Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




లేవీయకాండము 13:46 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

46 వారికి వ్యాధి ఉన్నంత వరకు వారు అపవిత్రులే. వారు ఒంటరిగా జీవించాలి; వారు శిబిరం బయట నివసించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

46 ఆ పొడ వానికి కలిగిన దినములన్నియువాడు అపవిత్రుడైయుండును;వాడు అపవిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలెను; వాని నివాసము పాళెమునకు వెలుపల ఉండవలెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

46 ఆ అంటువ్యాధి ఉన్నన్ని రోజులూ అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. అతనికి అంటురోగం వచ్చి అశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగానే ఉండాలి. శిబిరం బయట అతడు నివసించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

46 ఆ వ్యాధి ఉన్న కాలమంతా అతను అపవిత్రుడే. ఆ వ్యక్తి అపవిత్రుడు. అతడు ఒంటరిగా బతకాలి. అతని నివాసం బసకు వెలుపల ఉండాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

46 వారికి వ్యాధి ఉన్నంత వరకు వారు అపవిత్రులే. వారు ఒంటరిగా జీవించాలి; వారు శిబిరం బయట నివసించాలి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




లేవీయకాండము 13:46
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈ హత్యచేసిన పాపం యోవాబు మీద అతని కుటుంబమంతటి మీదనే ఉంటుంది. యోవాబు కుటుంబంలో ఎప్పుడూ పుండ్లు పడినవారు, కుష్ఠురోగులు, కర్ర సహాయంతో నడిచేవారు, కత్తితో చంపబడినవారు, తిండిలేనివారు ఉంటారు” అని చెప్పాడు.


యెహోవా రాజును కుష్ఠరోగంతో బాధించారు, అది అతడు చనిపోయే దినం వరకు ఉంది. అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. రాజకుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.


అప్పుడు పట్టణ ప్రవేశ ద్వారం దగ్గర నలుగురు కుష్ఠురోగులు ఉన్నారు, వారు ఒకరితో ఒకరు, “మనం చచ్చేంతవరకు ఎందుకు ఇక్కడ ఉండాలి?


ఉజ్జియా రాజు చనిపోయే రోజు వరకు కుష్ఠు వ్యాధితో ఉన్నాడు. అతనికున్న కుష్ఠురోగాన్ని బట్టి అతడు యెహోవా మందిరంలోనికి వెళ్లకుండ నిషేధించబడ్డాడు. కాబట్టి అతడు వేరుగా ఒక గృహంలో నివసించాడు. అతని కుమారుడైన యోతాము రాజభవన అధికారిగా ఉంటూ దేశ ప్రజలను పరిపాలించాడు.


తమ కళ్లకు తాము పవిత్రులై తమ మలినం కడుగబడని వారు ఉన్నారు;


పట్టణం ఎలా నిర్జనమై ఉంది, ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, కాని ఇప్పుడు బానిసగా మారింది.


యెరూషలేము చాలా పాపం చేసింది కాబట్టి అపవిత్రమైనది. ఆమెను గౌరవించిన వారందరూ ఆమెను తృణీకరిస్తారు, అందరు ఆమెను నగ్నంగా చూశారు. ఆమె మూలుగుతూ వెనుదిరిగింది.


“వెళ్లిపొండి! మీరు అపవిత్రులు!” అని ప్రజలు గట్టిగా వారిమీద అరుస్తారు. “దూరం! దూరం! మమ్మల్ని తాకవద్దు!” అని వారు పారిపోయి, తిరుగులాడుతున్నప్పుడు, దేశాల్లో ఉన్న ప్రజలు, “వారు ఇకపై ఇక్కడ ఉండడానికి వీల్లేదు” అని అంటారు.


“అపవిత్రమైన మరకతో పాడైన వస్త్రానికి సంబంధించి, అవి ఉన్నివైనా లేదా నార వస్త్రాలైనా,


యాజకుడు శిబిరం బయటకు వెళ్లి వారిని పరీక్షించాలి. ఒకవేళ వారు వారి అపవిత్ర చర్మ వ్యాధి నుండి స్వస్థత పొందివుంటే,


ఆ రోజున తమను తాము ఉపేక్షించుకొనని వారు తమ ప్రజల నుండి తొలగించబడాలి.


ఆయన ఒక గ్రామంలోనికి ప్రవేశించేటప్పుడు పదిమంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురయ్యారు. వారు దూరంగా నిలబడి,


కాబట్టి ప్రభువు దినాన వాని ఆత్మ రక్షించబడేలా వాని శరీరం నశించడానికి వానిని సాతానుకు అప్పగించాలి.


ఈ ఉత్తరంలో మేము వ్రాసిన సూచనలను పాటించని వారిని గమనించి వారు సిగ్గుపడేలా మీరు వారితో కలవకండి.


సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాము.


దుష్ట ఆలోచనలు కలిగిన ప్రజల మధ్యలో తరచూ ఘర్షణలు జరుగుతాయి, అలాంటివారు సత్యం నుండి తొలగిపోయి, దైవభక్తి అనేది ఆదాయం తెచ్చే ఒక మార్గమని భావిస్తారు.


గొర్రెపిల్ల జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడినవారు మాత్రమే ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తారు. అపవిత్రమైనవి అసహ్యకరమైనవి మోసకరమైనవి చేసేవారెవరు దానిలోనికి ఎన్నడూ ప్రవేశించరు.


అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ