Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 23:34 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

34 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల పదిహేనవ రోజున యెహోవా యొక్క గుడారాల పండుగ ప్రారంభమవుతుంది, అది ఏడు రోజులు ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

34 –నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము–ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినములవరకు యెహోవాకు పర్ణశాలల పండుగను జరుపవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

34 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. ఈ ఏడో నెల పదిహేనో దినం మొదలు ఏడు దినాలు యెహోవాకు పర్ణశాలల పండగ జరపాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

34 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఏడవ నెల పదిహేనవ తేదీన పర్ణశాలల పండుగ. యెహోవాకు ఈ పండుగ ఏడు రోజులపాటు కొనసాగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

34 “ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు: ‘ఏడవ నెల పదిహేనవ రోజున యెహోవా యొక్క గుడారాల పండుగ ప్రారంభమవుతుంది, అది ఏడు రోజులు ఉంటుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 23:34
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

యూదాలో జరిగిన పండుగలాంటి ఒక పండుగను యరొబాము ఎనిమిదవ నెల పదిహేనవ రోజున ఏర్పాటు చేసి, బలిపీఠం మీద బలులు అర్పించాడు. అలా అతడు బేతేలులో తాను చేయించిన దూడలకు బలి అర్పించుట ద్వార చేశాడు. అంతేకాదు బేతేలులో తాను చేయించిన క్షేత్రాల్లో యాజకులను కూడా నియమించాడు.


ఏతనీము అనే ఏడవ నెలలో, పండుగ సమయంలో ఇశ్రాయేలీయులందరు రాజైన సొలొమోను ఎదుట సమావేశమయ్యారు.


ఆ సమయంలో సొలొమోను అతనితో ఇశ్రాయేలు ప్రజలంతా పండుగ చేశారు. లెబో హమాతుకు వెళ్లే మార్గం నుండి ఈజిప్టు వాగువరకు ఉన్న ప్రాంతాల నుండి ప్రజలు గొప్ప సమూహంగా వచ్చి దేవుడైన యెహోవా ఎదుట ఏడు రోజులే కాకుండ మరి ఏడు రోజులు, మొత్తం పద్నాలుగు రోజులు పండుగ చేసుకున్నారు.


తర్వాత ధర్మశాస్త్రంలో వ్రాయబడిన విధంగా గుడారాల పండుగ చేసుకుని నియమించబడిన సంఖ్య ప్రకారం ప్రతిరోజు దహనబలులు అర్పించారు.


యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రంలో ఏడవ నెల పండుగ సమయంలో ఇశ్రాయేలీయులు తాత్కాలిక నివాసాల్లో నివసించాలని వ్రాయబడి ఉండడం చూసి,


“మీరు మీ పొలంలో విత్తి పండించిన ప్రథమ ఫలాలతో కోత కాల పండుగ చేయాలి. “పొలం నుండి మీ పంటలన్నిటిని కూర్చుకున్న తర్వాత సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ చేయాలి.


“గోధుమపంటలోని ప్రథమ ఫలాలతో వారాల పండుగ ఆచరించాలి, సంవత్సరం చివరిలో పంటకూర్పు పండుగ ఆచరించాలి.


“ ‘ఏడవ నెలలో పదిహేనవ రోజున ప్రారంభమయ్యే పండుగ యొక్క ఏడు రోజుల్లో కూడా అతడు పాపపరిహార బలులు, దహనబలులు, భోజనార్పణలు, నూనెను అదే విధంగా ఏర్పాటు చేయాలి.


యెహోవా మోషేతో ఇలా అన్నారు,


ఏడు రోజులు తాత్కాలిక ఆశ్రయాలలో నివసించండి: స్థానికంగా జన్మించిన ఇశ్రాయేలీయులందరు అలాంటి ఆశ్రయాలలో నివసించాలి.


తద్వార ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన తర్వాత వారిని తాత్కాలిక ఆశ్రయాలలో నివసింపజేశానని మీ సంతతివారు తెలుసుకుంటారు. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”


“ ‘ఏడవ నెల పదిహేనవ రోజున పరిశుద్ధ సభగా కూడుకోవాలి, జీవనోపాధి కోసమైన పనులేవీ చేయకూడదు. యెహోవా కోసం ఏడు రోజులు పండుగ ఆచరించాలి.


ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని మన మధ్య నివసించింది. మనం ఆయన మహిమను చూశాం, కృపాసత్య సంపూర్ణుడై, తండ్రి దగ్గర నుండి వచ్చిన, ఏకైక కుమారుని మహిమను చూశాము.


కానీ యూదుల పర్ణశాలల పండుగ దగ్గర పడినప్పుడు,


సంవత్సరానికి మూడుసార్లు మీ పురుషులందరు మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొనే స్థలంలో కనబడాలి: పులియని రొట్టెల పండుగలో, వారాల పండుగలో, గుడారాల పండుగలో. యెహోవా సన్నిధిలో ఎవరూ వట్టి చేతులతో కనిపించకూడదు.


తర్వాత మోషే, “ప్రతి ఏడు సంవత్సరాల చివరిలో, అప్పులు రద్దు చేసే సంవత్సరంలో, గుడారాల పండుగ సమయంలో,


వీరందరు చనిపోయినా, విశ్వాసం ద్వారానే ఇంకా జీవిస్తున్నారు. వాగ్దానం చేసిన వాటిని వారు పొందలేదు; వారు కేవలం దూరం నుండి చూసి వాటిని ఆహ్వానించి, ఈ భూమిపై తాము విదేశీయులమని అపరిచితులమని ఒప్పుకున్నారు.


విశ్వాసం ద్వారానే దేవుడు తనకు వాగ్దానం చేసిన దేశంలో పరదేశిలా గుడారంలో నివసించాడు, అతనితో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా అలాగే చేశారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ