Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 19:23 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

23 “ ‘మీరు దేశంలోకి ప్రవేశించి, ఎలాంటి పండ్ల చెట్టునైన నాటితే, దాని పండును నిషేధించబడినదానిగా పరిగణించండి. మూడు సంవత్సరాల వరకు మీరు దానిని నిషేధించబడినదానిగా పరిగణించండి; అది తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

23 మీరు ఆ దేశమునకు వచ్చి ఆహారమునకై నానా విధములైన చెట్లను నాటినప్పుడు వాటి పండ్లను అపవిత్రముగా ఎంచవలెను. వాటి కాపు మీకు ఎక్కువగా ఉండునట్లు అవి మూడు సంవత్సరములవరకు మీకు అపవిత్రముగా ఉండవలెను, వాటిని తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

23 మీరు ఆ దేశానికి వచ్చి తినడానికి రకరకాల చెట్లు నాటినప్పుడు వాటి పండ్లను నిషేధంగా ఎంచాలి. మూడు సంవత్సరాల పాటు అవి మీకు అపవిత్రంగా ఉండాలి. వాటిని తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

23 “ముందుకు మీరు మీ దేశంలో ప్రవేశిస్తారు. ఆ సమయంలో ఆహారంకోసం మీరు ఎన్నో రకాల చెట్లు నాటుతారు. ఒక చెట్టును నాటిన తర్వాత మూడు సంవత్సరాలవరకు ఆ చెట్టు ఫలం ఏదీ మీరు తినకూడదు. ఆ ఫలాన్ని మీరు ఉపయోగించకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

23 “ ‘మీరు దేశంలోకి ప్రవేశించి, ఎలాంటి పండ్ల చెట్టునైన నాటితే, దాని పండును నిషేధించబడినదానిగా పరిగణించండి. మూడు సంవత్సరాల వరకు మీరు దానిని నిషేధించబడినదానిగా పరిగణించండి; అది తినకూడదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 19:23
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయితే మోషే యెహోవాతో, “ఇశ్రాయేలీయులే నా మాట వినకపోతే స్పష్టంగా మాట్లాడలేని నా మాట ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.


కాని మోషే యెహోవాతో, “తడబడే పెదవులతో మాట్లాడే నా మాటను ఫరో ఎందుకు వింటాడు?” అని అన్నాడు.


నేను ఎవరితో మాట్లాడి హెచ్చరిక ఇవ్వగలను? నా మాట ఎవరు వింటారు? వారి చెవులు మూయబడి ఉన్నాయి కాబట్టి వారు వినలేరు. యెహోవా మాట వారికి అభ్యంతరకరమైనది; వారు దానిలో ఆనందాన్ని పొందలేరు.


ఆ మగశిశువుకు ఎనిమిదవ రోజున సున్నతి చేయించాలి.


“మీ స్వాస్థ్యంగా నేను మీకు ఇస్తున్న కనాను దేశానికి మీరు వచ్చిన తర్వాత, ఆ దేశంలోని ఒక ఇంట్లో నేను కుష్ఠు మచ్చను ఉంచితే,


యాజకుడు ఆ పొట్టేలును అపరాధపరిహారబలిగా సమర్పించి యెహోవా ఎదుట అతడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిస్తాడు; అతని పాపం క్షమించబడుతుంది.


నాలుగవ సంవత్సరం దాని పండు పరిశుద్ధంగా, యెహోవాకు స్తుతి యాగంగా ఉంటాయి.


“ఒక దూడ గాని గొర్రెపిల్ల గాని లేదా మేకపిల్ల పుట్టినప్పుడు, అది ఏడు రోజులు తన తల్లితో ఉండాలి. ఎనిమిదవ రోజు నుండి, అది యెహోవాకు సమర్పించబడిన హోమబలిగా అంగీకరించబడుతుంది.


మీరు ఈ అర్పణను మీ దేవునికి తీసుకువచ్చే రోజు వరకు ఏ రొట్టె గాని, కాల్చిన ధాన్యం గాని లేదా క్రొత్త ధాన్యం గాని తినకూడదు. మీరు ఎక్కడ నివసించినా, రాబోయే తరాలకు ఇది నిత్య కట్టుబాటుగా ఉంటుంది.


“మెడవంచని ప్రజలారా! మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ