Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యోహాను 8:9 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వారామాట విని, పెద్దవారు మొదలుకొని చిన్నవారివరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్లిరి; యేసు ఒక్కడే మిగిలెను; ఆ స్త్రీమధ్యను నిలువబడియుండెను.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 ఆయన పలికిన మాట విని పెద్దా చిన్నా అంతా ఒకరి తరువాత ఒకరు బయటకు వెళ్ళారు. చివరికి యేసు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ స్త్రీ అలానే మధ్యలో నిలబడి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

9 ఇది విన్న వాళ్ళు ఒక్కొక్కరు అక్కడి నుండి వెళ్ళటం మొదలుపెట్టారు. మొదట వృద్ధులు వెళ్ళి పోయారు. చివరకు అక్కడ నిలుచున్న స్త్రీతో యేసు మాత్రం మిగిలిపోయ్యాడు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వారు ఆ మాట విని పెద్దవారి నుండి చిన్నవారి వరకు ఒకరి తర్వాత ఒకరిగా వెళ్లిపోయారు. యేసు ఒక్కరే మిగిలారు; ఆ స్త్రీ అక్కడే నిలబడి ఉంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదము

9 వారు ఆ మాట విని, యేసుతో పాటు అక్కడ నిలబడి ఉన్న స్త్రీ తప్ప, ఒకరి తర్వాత ఒకరిగా మొదట పెద్దవారు వెళ్లిపోయారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యోహాను 8:9
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

ఆమె ఏలీయాతో అన్నది, “దైవజనుడా, మీరు నాకు చేసిందేంటి? నా పాపం నాకు జ్ఞాపకంచేసి నా కుమారున్ని చంపడానికి వచ్చారా?”


రాజు షిమీతో ఇంకా మాట్లాడుతూ, “నీవు నా తండ్రియైన దావీదుకు చేసిన కీడు గురించి నీకు తెలుసు. ఇప్పుడు నీవు చేసిన చెడుకు యెహోవా నీకు తిరిగి చెల్లిస్తారు.


ఆకాశాలు వారి అపరాధాన్ని బయటపెడతాయి; భూమి వారి మీదికి లేస్తుంది.


దుర్మార్గుల ఉల్లాసం కొద్దిసేపే అని, భక్తిహీనుల సంతోషం ఒక క్షణమే ఉంటుందని నీకు తెలుసు.


నా ప్రాణం తీయాలని కోరేవారందరు సిగ్గుకు, గందరగోళానికి గురవ్వాలి; నా పతనాన్ని కోరేవారందరు అవమానంతో వెనుకకు తిరిగి వెళ్లాలి.


మీరు ఇవి చేసినప్పుడు నేను మౌనంగా ఉన్నాను, నేను మీలాంటి వాణ్ణే అని మీరనుకున్నారు. కాని నేనిప్పుడు మిమ్మల్ని నిలదీస్తున్నాను, నా ఆరోపణలను మీ ముందు పెడుతున్నాను.


నాపై నేరం మోపేవారు సిగ్గుతో నశించుదురు గాక; నాకు హాని చేయాలని కోరేవారు ఎగతాళిచేయబడి అవమానపరచబడుదురు గాక.


ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు.


ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, ఆయనను వ్యతిరేకించిన వారందరు సిగ్గుపడ్డారు, కానీ ప్రజలందరు ఆయన చేస్తున్న మహత్కార్యాలను చూసి సంతోషించారు.


యేసు తన తలయెత్తి, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు.


యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.


ఉదయం పెందలకడనే యేసు మళ్ళీ దేవాలయ ఆవరణంలో కనబడినప్పుడు ప్రజలందరు ఆయన చుట్టూ చేరారు. ఆయన వారికి బోధించడానికి కూర్చున్నారు.


అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు పరిసయ్యులు వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీని తీసుకుని వచ్చారు. వారు ఆమెను గుంపు ముందు నిలబెట్టి,


మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ ఉన్నారు.


ధర్మశాస్త్ర సారం తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు. అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది. వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి.


వ్యభిచరించవద్దు అని ప్రజలకు చెప్పే మీరే వ్యభిచరిస్తారా? విగ్రహాలను అసహ్యించుకునే మీరే గుళ్లను దోచుకుంటారా?


మన హృదయం మనపై దోషారోపణ చేస్తే, మన హృదయం కంటే దేవుడు గొప్పవాడని ఆయన సమస్తాన్ని ఎరిగినవాడని మనం తెలుసుకుంటాము.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ