Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లూకా సువార్త 1:33 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 ఆయన యాకోబు సంతతిని శాశ్వతంగా పరిపాలిస్తాడు. ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని ఆమెతో చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

33 యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

33 ఆయన యాకోబు వంశస్థులను నిరంతరం పరిపాలిస్తారు; ఆయన రాజ్యానికి అంతం ఉండదు” అని చెప్పాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లూకా సువార్త 1:33
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా కోసం ఒక మందిరాన్ని కట్టేవాడు అతడే. నేను అతని రాజ్యసింహాసనాన్ని శాశ్వతంగా స్థిరపరుస్తాను.


నా ఎదుట నీ ఇల్లు, నీ రాజ్యం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయి. నీ సింహాసనం శాశ్వతంగా స్థాపించబడుతుంది.’ ”


ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండమే మీ రాజ్య దండం.


‘మీ వంశాన్ని శాశ్వతంగా స్థాపిస్తాను మీ సింహాసనాన్ని అన్ని తరాలకు స్థిరపరుస్తాను’ ” అని మీరన్నారు. సెలా


మారని ప్రేమలో సింహాసనం స్థాపించబడుతుంది; దావీదు కుటుంబం నుండి సత్యవంతుడైన ఒకడు దానిపై కూర్చుని న్యాయంగా తీర్పు తీర్చుతూ నీతిన్యాయాలను జరిగించడానికి త్వరపడతాడు.


ఆయన ప్రభుత్వానికి, సమాధానానికి గొప్పతనానికి ముగింపు ఉండదు. ఆయన అప్పటినుండి ఎల్లకాలం వరకు దావీదు సింహాసనం మీద, అతని రాజ్యాన్ని ఏలుతూ, న్యాయంతోను నీతితోను రాజ్యాన్ని స్థాపించి స్థిరంగా ఉంచుతారు. సైన్యాలకు అధిపతియైన యెహోవా ఆసక్తి దీనిని నెరవేరుస్తుంది.


“రాబోయే రోజుల్లో, నేను దావీదుకు నీతి అనే చిగురును పుట్టిస్తాను, జ్ఞానయుక్తంగా పరిపాలించే రాజు, దేశంలో నీతి న్యాయాలు జరిగించేవాన్ని” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“ఆ రాజుల కాలంలో పరలోక దేవుడు ఒక రాజ్యం నెలకొల్పుతారు, అది ఎన్నటికి నశించదు, అది ఇతర ప్రజల చేతిలో పడదు. అది ఆ రాజ్యాలన్నిటినీ చితగ్గొట్టి, వాటిని తుదముట్టిస్తుంది, కాని అది మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది.


ఆ కాలం గడిచిన తర్వాత నెబుకద్నెజరు అనే నేను ఆకాశం వైపు నా తలెత్తి చూశాను, అప్పుడు నా మానవ బుద్ధి తిరిగి వచ్చింది. అప్పుడు నేను సర్వోన్నతున్ని స్తుతించాను; నిత్యం జీవించే ఆయనను ఘనపరిచాను, మహిమపరిచాను. ఆయన అధికారం శాశ్వత అధికారం; ఆయన రాజ్యం తరతరాలకు ఉంటుంది.


“నా రాజ్యంలో ప్రతి ప్రాంతంలో ఉన్న ప్రజలంతా దానియేలు దేవునికి భయపడాలి ఆయనను గౌరవించాలని నేను ఆదేశిస్తున్నాను. “ఆయన జీవంగల దేవుడు. ఆయన ఎల్లకాలం జీవిస్తారు; ఆయన రాజ్యం నాశనం కాదు, ఆయన అధికారం ఎప్పటికీ అంతం కాదు.


కాని, సర్వోన్నతుని పరిశుద్ధులే రాజ్యాన్ని పొందుకుంటారు, వారి రాజ్యమే యుగయుగాలకు శాశ్వతంగా నిలిచి ఉంటుంది.’


అప్పుడు ఆకాశం క్రిందున్న అన్ని రాజ్యాల అధికారం, శక్తి, మహాత్యం, సర్వోన్నతుని పరిశుద్ధులకు ఇవ్వబడుతుంది. ఆయన రాజ్యం శాశ్వతం రాజ్యం, అధికారులందరు ఆయనను ఆరాధిస్తూ, ఆయనకు లోబడతారు.’


ఏశావు పర్వతాలను పరిపాలించడానికి రక్షకులు సీయోను పర్వతం ఎక్కుతారు, రాజ్యం యెహోవాది అవుతుంది.


కుంటివారిని నా శేషంగా, వెళ్లగొట్టబడిన వారిని బలమైన దేశంగా చేస్తాను. యెహోవా సీయోను కొండమీద ఆ రోజు నుండి ఎల్లప్పుడూ వారిని పరిపాలిస్తారు.


ఇది అబ్రాహాము సంతానమైన దావీదు సంతానం నుండి వచ్చిన క్రీస్తు యేసు వంశావళి:


యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది.


మరియ ఆ దూతతో, “నేను కన్యను కదా, అదెలా సాధ్యం?” అని అడిగింది.


దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన వారందరు ఇశ్రాయేలీయులు కారు.


మీరు క్రీస్తుకు చెందినవారైతే, మీరు అబ్రాహాము సంతానంగా ఉండి వాగ్దాన ప్రకారం వారసులు.


ఈ నియమాన్ని అనుసరించే వారందరికి అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానం కనికరం కలుగుతాయి.


ఎందుకంటే, మనం సున్నతి పొందినవారం, దేవుని ఆత్మ చేత ఆయనను ఆరాధిస్తాం, క్రీస్తు యేసులో అతిశయపడతాం, శరీరంపై నమ్మకం ఉంచండి.


కాని తన కుమారుని గురించి ఆయన, “ఓ దేవా, మీ సింహాసనం నిరంతరం నిలుస్తుంది; మీ న్యాయ దండం మీ రాజ్య రాజదండం.


ఏడవ దేవదూత తన బూరను ఊదినప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు, ఇలా చెప్పడం వినిపించింది, “భూలోక రాజ్యం ప్రభు రాజ్యంగా ఆయన క్రీస్తు రాజ్యంగా మారాయి కాబట్టి ఆయన ఎల్లకాలం పరిపాలిస్తారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ