యోవేలు 2:17 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం17 యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?” အခန်းကိုကြည့်ပါ။పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)17 యెహోవాకు పరిచర్యచేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు –యెహోవా, నీ జనులయెడల జాలిచేసికొని, అన్యజనులు వారిమీద ప్రభుత్వము చేయునట్లు వారిని అవమానమున కప్పగింపకుము; లేనియెడల అన్యజనులు–వారి దేవుడు ఏమాయెనందురు గదా యని వేడుకొనవలెను. အခန်းကိုကြည့်ပါ။ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201917 యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?” အခန်းကိုကြည့်ပါ။పవిత్ర బైబిల్17 యాజకులను, యెహోవా సేవకులను మండపానికి బలిపీఠానికి మధ్య విలపించనివ్వండి ఆ ప్రజలందరూ ఈ విషయాలు చెప్పాలి: “యెహోవా, నీ ప్రజలను కరుణించు. నీ ప్రజలను సిగ్గుపడనియ్యకు. నీ ప్రజలనుగూర్చి ఇతరలను హేళన చేయనియ్యకు. ఇతర దేశాల్లోని ప్రజలు నవ్వుతూ ‘వారిదేవుడు ఎక్కడ?’ అని చెప్పనియ్యకు.” အခန်းကိုကြည့်ပါ။తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం17 యెహోవా ఎదుట సేవచేసే యాజకులు మంటపానికి బలిపీఠానికి మధ్య నిలబడి ఏడ్వాలి. వారు, “యెహోవా! మీ ప్రజలను కనికరించండి. మీ స్వాస్థ్యమైన వారిని అవమాన పడనివ్వకండి వారు దేశాల మధ్య హేళన చేయబడకూడదు. ‘వీరి దేవుడు ఎక్కడ?’ అని ప్రజలు ఎందుకు అనుకోవాలి?” အခန်းကိုကြည့်ပါ။ |