Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 17:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3-4 ఏ ఇశ్రాయేలీయుడైనా ఒక ఎద్దును, గొర్రెపిల్లను లేదా మేకను యెహోవా ఎదుట సమావేశ గుడార ప్రవేశం ముందు కాక శిబిరంలో గాని శిబిరం బయట గాని బలి ఇస్తే, వారు రక్తపాతం కలిగించిన అపరాధులుగా పరిగణించబడతారు; వారు రక్తం చిందించినవారు కాబట్టి వారు వారి ప్రజల నుండి కొట్టివేయబడాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3-4 ఇశ్రాయేలీయుల కుటుంబములలో యెహోవా మందిరము ఎదుట యెహోవాకు అర్పణము అర్పించుటకు పూనుకొనువాడు అది ఎద్దేగాని గొఱ్ఱెయేగాని మేకయేగాని ప్రత్యక్షపు గుడా రముయొక్క ద్వారమునొద్దకు దానిని ముందు తేక పాళెములో వధించినను పాళెమునకు వెలుపల వధించినను ఆ మనుష్యుడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును;

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా బలి అర్పించడానికై ఒక ఎద్దుని గానీ, మేకని గానీ, గొర్రె పిల్లని గానీ పట్టుకుని శిబిరం లోపలైనా, బయటైనా చంపి,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 ఇదే యెహోవా ఆజ్ఞ అని వారితో చెప్పు: ఇశ్రాయేలు మనిషి ఒకడు ఒక కోడెదూడను లేక గొర్రెపిల్లను, లేక ఒక మేకను బసలోగాని బస వెలుపలగానీ చంపవచ్చును.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3-4 ఏ ఇశ్రాయేలీయుడైనా ఒక ఎద్దును, గొర్రెపిల్లను లేదా మేకను యెహోవా ఎదుట సమావేశ గుడార ప్రవేశం ముందు కాక శిబిరంలో గాని శిబిరం బయట గాని బలి ఇస్తే, వారు రక్తపాతం కలిగించిన అపరాధులుగా పరిగణించబడతారు; వారు రక్తం చిందించినవారు కాబట్టి వారు వారి ప్రజల నుండి కొట్టివేయబడాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 17:3
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

యెహోవా నామం కోసం అప్పటికి దేవాలయం నిర్మించబడలేదు కాబట్టి ప్రజలు ఇంకా క్షేత్రాల దగ్గర బలులు అర్పించేవారు.


“ ‘ఎవరైన, స్వదేశీయులు గాని విదేశీయులు గాని చచ్చిన జంతువును గాని మృగాలు చీల్చిన పశువులను గాని తింటే, వారు తమ బట్టలు ఉతుక్కుని స్నానం చేయాలి. సాయంత్రం వరకు వారు ఆచారరీత్య అపవిత్రులుగా ఉంటారు; తర్వాత శుద్ధులవుతారు.


“అహరోను, అతని కుమారులు, ఇశ్రాయేలీయులందరితో మాట్లాడి వారితో ఇలా చెప్పు: ‘యెహోవా ఆజ్ఞాపించింది ఇది:


“వారితో ఇలా చెప్పు: ‘ఇశ్రాయేలీయులలో గాని వారి మధ్యలో నివసించే విదేశీయులలో గాని ఎవరైనా దహనబలిని గాని మరేదైనా బలిని గాని అర్పించాలనుకుని


మీరు అర్పించిన పశువు మీద చేయి ఉంచి, సమావేశ గుడారపు ద్వారం దగ్గర దానిని వధించాలి. యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చిలకరించాలి.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ