; ఆయనే మీ శత్రువులందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు.”


పగవారి బారి నుండి దేవుడే వారిని తప్పించాడు; విడుదల ప్రసాదించాడు.


మా దేవా యెహోవా, మమ్మల్ని రక్షించండి; ఇతర దేశాల మధ్య నుండి మమ్మల్ని సమకూర్చండి, అప్పుడు మేము మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తాం, మిమ్మల్ని స్తుతించడంలో అతిశయిస్తాం.


అతని పరిపాలనలో యూదాకు కాపుదల ఉంటుంది ఇశ్రాయేలు క్షేమంగా జీవిస్తుంది. యెహోవా మన నీతిమంతుడైన రక్షకుడు అని పిలువబడతాడు.


నా ఉగ్రతతో, గొప్ప కోపంతో నేను వారిని వెళ్లగొట్టే అన్ని దేశాల నుండి తప్పకుండా వారిని సమకూర్చి తిరిగి ఈ ప్రదేశానికి తీసుకువచ్చి క్షేమంగా జీవించేలా చేస్తాను.


అందులో వారు నిశ్చింతగా నివసించి ఇల్లు కట్టుకుని ద్రాక్షతోటలు నాటతారు. వారిని హింసించిన వారి పొరుగువారందరిని నేను శిక్షించిన తర్వాత వారు నిర్భయంగా నివసిస్తారు. అప్పుడు నేనే తమ దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


“ ‘అవి అరణ్యంలో క్షేమంగా నివసించి అడవుల్లో పడుకునేలా నేను వాటితో సమాధాన ఒడంబడిక చేసుకుంటాను, అలాగే అడవి మృగాలను దేశంలో లేకుండా చేస్తాను.


వారు ఇకపై దేశాలచేత దోచుకోబడరు, అడవి మృగాలకు వారు ఆహారం కారు. వారు క్షేమంగా జీవిస్తారు, వారిని ఎవరూ భయపెట్టరు.


చాలా రోజుల తర్వాత నీవు పిలువబడతావు. రాబోయే సంవత్సరాల్లో మీరు యుద్ధం నుండి కోలుకున్న దేశం మీద, చాలాకాలంగా నిర్జనంగా ఉన్న ఇశ్రాయేలు పర్వతాలమీద నివసించడానికి వివిధ దేశాల నుండి సమకూర్చబడి దాని ప్రజల మీద దాడి చేస్తారు. వారు చెదిరిపోయిన దేశాల నుండి సమకూర్చబడి ఇప్పుడు నిర్భయంగా జీవిస్తున్నారు.


“ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు స్తుతింపబడును గాక, ఎందుకంటే ఆయన తన ప్రజలను దర్శించి వారిని విమోచించారు.


మన శత్రువుల చేతి నుండి మనల్ని తప్పించి, మనం భయపడకుండా ఆయనను సేవించాలని,


ఇశ్రాయేలూ, మీరు ధన్యులు! యెహోవా రక్షించిన ప్రజలారా, మీలాంటి వారు ఎవరు? ఆయన మీకు డాలు, సహాయకుడు మీ మహిమగల ఖడ్గము. మీ శత్రువులు మీ ఎదుట భయపడతారు; మీరు వారి వీపుపై త్రొక్కుతారు.”


సాతాను మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కాబట్టి పాపం చేసేవారు సాతాను సంబంధులు, సాతాను కార్యాలను నాశనం చేయడానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ