Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:5 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 ఆమె విరోధులు ఆమెకు యజమానులయ్యారు; ఆమె శత్రువులు సుఖంగా జీవిస్తున్నారు; ఆమె యొక్క అనేక పాపాలను బట్టి యెహోవా ఆమెకు దుఃఖం కలిగించారు. ఆమె పిల్లలు చెరకు వెళ్లారు, వారు శత్రువు ముందు బందీలుగా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 దాని విరోధులు అధికారులైరి దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొనిపోయిరి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 దాని విరోధులు అధికారులయ్యారు. దాని శత్రువులు వర్ధిల్లుతున్నారు. దాని పాపం అధికమైన కారణంగా యెహోవా దాన్ని బాధకు గురి చేశాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకుని వెళ్ళారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

5 యెరూషలేము శత్రువులు గెలిచారు. ఆమె శత్రువులు విజయవంతులయ్యారు. యెహోవా ఆమెను శిక్షించిన కారణంగా ఇదంతా జరిగింది. యెరూషలేము చేసిన అనేక పాపాలకు ఆయన ఆమెను శిక్షించినాడు. ఆమె పిల్లలు వెళ్ళిపోయారు. వారి శత్రువులకు బందీలై వారు వెళ్ళిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 ఆమె విరోధులు ఆమెకు యజమానులయ్యారు; ఆమె శత్రువులు సుఖంగా జీవిస్తున్నారు; ఆమె యొక్క అనేక పాపాలను బట్టి యెహోవా ఆమెకు దుఃఖం కలిగించారు. ఆమె పిల్లలు చెరకు వెళ్లారు, వారు శత్రువు ముందు బందీలుగా ఉన్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:5
38 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారి పూర్వికులు ఈజిప్టు నుండి వచ్చిన రోజు నుండి ఈ ఒక రోజు వరకు నా దృష్టిలో చెడుగా ప్రవర్తిస్తూ నాకు కోపం రేపారు.”


మమ్మల్ని మా పొరుగువారికి హాస్యాస్పదంగా చేశారు. మా శత్రువులు మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు.


మీరు అతని శత్రువుల కుడిచేతిని బలపరిచారు; అతని శత్రువులందరు ఆనందించేలా చేశారు.


దర్శనపు లోయలో సైన్యాల అధిపతియైన యెహోవా నియమించిన రోజున కల్లోలం, తొక్కిసలాట, గందరగోళం ఉంటాయి, గోడలు కూలిపోతాయి పర్వతాల వైపు కేకలతో ఏడ్వడం ఉంటుంది.


మీ ప్రజలు కొద్ది కాలమే మీ పరిశుద్ధ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు కాని ఇప్పుడు మా శత్రువులు మీ పరిశుద్ధాలయాన్ని త్రొక్కివేశారు.


నా గుడారం నాశనమైంది; దాని త్రాళ్లన్నీ తెగిపోయాయి. నా పిల్లలు నా నుండి వెళ్లిపోయారు, వారిక లేరు; నా గుడారం వేయడానికి నాకు బసను ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎవరూ లేరు.


“నా ఇంటిని విడిచిపెడతాను, నా వారసత్వాన్ని వదిలివేస్తాను; నేను ప్రేమించిన దానిని తన శత్రువుల చేతికి అప్పగిస్తాను.


యెరూషలేము ప్రవక్తల్లో భయంకరమైనది నేను చూశాను: వారు వ్యభిచారం చేస్తారు, అబద్ధాలతో జీవిస్తారు. వారు దుర్మార్గుల చేతులను బలపరుస్తారు, వారిలో ఒక్కరు కూడా తమ దుష్టత్వాన్ని విడిచిపెట్టరు. వారందరూ నాకు సొదొమలాంటివారు; యెరూషలేము ప్రజలు గొమొర్రా వంటివారు.”


రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను పట్టణంలో మిగిలి ఉన్నవారిని, ద్రోహులై తమ రాజును విడిచి అతనితో చేరిన వారిని, మిగిలిన ప్రజలందరినీ బబులోనుకు బందీలుగా తీసుకెళ్లాడు.


దీని కోసం నేను వారిని శిక్షించకూడదా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోకూడదా?


“అందుకే నేను ఏడుస్తున్నాను నా కళ్ల నుండి కన్నీరు పొర్లి పారుతున్నాయి. నన్ను ఓదార్చడానికి నాకు దగ్గరగా ఎవరూ లేరు, నా ఆత్మను ఉత్తేజపరచడానికి ఎవరూ లేరు. శత్రువు నన్ను జయించాడు కాబట్టి నా పిల్లలు నిరుపేదలయ్యారు.”


“యెహోవా నీతిమంతుడు, అయినా నేను ఆయన ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాను. జనాంగములారా, వినండి; నా శ్రమను చూడండి. నా యువకులు, యువతులు చెరకు వెళ్లారు.


యెరూషలేము చాలా పాపం చేసింది కాబట్టి అపవిత్రమైనది. ఆమెను గౌరవించిన వారందరూ ఆమెను తృణీకరిస్తారు, అందరు ఆమెను నగ్నంగా చూశారు. ఆమె మూలుగుతూ వెనుదిరిగింది.


యెహోవా తాను సంకల్పించింది చేశారు, చాలా కాలం క్రితం ఆయన శాసించిన, తన మాట ఆయన నెరవేర్చారు. ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు, శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు, ఆయన నీ శత్రువుల కొమ్మును హెచ్చించారు.


“మా శత్రువులందరూ మాకు వ్యతిరేకంగా నోరు తెరిచారు.


కాబట్టి వారి మీద ఏమాత్రం దయ చూపించను వారిని కనికరించను కాని వారు చేసిన దానికి తగిన ప్రతిఫలాన్ని నేను వారికి ఇస్తాను” అన్నారు.


అందుకు ఆయన నాతో, “ఇశ్రాయేలు ప్రజల పాపాలు, యూదా ప్రజల పాపాలు చాలా ఘోరంగా ఉన్నాయి. ఈ దేశమంతా రక్తపాతంతో పట్టణమంతా అన్యాయంతో నిండిపోయింది. యెహోవా మమ్మల్ని చూడడు; యెహోవా దేశాన్ని విడిచిపెట్టాడని వారు అనుకుంటున్నారు.


ఎందుకంటే నేను చనిపోయాక మీరు పూర్తిగా అవినీతిపరులై నేను ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు తొలగిపోతారని నాకు తెలుసు. రాబోయే రోజుల్లో, మీరు యెహోవా దృష్టికి చెడు చేసి, మీ చేతులు చేసిన వాటి వల్ల ఆయనకు కోపం పుట్టిస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో విపత్తు మీ మీదికి వస్తుంది.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ