Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యెహోషువ 7:2 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 తర్వాత యెహోషువ యెరికో నుండి బేతేలుకు తూర్పున బేత్-ఆవెను సమీపంలో ఉన్న హాయికి మనుష్యులను పంపుతూ, “మీరు వెళ్లి ఆ ప్రదేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి హాయిని వేగు చూశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 యెహోషువ–మీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 యెహోషువ “మీరు వెళ్లి దేశాన్ని వేగు చూడండి” అని చెప్పి బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉన్న హాయి అనే పట్టణానికి యెరికో నుండి గూఢచారులను పంపాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

2 వారు యెరికోను ఓడించిన తర్వాత యెహోషువ హాయి పట్టణానికి కొందరు మనుష్యుల్ని పంపించాడు. బేతేలుకు తూర్పున బేతావెను దగ్గర ఉంది హాయి. “హాయికి వెళ్లి, ఆ ప్రాంతంలో బలహీనతలు ఏమిటో చూడండి” అని యెహోషువ వారితో చెప్పాడు. కనుక ఆ దేశాన్ని వేగు చూడటానికి ఆ మనుష్యులు వెళ్లారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 తర్వాత యెహోషువ యెరికో నుండి బేతేలుకు తూర్పున బేత్-ఆవెను సమీపంలో ఉన్న హాయికి మనుష్యులను పంపుతూ, “మీరు వెళ్లి ఆ ప్రదేశాన్ని వేగుచూసి రండి” అని చెప్పాడు. కాబట్టి వారు వెళ్లి హాయిని వేగు చూశారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యెహోషువ 7:2
18 ပူးပေါင်းရင်းမြစ်များ  

అక్కడినుండి బేతేలుకు తూర్పున ఉన్న కొండల వైపు వెళ్లి అక్కడ గుడారం వేసుకున్నాడు. దానికి పడమర బేతేలు, తూర్పున హాయి ఉన్నాయి. అక్కడ అతడు యెహోవాకు బలిపీఠం నిర్మించి యెహోవాను ఆరాధించాడు.


ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు, ముందు ఆ పట్టణం లూజు అని పిలువబడేది.


అతడు ఒకదాన్ని బేతేలులో, ఇంకొక దానిని దానులో పెట్టాడు.


గెబాలో స్థిరపడిన బెన్యామీనీయులు మిక్మషులో, అయ్యాలో, బేతేలు వాటి చుట్టుప్రక్కల గ్రామాల్లో,


ప్రణాళికలు ఆలోచనచేత బలపరచబడతాయి, మంచిచెడులనెరిగిన నాయకుడవై పోరాడాలి.


ఖచ్చితంగా యుద్ధం చేయడానికి మీకు నడిపించేవారు అవసరం అనేకమంది సలహాదారుల ద్వారా విజయం సాధ్యమవుతుంది.


అష్షూరీయులు ఆయాతులో ప్రవేశించారు; మిగ్రోను గుండా వెళ్లారు; మిక్మషులో తమ సామాను ఉంచారు.


“హెష్బోనూ, ఏడువు. ఎందుకంటే హాయి నాశనం చేయబడింది! రబ్బా నివాసులారా, బిగ్గరగా ఏడవండి! గోనెపట్ట కట్టుకుని దుఃఖించండి; గోడల లోపల ఇటు అటు పరుగెత్తండి, ఎందుకంటే మోలెకు దేవుడు తన యాజకులు, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.


“ఇశ్రాయేలూ, నీవు వ్యభిచారం చేసినా సరే, యూదా అపరాధం చేయకూడదు. “గిల్గాలుకు వెళ్లవద్దు; బేత్-ఆవెనుకు వెళ్లవద్దు. ‘యెహోవా జీవం తోడు’ అని ఒట్టు పెట్టుకోవద్దు.


“చూడండి, నేను మిమ్మల్ని తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను. కాబట్టి మీరు పాముల్లా వివేకంగాను పావురాల్లా కపటం లేనివారిగాను ఉండండి.


చాలా జాగ్రత్తగా ఉండండి, అజ్ఞానుల్లా కాకుండా జ్ఞానుల్లా జీవించండి.


యెరికో రాజు ఒక్కడు హాయి రాజు (బేతేలు సమీపంలోని) ఒక్కడు


ఉత్తరాన వారి సరిహద్దు యొర్దాను నది దగ్గర మొదలై యెరికోకు ఉత్తరంగా వెళ్లి పడమర వైపుకు కొండ సీమగుండా వెళ్లి, బేత్-ఆవెను అడవి వరకు ఉంది.


అప్పుడు నూను కుమారుడైన యెహోషువ షిత్తీము నుండి ఇద్దరు వేగులవారు రహస్యంగా పంపుతూ, “వెళ్లి ఆ దేశాన్ని, ముఖ్యంగా యెరికోను వేగుచూసి రండి” అని వారితో చెప్పాడు. వారు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు.


వారు యెహోషువ దగ్గరకు తిరిగివచ్చి, “హాయి మీదికి సైన్యమంతా వెళ్లాల్సిన అవసరం లేదు. దాన్ని స్వాధీనపరచుకోడానికి రెండు లేదా మూడువేలమందిని పంపండి చాలు, సైన్యమంతా అలసిపోనవసరం లేదు, ఎందుకంటే అక్కడ కొంతమంది మాత్రమే నివసిస్తున్నారు.”


ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయడానికి మూడువేల రథాలు, ఆరువేల గుర్రపురౌతులు, సముద్రపు ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సైనికులను సమకూర్చుకున్నారు. వీరు బయలుదేరి బేత్-ఆవెనుకు తూర్పున ఉన్న మిక్మషులో శిబిరం ఏర్పరచుకున్నారు.


ఆ రోజే యెహోవా ఇశ్రాయేలీయులను రక్షించారు, యుద్ధం బేత్-ఆవెను అవతల వరకు సాగింది.


దావీదు దానిని బేతేలులో దక్షిణ రామోతులో యత్తీరులో ఉన్నవారికి,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ