Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 7:16 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 “ ‘ఒకవేళ వారి అర్పణ మ్రొక్కుబడి కోసం గాని, స్వేచ్ఛార్పణ గాని అయితే, దానిని అర్పించిన రోజే తినాలి, అయితే మిగిలింది మరుసటిరోజు తినవచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 అతడు అర్పించుబలి మ్రొక్కుబడియేగాని స్వేచ్ఛార్పణయేగాని అయినయెడల అతడు దాని నర్పించు నాడే తినవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అయితే మొక్కు చెల్లించడం కోసం గానీ, స్వేచ్ఛార్పణ చెల్లించడం కోసం గానీ బలి ఇస్తే ఆ పశువు మాంసాన్ని బలి అర్పణ రోజే తినాలి. కానీ ఏదన్నా మిగిలితే దాన్ని రెండోరోజు కూడా తినవచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

16 “ఒక వ్యక్తి కేవలం దేవునికి ఒక కానుకగా మాత్రమే సమాధాన బలిని తేవచ్చును. లేక ఒక వ్యక్తి దేవునికి ఒక ప్రత్యేక వాగ్దానం చేసుకొని ఉండొచ్చు. అదే నిజమైతే ఆ బలిని అర్పించిన రోజునే దాన్ని తినివేయాలి. ఒకవేళ ఏమైనా మిగిలితే, మర్నాడు దాన్ని తినివేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 “ ‘ఒకవేళ వారి అర్పణ మ్రొక్కుబడి కోసం గాని, స్వేచ్ఛార్పణ గాని అయితే, దానిని అర్పించిన రోజే తినాలి, అయితే మిగిలింది మరుసటిరోజు తినవచ్చు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 7:16
17 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆయన ప్రజలందరి సమక్షంలో, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు తీర్చుకుంటాను.


ఆయన ప్రజలందరి సమక్షంలోను, యెహోవా మందిర ఆవరణాల్లోను, యెరూషలేమా, మీ మధ్యను, నేను యెహోవాకు నా మ్రొక్కుబడులు చెల్లిస్తాను. యెహోవాను స్తుతించండి.


దహన బలులతో మీ ఆలయానికి వచ్చి నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను.


మోషే ద్వారా యెహోవా వారికి చేయమని ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలీయుల స్త్రీలు పురుషులలో ప్రేరేపించబడిన వారందరు ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు తెచ్చారు.


“నేడు నేను నా మ్రొక్కుబడులు చెల్లించాను, ఇంటి దగ్గర నా సమాధానబలి అర్పణలోని ఆహారం ఉంది.


“ ‘యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహనబలి గాని, సమాధానబలి గాని యువరాజు అర్పించేటప్పుడు అతని కోసం తూర్పు వైపు ద్వారం తలుపులు తెరవాలి. సబ్బాతు దినాన అర్పించునట్లుగానే దహనబలిని సమాధానబలిని అర్పించి వెళ్లిపోవాలి. అతడు వెళ్లిన తర్వాత ద్వారం తలుపులు మూసివేయాలి.


అయితే మీరు ఒక అంగవైకల్యంతో ఉన్న ఎద్దును గాని లేదా గొర్రెలను గాని స్వేచ్ఛార్పణగా సమర్పించవచ్చు, కాని ఒక మ్రొక్కుబడి చెల్లించడానికైతే ఇది అంగీకరించబడదు.


“మీరు యెహోవాకు కృతజ్ఞతార్పణ అర్పించినప్పుడు, అది మీ పక్షంగా అంగీకరించబడే విధంగా అర్పించాలి.


ఇవి యెహోవా సబ్బాతులకు, మీ బహుమానాలకు, మ్రొక్కుబడులకు, యెహోవాకు అర్పించే స్వేచ్ఛార్పణలన్నిటికి అధనంగా అర్పించవలసిన అర్పణలు.


చూడు, అక్కడ పర్వతాలమీద, సువార్తను ప్రకటించేవారి పాదాలు, వారు సమాధానాన్ని ప్రకటించేవారు! యూదా, నీ పండుగలు జరుపుకో, నీ మ్రొక్కుబడులను నెరవేర్చుకో. ఇకపై దుష్టులు నీపై దండెత్తరు; వారు పూర్తిగా నాశనం చేయబడతారు.


యెహోవాకు ఇష్టమైన సువాసన కలుగునట్లు మీ మందల నుండి లేదా పశువుల నుండి అర్పణలు అంటే దహనబలులు గాని బలులు గాని, ప్రత్యేకమైన మ్రొక్కుబడులు గాని స్వేచ్ఛార్పణలు గాని, లేదా పండుగ అర్పణలు గాని అర్పించవచ్చు.


అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి.


మీ ధాన్యంలో, క్రొత్త ద్రాక్షరసంలో, ఒలీవ నూనెలో దశమభాగాన్ని, లేదా మీ పశువుల్లో, మందలలో మొదట పుట్టిన దానిని, లేదా మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు ప్రత్యేక అర్పణలు వేటిని మీ పట్టణాల్లో తినకూడదు.


అయితే మీ పవిత్ర వస్తువులను, మీరు ఇస్తానని మ్రొక్కుబడి చేసినవన్నీ తీసుకుని, యెహోవా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లండి.


అక్కడికే మీరు మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు ఇస్తామన్న మ్రొక్కుబడులు, స్వేచ్ఛార్పణలు, పశువుల మందలో గొర్రెల మందలోని మొదట పుట్టిన వాటిని తీసుకురావాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ