Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 16:4 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 అతడు సన్నని నార చొక్కా, సన్నని నారలోదుస్తులు వేసుకోవాలి; సన్నని నార నడికట్టు కట్టుకుని, సన్నని నార పాగా పెట్టుకోవాలి. ఇవి పవిత్ర దుస్తులు; అవి వేసుకోక ముందు అతడు నీటితో స్నానం చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 అతడు ప్రతిష్ఠితమైన చొక్కాయి తొడుగుకొని తన మానమునకు సన్న నార లాగులు తొడుగుకొని, సన్ననార దట్టికట్టుకొని సన్ననార పాగా పెట్టుకొనవలెను. అవి ప్రతిష్ఠత వస్త్రములు గనుక అతడు నీళ్లతో దేహము కడుగుకొని వాటిని వేసికొనవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అతడు ప్రతిష్ట చేసిన సన్న నార చొక్కాయి వేసుకోవాలి. సన్న నారతో చేసిన లోదుస్తులు ధరించాలి. సన్న నారతో చేసిన నడికట్టు కట్టుకుని, సన్న నారతో చేసిన తలపాగా ధరించాలి. ఇవన్నీ ప్రతిష్ట చేసిన పవిత్ర వస్త్రాలు. కాబట్టి స్నానం చేసి వీటిని ధరించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

4 అహరోను నీళ్లతో పూర్తిగా స్నానంచేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. అహరోను పవిత్రమైన చొక్కా ధరించాలి. లోపల వేసుకొనే బట్టలు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 అతడు సన్నని నార చొక్కా, సన్నని నారలోదుస్తులు వేసుకోవాలి; సన్నని నార నడికట్టు కట్టుకుని, సన్నని నార పాగా పెట్టుకోవాలి. ఇవి పవిత్ర దుస్తులు; అవి వేసుకోక ముందు అతడు నీటితో స్నానం చేయాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 16:4
23 ပူးပေါင်းရင်းမြစ်များ  

నీ సోదరుడైన అహరోనుకు గౌరవం, ఘనత కలిగేలా అతని కోసం పవిత్ర వస్త్రాలను కుట్టాలి.


తర్వాత అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి నీటితో వారిని కడగాలి.


వారు సమావేశ గుడారంలోకి వెళ్లినప్పుడెల్లా, వారు నీళ్లతో కడుక్కోవాలి, తద్వారా వారు చావరు. అలాగే, వారు యెహోవాకు హోమబలి అర్పించి సేవ చేయడానికి బలిపీఠాన్ని సమీపించినప్పుడు,


“తర్వాత నీవు అహరోనును అతని కుమారులను సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారిని నీటితో కడగాలి.


లేత మొక్కలా ఎండిన భూమిలో మొలిచిన మొక్కలా అతడు ఆయన ఎదుట పెరిగాడు. మనల్ని అతనివైపు ఆకర్షించేంత అందం గాని ఘనత గాని అతనికి లేదు, మనం అతన్ని కోరుకునేంతగా మంచి రూపమేమీ అతనికి లేదు.


ప్రజలు ఉండే బయటి ఆవరణంలోకి వారు వెళ్లేటప్పుడు వారి వస్త్రాలతో తాకి ప్రజలు ప్రతిష్ఠించకుండా ఉండడానికి తమ సేవ వస్త్రాలను తీసివేసి వాటిని పవిత్రమైన గదుల్లో ఉంచి వేరే బట్టలు వేసుకుని వెళ్లాలి.


ఉత్తరాన ఉన్న పై ద్వారం వైపు నుండి ఆరుగురు వ్యక్తులు తమ చేతుల్లో మారణాయుధాలు పట్టుకుని రావడం నేను చూశాను. వారితో పాటు నారబట్టలు వేసుకుని తన నడుముకు లేఖికుని సిరాబుడ్డి కట్టుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. వారు లోపలికి వచ్చి ఇత్తడి బలిపీఠం ప్రక్కన నిలబడ్డారు.


“అప్పుడు అహరోను సమావేశ గుడారంలోకి వెళ్లి అతి పరిశుద్ధస్థలంలోకి వెళ్లేముందు తాను వేసుకున్న సన్నని నార వస్త్రాలను విప్పివేయాలి.


అతడు పరిశుద్ధాలయ ప్రాంగణంలో నీటితో స్నానం చేసి తన సాధారణ బట్టలు వేసుకోవాలి. బయటకు వచ్చి తన కోసం దహనబలిని, ప్రజల పక్షాన మరో దహనబలిని అర్పించి తన కోసం, ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేయాలి.


ఎవరైతే తన తండ్రి స్థానంలో అభిషేకం పొంది ప్రధాన యాజకుడుగా ప్రతిష్ఠించబడతారో ఆ యాజకుడు ప్రాయశ్చిత్తం జరిగించాలి. అతడు పవిత్రమైన నార వస్త్రాలు ధరించి,


యాజకుడు తన నారబట్టలు నారలోదుస్తులు వేసుకుని, బలిపీఠం మీద అగ్నికి కాలిపోయిన దహనబలి అర్పణ బూడిదను తీసి బలిపీఠం ప్రక్కన ఉంచాలి.


అందుకు ఆ దూత, “పరిశుద్ధాత్మ నీ మీదికి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కాబట్టి పుట్టబోయే పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు.


కాని దాసుని స్వరూపాన్ని ధరించుకొని తనను తాను ఏమీ లేనివానిగా చేసికొని మనుష్యుని పోలికగా పుట్టారు.


విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన యథార్థ హృదయంతో, అపరాధ మనస్సాక్షి నుండి శుద్ధి చేయబడిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుని సమీపిద్దాము.


ఈ పిల్లలు రక్తమాంసాలు కలిగి ఉన్నవారు కాబట్టి, తన మరణం ద్వారా మరణంపై అధికారం కలవాడైన అపవాది అధికారాన్ని విరుగగొట్టడానికి,


పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చింపబడినవాడు, మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ