Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 8:3 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నేను వారిని ఎక్కడికి బహిష్కరించినా, ఈ దుష్ట జనాంగంలో మిగిలినవారంతా బ్రతకడం కంటే చావునే కోరుకుంటారు, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న యీ చెడ్డ వంశములో శేషించిన వారందరు జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఈ దుర్మార్గ దేశంలో ఇంకా మిగిలి ఉన్నవారు నేను వారిని చెదర గొట్టిన స్థలాల్లో జీవానికి బదులు చావును కోరుకుంటారు. సేనల ప్రభువైన యెహోవా వాక్కు ఇదే.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

3 “యూదా ప్రజలు వారి ఇండ్లను, రాజ్యాన్ని వదిలి పోయేలా నేను ఒత్తిడి చేస్తాను. ఆ ప్రజలు వారి దేశాన్నుండి పరరాజ్యానికి తీసికొని పోబడతారు. యుద్ధంలో చావగా మిగిలిన యూదా ప్రజలు (ఈ దుష్ట ప్రజలు) తాము కూడ చనిపోతే బాగుండేదని భావిస్తారు,” ఈ వాక్కు యెహోవా నుండి వచ్చినది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నేను వారిని ఎక్కడికి బహిష్కరించినా, ఈ దుష్ట జనాంగంలో మిగిలినవారంతా బ్రతకడం కంటే చావునే కోరుకుంటారు, అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.’

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 8:3
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

అతడు మాత్రం ఎడారిలోకి రోజంతా ప్రయాణం చేశాడు. ఒక బదరీచెట్టు క్రింద కూర్చుని చనిపోవాలని కోరుతూ, “యెహోవా, నా ప్రాణం తీసుకోండి; నేను నా పూర్వికులకంటే గొప్పవాన్ని కాను” అని ప్రార్థించాడు.


“నేను వాటిని తరిమికొట్టిన దేశాలన్నిటిలో నుండి నా మందలో మిగిలిన వాటిని నేనే పోగుచేసి, వాటి పచ్చిక బయళ్లకు తిరిగి వాటిని తీసుకువస్తాను, అక్కడ అవి ఫలించి వృద్ధిచెందుతాయి.


అయితే, ‘ఇశ్రాయేలీయుల సంతానాన్ని ఉత్తర దేశంలో నుండి, ఆయన వారిని బహిష్కరించిన అన్ని దేశాల నుండి బయటకు రప్పించిన సజీవుడైన యెహోవా పేరిట’ అని వారు చెప్తారు. అప్పుడు వారు వారి స్వదేశంలో నివసిస్తారు.”


మీరు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చెర నుండి తిరిగి రప్పిస్తాను. నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన అన్ని దేశాల నుండి అన్ని ప్రాంతాల నుండి మిమ్మల్ని సమకూరుస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “నేను మిమ్మల్ని వెళ్లగొట్టిన దేశానికి తిరిగి తీసుకువస్తాను.


అతడు బబులోనులో ఉన్న మాకు, మీరు చాలా కాలం పాటు ఉంటారు. కాబట్టి ఇల్లు కట్టుకుని స్థిరపడండి; తోటలు వేసి వాటి పండ్లు తినండని సందేశాన్ని పంపాడు.’ ”


వారందరూ వారు చెదరగొట్టబడిన అన్ని దేశాల నుండి యూదా దేశానికి, మిస్పాలోని గెదల్యా దగ్గరకు తిరిగి వచ్చారు. వారు సమృద్ధిగా ద్రాక్షరసాన్ని వేసవికాలపు పండ్లను సేకరించారు.


“ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: యెరూషలేము మీదా యూదా పట్టణాలన్నింటి మీదా నేను తెచ్చిన మహా విపత్తును మీరు చూశారు. వారు చేసిన దుర్మార్గం కారణంగా నేడు అవి నిర్జనమై శిథిలావస్థలో ఉన్నాయి.


కాబట్టి, నా తీవ్రమైన కోపం యూదా పట్టణాల మీదా, యెరూషలేము వీధుల మీదా కుమ్మరించబడి వాటిని నేటి వరకు పాడైపోయిన శిథిలాలుగా మిగిల్చింది.


సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “మిగిలిన ఇశ్రాయేలీయులను ద్రాక్షపళ్లలా వారిని ఏరుకోనివ్వండి; ఒకడు ద్రాక్ష పళ్లను ఏరుకున్నట్లుగా, మళ్ళీ కొమ్మల మీద నీ చేయి వేయి.”


“ప్రభువా! మీరు నీతిమంతులు, కాని ఈ రోజు మేమైతే అనగా మీ పట్ల మేము చూపిన నమ్మకద్రోహాన్ని బట్టి ఆయా దేశాలకు చెదరగొట్టబడిన యూదా ప్రజలం, యెరూషలేము నివాసులం, ఇశ్రాయేలీయులం, దగ్గరగా దూరంగా ఉన్నవారమందరం అవమానంతో నిండిపోయాము.


నేను మిమ్మల్ని దేశాల మధ్యకు చెదరగొట్టి, నా ఖడ్గాన్ని తీసి మిమ్మల్ని వెంటాడుతాను. మీ భూమి వృథా అవుతుంది, మీ పట్టణాలు శిథిలావస్థలో ఉంటాయి.


ఇశ్రాయేలీయులారా! యెహోవా ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన కుటుంబమంతటి గురించి నేను పలికిన ఈ మాట వినండి:


యెహోవా, బ్రతకడం కంటే నాకు చావడం మేలు, కాబట్టి నా ప్రాణాన్ని తీసివేయండి.”


కాబట్టి యెహోవా చెప్పే మాట ఇదే: “నేను ఈ వంశం మీదికి విపత్తు రప్పించబోతున్నాను, దాని నుండి మీరు మిమ్మల్ని కాపాడుకోలేరు. అది విపత్తు కాలం కాబట్టి మీరు ఇక ఎన్నడు గర్వంగా నడవలేరు.


నేను మీ ముందుంచిన ఈ దీవెనలు, శాపాలన్నీ మీ మీదికి వచ్చి, మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని చెదరగొట్టిన దేశాల్లో మీరు వాటిని హృదయంలో భద్రం చేసుకుని,


మీరు ఆకాశం క్రింద అత్యంత సుదూర దేశానికి చెదరిపోయినప్పటికి, అక్కడినుండి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని సమకూర్చి తిరిగి తీసుకువస్తారు.


వారు కొండలతో, బండలతో, “మీరు మామీద వచ్చి పడండి! సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాని ముఖం నుండి వధించబడిన గొర్రెపిల్ల ఉగ్రత నుండి మమ్మల్ని దాచి పెట్టండి!


ఆ రోజుల్లో మనుష్యులు మరణాన్ని వెదకుతారు కాని అది వారికి దొరకదు; వారు చావాలని కోరుకుంటారు కాని మరణం వారి నుండి పారిపోతుంది.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ