Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 19:10 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 మీ ద్రాక్షతోటపై రెండవసారి వెళ్లవద్దు లేదా పడిపోయిన ద్రాక్షను తీయవద్దు. పేదలు, విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 నీ ఫలవృక్షముల తోటలో రాలిన పండ్లను ఏరుకొనకూడదు, బీదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలెను;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 నీ ద్రాక్ష తోటలో పండ్లన్నిటినీ సేకరించుకో కూడదు. ద్రాక్ష తోటలో రాలిన పండ్లను ఏరుకోకూడదు. పేదలకు, పరదేశులకు వాటిని విడిచిపెట్టాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

10 మీ ద్రాక్షా తోటల్లో ద్రాక్షాపండ్లన్నీ ఏరుకోవద్దు. నేలమీద పడిన ద్రాక్షపండ్లను ఏరుకోవద్దు. ఎందుచేతనంటే, పేదవాళ్ళ కోసం, మీ దేశంగుండా ప్రయాణం చేసే వాళ్ళకోసమూ మీరు వాటిని విడిచిపెట్టాలి. నేను మీ దేవుడైన యెహోవాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 మీ ద్రాక్షతోటపై రెండవసారి వెళ్లవద్దు లేదా పడిపోయిన ద్రాక్షను తీయవద్దు. పేదలు, విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 19:10
16 ပူးပေါင်းရင်းမြစ်များ  

అయినా ఒలీవచెట్టు కొమ్మలు దులపగా పై కొమ్మ చివర రెండు మూడు పండ్లు మిగిలినట్లు, ఫలించు చెట్టు కొమ్మల్లో మూడు, నాలుగు పండ్లు మిగిలినట్లు, కొంత పరిగె మిగిలి ఉంటుంది” అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తెలియజేస్తున్నారు.


ఒలీవ చెట్టుని దులిపినప్పుడు, ద్రాక్షపండ్ల కోత తర్వాత పరిగె పళ్ళు ఏరుకుంటున్నప్పుడు జరిగినట్లుగా భూమి మీద భూమి మీద ప్రజలందరి మధ్యలో ఇది జరుగుతుంది.


ద్రాక్షలు పోగుచేసుకునేవారు మీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలేయరా? రాత్రివేళ దొంగలు వస్తే, వారికి కావలసినంత వారు దొంగిలించరా?


నేను మీ దేవుడనైన యెహోవాను; నేను పరిశుద్ధుడను కాబట్టి, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకుని పరిశుద్ధంగా ఉండండి. నేలపై ప్రాకే ఏ జీవిని బట్టి మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోకూడదు.


“ ‘దొంగతనం చేయకూడదు. “ ‘అబద్ధాలాడకూడదు. “ ‘ఒకరిని ఒకరు మోసపుచ్చుకోకూడదు.


అయితే అయిదవ సంవత్సరంలో మీరు దాని పండు తినవచ్చు. ఈ విధంగా మీ పంట అధికమవుతుంది. నేను మీ దేవుడనైన యెహోవాను.


“ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం యొక్క అంచులకు కోయవద్దు లేదా మీ పంట కోతల యొక్క పరిగెలను సేకరించవద్దు.


“ ‘మీరు మీ భూమి యొక్క పంటను కోసినప్పుడు, మీ పొలం అంచుల మట్టుకు కోయకండి లేదా మీ పంట కోతలను సేకరించకండి. పేదల కోసం, మీ మధ్య నివసించే విదేశీయుల కోసం వాటిని వదిలేయండి. నేను మీ దేవుడనైన యెహోవాను.’ ”


సబ్బాతు సంవత్సరంలో భూమి దానికదిగా ఏ పంట మీకు, మీ దాసులకు, దాసీలకు, మీ మధ్య నివసించే కూలి పనివారికి, అలాగే మీ మధ్య నివసించే విదేశీయులకు ఆహారమవుతుంది,


“ఒకవేళ నీ మీదికి దొంగలు వస్తే, రాత్రివేళ దొంగలు వస్తే ఎంతగా నాశనం చేస్తారో కదా! వారికి కావలసినంత వారు దోచుకుంటారు కదా? ద్రాక్షలు పోగుచేసుకునేవారు నీ దగ్గరకు వస్తే, వారు కొన్ని ద్రాక్షలు వదిలిపెడతారు కదా?


ఏంటి నా దుస్థితి! నా పరిస్థితి వేసవికాలపు పండ్లు ఏరుకునే వానిలా ద్రాక్షతోట పరిగె సేకరించేవానిలా ఉంది; తినడానికి ద్రాక్షపండ్ల గెల లేదు, నేను ఆశించే క్రొత్త అంజూరపు పండ్లు లేవు.


మీరు మీ పొలంలో పంట కోసినప్పుడు, మీరు ఒక పనను పట్టించుకోకపోతే, దాన్ని తెచ్చుకోడానికి తిరిగి వెనుకకు వెళ్లవద్దు. మీ చేతుల యొక్క అన్ని పనులలో మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించేలా విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.


మీరు మీ చెట్ల నుండి ఒలీవలను కొట్టినప్పుడు, రెండవసారి కొమ్మలపైకి వెళ్లవద్దు. విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం మిగిలి ఉన్నవాటిని వదిలేయండి.


మీరు మీ ద్రాక్షతోటలో ద్రాక్షను కోసినప్పుడు, మళ్ళీ తీగెల మీద వెదకవద్దు. మిగిలి ఉన్నవాటిని విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్ర కోసం వదిలేయండి.


అయితే అతడు, “మీతో పోల్చుకుంటే నేను సాధించింది ఏంటి? అబీయెజెరు ద్రాక్షపండ్ల కోతకంటే ఎఫ్రాయిమీయుల పరిగె మంచిది కాదా?


మోయాబీయురాలైన రూతు నయోమితో, “నేను పొలాలకు వెళ్లి ఎవరి దృష్టిలో దయ పొందితే అతని వెనుక అతని పొలంలో పరిగె ఏరుకు వస్తాను” అని చెప్పింది. అందుకు నయోమి, “నా కుమారీ, వెళ్లు” అన్నది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ