Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 4:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 పైగా, సహాయం కోసం వ్యర్థంగా, మేము మా గోపురాల నుండి; మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ మా కళ్లు క్షీణించిపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 వ్యర్థసహాయముకొరకు మేముకనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుచున్నవి మేముకనిపెట్టుచు రక్షింపలేని జనముకొరకు ఎదురు చూచుచుంటిమి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 దొరకని సహాయం కోసం కనిపెట్టినా మా కళ్ళకు ఏదీ కనబడలేదు. రక్షించలేని ప్రజల కోసం మా కళ్ళు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

17 మా కండ్లు పనిచేయటం మానివేశాయి. మేము సహాయం కొరకు నిరీక్షించాము. కాని అది రాలేదు. ఆ నిరీక్షణలో కండ్లు అలసిపోయాయి. ఏదో ఒక రాజ్యం వచ్చి మమ్మల్ని రక్షిస్తుందని అదే పనిగా ఎదురుచూశాము. మా కావలి బురుజులపై నుండి మేము చూశాము. కాని ఏ దేశమూ మమ్మల్ని కాపాడటానికి రాలేదు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 పైగా, సహాయం కోసం వ్యర్థంగా, మేము మా గోపురాల నుండి; మమ్మల్ని రక్షించలేని దేశం కోసం ఎదురుచూస్తూ మా కళ్లు క్షీణించిపోయాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 4:17
15 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఈజిప్టు వాగు నుండి యూఫ్రటీసు నది వరకు ఈజిప్టు రాజు వంశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ బబులోను రాజు స్వాధీనం చేసుకున్నాడు కాబట్టి అతడు తన సొంత దేశాన్ని విడిచి బయటకు రాలేదు.


కూషును నమ్ముకుని ఈజిప్టును బట్టి గర్వపడినవారు దిగులుపడి, సిగ్గుపడతారు.


చావుతో మీరు చేసుకున్న నిబంధన కొట్టివేయబడుతుంది; పాతాళంతో మీరు చేసుకున్న ఒప్పందం నిలవదు. ప్రవాహంలా శాపం మీ మీదికి వచ్చినప్పుడు మీరు దానిచే కొట్టబడతారు.


నైలు నది నీళ్లు త్రాగడానికి ఈజిప్టుకు ఎందుకు వెళ్లాలి? యూఫ్రటీసు నుండి నీళ్లు త్రాగడానికి అష్షూరుకు ఎందుకు వెళ్లాలి?


నీ మార్గాలను మార్చుకుంటూ, ఎందుకు అంతలా తిరుగుతున్నావు? నీవు అష్షూరులో నిరాశచెందినట్టుగా ఈజిప్టు విషయంలో కూడా నీవు నిరాశ చెందుతావు.


నీ తలపై చేతులు పెట్టుకుని ఆ స్థలం నుండి వెళ్లిపోతావు, ఎందుకంటే నీవు నమ్మేవారిని యెహోవా తిరస్కరించారు; నీవు వారి ద్వారా సహాయం పొందలేవు.


“కోత సమయం దాటిపోయింది, వేసవికాలం ముగిసింది, అయినా మనం రక్షించబడలేదు.”


“సహాయం కోసం నేను నా స్నేహితులను పిలిచాను కానీ వారు నన్ను మోసం చేశారు. నా యాజకులు, నా పెద్దలు తాము బ్రతికి ఉండాలని ఆహారం కోసం వెదుకుతూ, వారు పట్టణంలో చనిపోయారు.


తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో, యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు, వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. ఆమె శత్రువులు ఆమె వైపు చూసి ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు.


తగినంత ఆహారం పొందేందుకు మేము ఈజిప్టు, అష్షూరు వారివైపు మేము మా చేతులు చాపాము.


ఇశ్రాయేలీయులకు ధైర్యం కలిగించేదిగా ఈజిప్టు ఉండదు కాని సహాయం కోసం ఈజిప్టు వైపు తిరిగి తాము చేసిన పాపాన్ని ఇశ్రాయేలీయులు గుర్తుచేసుకుంటారు. అప్పుడు నేనే ప్రభువైన యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ