విలాపవాక్యములు 2:8 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 సీయోను కుమారి చుట్టూ ఉన్న గోడను పడగొట్టాలని యెహోవా నిశ్చయించుకున్నారు. ఆయన కొలమానాన్ని గీసాడు నాశనం చేయకూడదని తన చేతిని వెనుకకు తీసుకోలేదు. ఆయన రక్షణ వ్యవస్థ అంతటిని, గోడలను విలపించేలా చేశారు; అవి శిథిలావస్థలో ఉండిపోయాయి. အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 సీయోను కుమారియొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను నాశనముచేయుటకు తన చెయ్యి వెనుకతీయక ఆయన కొలనూలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీనిగూర్చి మూల్గుచున్నవి అవి యేకరీతిగా క్షీణించుచున్నవి. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 సీయోను కుమారి ప్రాకారాలు పాడు చెయ్యాలని యెహోవా ఉద్దేశపూర్వకంగా నిర్ణయించాడు. చెయ్యి చాపి కొలత గీత గీశాడు. గోడ నాశనం చెయ్యడానికి తన చెయ్యి వెనక్కు తీయలేదు. ఆయన ప్రహరీలు విలపించేలా చేశాడు. ప్రాకారాలు బలహీనం అయ్యేలా చేశాడు. အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్8 సీయోను కుమార్తె (ఇశ్రాయేలు) కోట గోడలను కూల దోయటానికి యెహోవా పథకం నిర్ణయించాడు. ఒక కొలబద్దతో అతడు గోడకు గుర్తులు పెట్టాడు. దానిని నాశనం చేయటంలో తనను తాను నిగ్రహించుకోలేదు. కావున బయటి ప్రాకారం, ఇతర గోడలు ధుఃఖ భారంతో కూలి పోయేలా చేశాడు. అవి ఒక్కుమ్మడిగా శిథిలమై పోయాయి. အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 సీయోను కుమారి చుట్టూ ఉన్న గోడను పడగొట్టాలని యెహోవా నిశ్చయించుకున్నారు. ఆయన కొలమానాన్ని గీసాడు నాశనం చేయకూడదని తన చేతిని వెనుకకు తీసుకోలేదు. ఆయన రక్షణ వ్యవస్థ అంతటిని, గోడలను విలపించేలా చేశారు; అవి శిథిలావస్థలో ఉండిపోయాయి. အခန်းကိုကြည့်ပါ။ |