Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోవేలు 2:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 “ఆ తర్వాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

28 “దీని తరువాత ప్రజలందరిమీద నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను). మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ ముసలివాళ్ళు కలలు కంటారు. మీ యువకులు దర్శనాలు చూస్తా రు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 “ఆ తర్వాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు, మీ యువకులు దర్శనాలు చూస్తారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోవేలు 2:28
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

నా గద్దింపును విని పశ్చాత్తాపపడండి! అప్పుడు నా ఆత్మను మీమీద కుమ్మరిస్తాను, నా ఉపదేశాలను మీకు తెలియజేస్తాను.


పైనుండి మామీద ఆత్మ కుమ్మరించబడేవరకు ఇలా ఉంటాయి. తర్వాత అరణ్యం ఫలభరితమైన భూమిలా, ఫలభరితమైన భూమి అడవిగా మారుతాయి.


యెహోవా మహిమ వెల్లడవుతుంది. దాన్ని ప్రజలందరు చూస్తారు. యెహోవాయే ఇది తెలియజేశారు.”


నేను దాహంతో ఉన్న దేశం మీద నీళ్లు, ఎండిన భూమి మీద నీటి ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానంపై నా ఆత్మను, నీ వారసులపై నా ఆశీర్వాదాలను కుమ్మరిస్తాను.


నిన్ను బాధించేవారు తమ మాంసాన్ని తామే తినేలా చేస్తాను; ద్రాక్షరసంతో మత్తు ఎక్కినట్లు వారు తమ రక్తాన్ని త్రాగి మత్తులో ఉంటారు. అప్పుడు యెహోవానైన నేనే నీ రక్షకుడనని యాకోబు బలవంతుడైన నీ విమోచకుడని మానవులందరూ తెలుసుకుంటారు.”


ఆయన అంటున్నారు: “నీవు యాకోబు గోత్రాలను పునరుద్ధరించడానికి, ఇశ్రాయేలులో నేను తప్పించిన వారిని తిరిగి రప్పించడానికి నా సేవకునిగా ఉండడం నీకు చాలా చిన్న విషయము. నేనిచ్చే రక్షణ భూమి అంచుల వరకు చేరడానికి యూదేతర ప్రజలకు వెలుగుగా నేను నిన్ను చేస్తాను.”


యెహోవా నీ పిల్లలందరికి బోధిస్తారు వారికి గొప్ప సమాధానం కలుగుతుంది.


“నా పేరిట అబద్ధాలు చెప్పే ప్రవక్తలు చెప్పేది నేను విన్నాను. వారు, ‘నాకొక కల వచ్చింది! నాకొక కల వచ్చింది!’ అని అంటారు.


కలలు కనే ప్రవక్తలు వారి కలలను చెప్పవచ్చు, నా సందేశాన్ని పొందుకున్న వారు ఆ సందేశాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. పొట్టుకు ధాన్యంతో ఏమి సంబంధం?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


నా ఆత్మను మీలో ఉంచి, నా శాసనాలను అనుసరించి నా ధర్మశాస్త్రాన్ని పాటించేవారిగా మిమ్మల్ని చేస్తాను.


మీరు బ్రతికేలా మీలో నా ఆత్మను ఉంచి మీ స్వదేశంలో మీరు నివసించేలా చేస్తాను. అప్పుడు యెహోవానైన నేను మాట ఇచ్చాను, దానిని నెరవేర్చానని మీరు తెలుసుకుంటారని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరిస్తాను, కాబట్టి వారికిక నా ముఖాన్ని దాచను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.”


బబులోను రాజైన బెల్షస్సరు పరిపాలనలోని మొదటి సంవత్సరంలో, దానియేలు తన పడక మీద పడుకుని ఉన్నప్పుడు అతనికి ఒక కల వచ్చింది, దర్శనాలు తన మనస్సులో కలిగాయి. అతడు తన కలను ఇలా సంక్షిప్తంగా వ్రాశాడు.


“అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.


నేను దిగివచ్చి నీతో మాట్లాడతాను. నీ మీద ఉన్న ఆత్మ యొక్క శక్తిలో కొద్ది భాగం వారి మీద పెడతాను. వారు నీతో కలిసి ప్రజల భారం పంచుకుంటారు అప్పుడు నీవు ఒంటరిగా మోయనవసరం ఉండదు.


ఆయన, “నా మాటలు వినండి: “ఒకవేళ మీ మధ్య ప్రవక్త ఉంటే, యెహోవానైన నేను దర్శనాలలో వారికి ప్రత్యక్షమవుతాను, కలలలో నేను వారితో మాట్లాడతాను.


తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మతో నిండుకొని ఈ విధంగా ప్రవచించాడు:


దేవుని రక్షణను ప్రజలందరు చూస్తారు.’ ”


ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు కాబట్టి ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.


దేవుని కుడిచేతి వైపుకు ఎత్తబడి, తండ్రి చేసిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మను పొందుకొని ఇప్పుడు మీరు చూస్తూ వింటున్న దానిని మీమీద కుమ్మరించారు.


ఈ వాగ్దానం మీకు మీ పిల్లలకు దూరంగా ఉన్నవారందరికి అనగా, మన ప్రభువైన దేవుడు పిలిచే వారందరికి చెందుతుంది” అని వారితో చెప్పాడు.


అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు.


ఇందులో యూదులని గ్రీసు దేశస్థులని, దాసులని స్వతంత్రులని, పురుషుడని స్త్రీ అని ఏ భేదం లేదు, క్రీస్తు యేసులో అందరు ఒక్కటే.


గతంలో దేవుడు మన పితరులతో ప్రవక్తల ద్వారా ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా మాట్లాడారు.


దావీదును పట్టుకోడానికి సౌలు దూతలను పంపాడు. వారు వచ్చి అక్కడ ప్రవక్తలు గుంపుగా చేరి ప్రవచించడం వారికి నాయకునిగా సమూయేలు నిలబడి ఉండడం చూసినప్పుడు దేవుని ఆత్మ సౌలు పంపిన సైనికుల మీదికి వచ్చి వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు.


ఈ సంగతి విన్న సౌలు మరి కొంతమందిని పంపించగా వారు కూడా ప్రవచించడం మొదలుపెట్టారు. సౌలు మూడవసారి కూడా దూతలను పంపాడు గాని వారు కూడా ప్రవచిస్తూ ఉన్నారు.


సౌలు యెహోవా దగ్గర విచారణ చేశాడు కాని కలల ద్వారా గాని ఊరీము ద్వారా గాని ప్రవక్తల ద్వారా గాని అతనికి సమాధానం రాలేదు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ