Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 1:48 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

48 తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

48 నా ఆత్మ నా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

48-49 నా ఆత్మ నా రక్షకుడైన దేవునిలో హర్షిస్తున్నది. సర్వశక్తిశాలి నాకు గొప్ప మేళ్ళు చేశాడు, కాబట్టి ఇది మొదలు అన్ని తరాలవారూ నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పవిత్రం.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

48 దీనురాల్ని నేను! ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు! ఇకనుండి అందరూ నన్ను ధన్యురాలంటారు!

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

48 తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

48 తన సేవకురాలి దీనస్థితిని ఆయన గమనించారు. ఇది మొదలుకొని తరతరాల వారు నన్ను ధన్యురాలు అంటారు,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 1:48
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

అప్పుడు లేయా అన్నది, “నాకు ఎంత సంతోషం! స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు.” కాబట్టి అతనికి ఆషేరు అని పేరు పెట్టింది.


“కాబట్టి ఇప్పుడు నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, ‘సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: పచ్చిక మైదానంలో గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను తీసుకువచ్చి నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు పాలకునిగా నియమించాను.


దిక్కులేని దరిద్రులు ప్రార్థిస్తే ఆయన వింటారు; ఆయన వారి మనవులను త్రోసివేయరు.


మనం దీనదశలో ఉన్నప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంది ఆయనే, ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.


యెహోవా మహోన్నతుడైనప్పటికి ఆయన దీనులపై దయ చూపిస్తారు; ఆయన దూరం నుండే గర్విష్ఠులను పసిగడతారు.


ఆయన పేరు నిరంతరం ఉండును గాక; అది సూర్యుడు ఉండే వరకు కొనసాగును గాక. అప్పుడు ఆయన ద్వారా అన్ని దేశాలు ఆశీర్వదించబడతాయి, వారు ఆయనను ధన్యుడు అని పిలుస్తారు.


వీటన్నిటిని చేసింది నా చేయి కాదా, ఈ విధంగా అవి కలిగాయి కదా?” అని యెహోవా తెలియజేస్తున్నారు. “ఎవరైతే వినయంతో పశ్చాత్తాప హృదయం కలిగి నా మాట విని వణుకుతారో, వారికే నేను దయ చూపిస్తాను.


“అప్పుడు మీ దేశం ఆనందంగా ఉంటుంది కాబట్టి అన్ని దేశాల ప్రజలు మిమ్మల్ని ధన్యులంటారు” అని సైన్యాలకు యెహోవా ప్రకటిస్తున్నాడు.


ఆ దూత ఆమె దగ్గరకు వెళ్లి ఆమెతో, “బహుగా దయను పొందినదానా, నీకు శుభములు! ప్రభువు నీకు తోడై ఉన్నారు” అని చెప్పాడు.


ఆమె పెద్ద స్వరంతో: “స్త్రీలలో నీవు ధన్యురాలవు, నీవు గర్భంలో మోస్తున్న శిశువు ధన్యుడు!


ప్రభువు తనకు చేసిన వాగ్దానం తప్పక నెరవేరుతుందని నమ్మిన స్త్రీ ధన్యురాలు!” అని చెప్పింది.


ఎందుకంటే మహాఘనుడు నా కోసం గొప్ప కార్యాలను చేశారు, పరిశుద్ధుడని ఆయనకు పేరు.


యేసు ఈ మాటలను చెప్తుండగా, ఆ జనసమూహంలోని ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను మోసిన గర్భం, నీకు పాలిచ్చిన స్తనాలు ధన్యమైనవి” అని కేకలు వేసి చెప్పింది.


ఆమె, “సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు” అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది.


దరిద్రులను మట్టిలో నుండి పైకెత్తేది పేదవారిని బూడిద కుప్ప నుండి లేవనెత్తేది ఆయనే; వారిని అధికారులతో కూర్చునేలా చేసేది ఘనత కలిగిన సింహాసనాన్ని స్వతంత్రింపజేసేది ఆయనే. “భూమి పునాదులు యెహోవాకు చెందినవి; ఆయన వాటి మీద లోకాన్ని నిలిపారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ