Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




విలాపవాక్యములు 1:21 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

21 “ప్రజలు నా మూలుగు విన్నారు, కాని నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు. నా శత్రువులందరూ నా బాధను గురించి విన్నారు; మీరు నాకు చేసిన దానిని బట్టి వారు సంతోషిస్తున్నారు. మీరు ప్రకటించిన రోజును మీరు రప్పించాలి అప్పుడు వారు నాలా అవుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

21 నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువా డొకడును లేడాయెను నీవు నాకు ఆపద కలుగజేసితివన్న వార్త నా విరోధులందరు విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు అప్పుడు వారు నన్ను పోలియుండెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

21 నా మూలుగు విను. నన్ను ఆదరించేవాడు ఒక్కడూ లేదు. నువ్వు నాకు కష్టం కలిగించావన్న వార్త నా శత్రువులు విని సంతోషంగా ఉన్నారు. నువ్వు ప్రకటించిన ఆ రోజు రప్పించు, అప్పుడు వాళ్ళకు కూడా నాకు జరిగినట్టే జరుగుతుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

21 “నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను. ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు. నా శత్రువులంతా నా కష్టాల గురించి విన్నారు. విని సంతోషపడ్డారు. నీవు నాకు ఈ శిక్ష విధించినందుకు వారు సంతోషించారు. నీవు ప్రకటించిన ఆ రోజును ఇప్పుడు రప్పించుము. ఆ రోజున నా శత్రువులు ఇప్పుడు నేనున్న స్థితికి వచ్చేలా చేయుము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

21 “ప్రజలు నా మూలుగు విన్నారు, కాని నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరు. నా శత్రువులందరూ నా బాధను గురించి విన్నారు; మీరు నాకు చేసిన దానిని బట్టి వారు సంతోషిస్తున్నారు. మీరు ప్రకటించిన రోజును మీరు రప్పించాలి అప్పుడు వారు నాలా అవుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




విలాపవాక్యములు 1:21
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

నేను తడబడినప్పుడు వారు సంతోషంతో సమకూడారు; నాకు తెలియకుండానే దుండగులు నా మీదికి వచ్చారు. ఆపకుండ వారు నా మీద అపవాదు వేశారు.


వారి సమయం దగ్గరపడింది, కాబట్టి ప్రభువు దుష్టులను చూసి నవ్వుతారు.


నేను, “నా కాలు జారితే వారు సంతోషించవద్దు వారు నాపై రెచ్చిపోవద్దు” అని ప్రార్థించాను.


దుర్మార్గుల దుడ్డుకర్రను పాలకుల రాజదండాన్ని యెహోవా విరగ్గొట్టారు.


వారు కోపంతో ఎడతెగని దెబ్బలతో ప్రజలను క్రూరంగా కొట్టారు, కోపంతో ప్రజలను పరిపాలించి కనికరం లేకుండా వారిని అణచివేశారు.


“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.


ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా? ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా, నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?


“నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా, అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు.


అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, దాని గోడలు కూలిపోయాయి. ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి.


“బబులోను మీదికి రమ్మని, విలుకాండ్రను బాణాలు విసిరే వారిని పిలువండి. ఆమె చుట్టూ చేరండి; ఎవరూ తప్పించుకోకూడదు. ఆమె చేసిన వాటికి ప్రతిఫలం ఇవ్వండి; ఆమె చేసినట్లే ఆమెకు చేయండి. ఇశ్రాయేలు పరిశుద్ధుడైన యెహోవాను ఆమె ధిక్కరించింది.


సైన్యాల యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అహంకారి, నేను నీకు వ్యతిరేకంగా ఉన్నాను, నీ శ్రమ దినం వచ్చింది, నీవు శిక్షించబడే సమయం వచ్చింది.


“బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“బబులోను ఇశ్రాయేలు వారిని చంపినట్లే, బబులోను పతనం కావాలి బబులోనువారు భూమి అంతటా చంపబడతారు.


“అందుకే నేను ఏడుస్తున్నాను నా కళ్ల నుండి కన్నీరు పొర్లి పారుతున్నాయి. నన్ను ఓదార్చడానికి నాకు దగ్గరగా ఎవరూ లేరు, నా ఆత్మను ఉత్తేజపరచడానికి ఎవరూ లేరు. శత్రువు నన్ను జయించాడు కాబట్టి నా పిల్లలు నిరుపేదలయ్యారు.”


రాత్రంతా ఆమె ఘోరంగా ఏడుస్తూ ఉంటుంది, ఆమె చెంపల మీద కన్నీరు ఉంటుంది. ఆమె ప్రేమికులందరి మధ్య ఉన్నా ఆమెను ఓదార్చడానికి ఎవరూ లేరు. ఆమె స్నేహితులందరూ ఆమెను అప్పగించారు; వారు ఆమెకు శత్రువులయ్యారు.


“వారి దుష్టత్వమంతా మీ ముందుకు రావాలి; నా పాపాలన్నిటిని బట్టి మీరు నాతో ఎలా వ్యవహరించారో వారితో కూడా అలాగే వ్యవహరించాలి. నా మూలుగులు అనేకం నా హృదయం సొమ్మసిల్లింది.”


సీయోనుకు వెళ్లే దారులు దుఃఖిస్తున్నాయి, ఎందుకంటే దాని నియమించబడిన పండుగలకు ఎవరూ రావట్లేదు. దాని ద్వారాలన్నీ నిర్జనమయ్యాయి, ఆమె యాజకులు మూలుగుతున్నారు, ఆమె యువతులు దుఃఖపడుతున్నారు, ఆమె తీవ్ర వేదనలో ఉంది.


యెరూషలేము చాలా పాపం చేసింది కాబట్టి అపవిత్రమైనది. ఆమెను గౌరవించిన వారందరూ ఆమెను తృణీకరిస్తారు, అందరు ఆమెను నగ్నంగా చూశారు. ఆమె మూలుగుతూ వెనుదిరిగింది.


నీ దారిన వెళ్లేవారంతా నిన్ను చూసి, చప్పట్లు కొడతారు; వారు యెరూషలేము దిక్కు చూసి ఎగతాళిగా తలలాడిస్తూ ఇలా అంటారు: “పరిపూర్ణ సౌందర్య పట్టణమని, సమస్త భూనివాసులకు ఆనంద కారణమని ఈ పట్టణాన్ని గురించేనా చెప్పుకున్నారు?”


నీ శత్రువులందరూ నీకు వ్యతిరేకంగా నోరు విప్పారు. వారు ఎగతాళి చేసి పళ్లు కొరుకుతూ, “మేము ఆమెను నాశనం చేశాము. ఈ రోజు కోసమే మేము ఎదురు చూసింది; దీన్ని చూడడానికే మేము బ్రతికి ఉండింది” అని అంటారు.


“మనుష్యకుమారుడా, యెరూషలేము గురించి తూరు, ‘ఆహా! జనాంగాలకు గుమ్మం విరిగిపోయింది, దాని తలుపులు నా కోసం తెరచుకొని ఉన్నాయి; ఇప్పుడు అది శిథిలావస్థలో ఉంది కాబట్టి నేను వృద్ధి చెందుతాను’ అని చెప్పింది.


తీర్పు తీర్చే లోయలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉన్నారు, ఎందుకంటే తీర్పు తీర్చే లోయలో యెహోవా దినం ఆసన్నమైంది.


ఆమె ఎలా ఇచ్చిందో ఆమెకు అలాగే ఇవ్వండి; ఆమె చేసిన దానికి రెండింతలు ఆమెకు తిరిగి చెల్లించండి. ఆమె పాత్ర నుండే ఆమెకు రెండింతలు పోసి ఇవ్వండి!


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ