లేవీయకాండము 20:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 “ ‘ఒకడు తన సోదరిని అనగా తన తండ్రి కుమార్తెను గాని తల్లి కుమార్తెను గాని పెళ్ళి చేసుకుని వారికి లైంగిక సంబంధం ఉంటే, అది అపకీర్తి. వారిని బహిరంగంగా వారి ప్రజల ఎదుట శిక్షించాలి. అతడు తన సోదరిని అగౌరపరిచాడు కాబట్టి అతడే బాధ్యత వహించాలి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 ఒకడు తన సహోదరిని, అనగా తన తండ్రి కుమార్తెనేగాని తన తల్లి కుమార్తెనేగాని చేర్చుకొని ఆమె దిసమొలనువాడును వాని దిసమొలను ఆమెయు చూచినయెడల అది దురనురాగము. వారికిని తమ జనులయెదుట మరణశిక్ష విధింపవలెను.వాడు తన సహోదరి మానా చ్ఛాదనమును తీసెను; తన దోషశిక్షను తాను భరించును. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 ఒకడు తన సోదరితో, అంటే తన తండ్రి కుమార్తెతో గానీ తన తల్లి కుమార్తెతో గానీ లైంగిక సంబంధం పెట్టుకుంటే అది సిగ్గుచేటు. తమ జాతి వారి సమక్షంలో వారిని ప్రజల్లో లేకుండా చెయ్యాలి. వాడు తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. తన దోష శిక్షను తాను భరించాలి. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 “ఒక సోదరుడు అతని సోదరి అనగా తండ్రి కుమార్తెగాని, తల్లి కుమార్తెగాని ఒకరితో ఒకరు లైంగిక సంబంధం పెట్టుకోవటం చాలా సిగ్గుచేటు. వాళ్లను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ల ప్రజల్లోనుంచి వాళ్లను వేరు చేయాలి. తన సోదరితో లైంగిక సంబంధం పెట్టుకొన్న మగవాడు అతని పాపం నిమిత్తం శిక్షపొందాలి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 “ ‘ఒకడు తన సోదరిని అనగా తన తండ్రి కుమార్తెను గాని తల్లి కుమార్తెను గాని పెళ్ళి చేసుకుని వారికి లైంగిక సంబంధం ఉంటే, అది అపకీర్తి. వారిని బహిరంగంగా వారి ప్రజల ఎదుట శిక్షించాలి. అతడు తన సోదరిని అగౌరపరిచాడు కాబట్టి అతడే బాధ్యత వహించాలి. အခန်းကိုကြည့်ပါ။ |