Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 6:28 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

28 వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

28 వారందరు బహు ద్రోహులు, కొండె గాండ్రు, వారు మట్టిలోహము వంటివారు, వారందరు చెరుపువారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

28 వారంతా బహు ద్రోహులు, కొండెగాళ్ళు. వారు మట్టి లోహం వంటివారు, వారి అంతరంగం ఇత్తడి, ఇనుములాగా బహు కఠినంగా ఉంటాయి.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు; వారు చాలా మొండివారు. వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు. వారు తుప్పుతో కప్పబడియున్న కంచు, ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

28 వారంతా మొండి తిరుగుబాటుదారులు, వారు అభాండాలు వేస్తూ తిరుగుతున్నారు. వారు ఇత్తడి, ఇనుము లాంటివారు; వారంతా అవినీతికి పాల్పడుతున్నారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 6:28
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

“దేవుడు లేడు” అని మూర్ఖులు తమ హృదయంలో అనుకుంటారు. వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి; మంచి చేసేవారు ఒక్కరు లేరు.


మీరు కూర్చుని మీ సోదరునికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తారు, మీ సొంత తల్లి కుమారుని మీద అభాండాలు వేస్తారు.


పగను దాచిపెట్టేవారు అబద్ధికులు, ఇతరుల మీద నిందలు వేసేవారు మూర్ఖులు.


ఇశ్రాయేలీయులారా, మీరు ఎవరిపై తిరుగుబాటు చేశారో ఆయన వైపు తిరగండి.


వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు.


చాలామంది గుసగుసలాడడం విన్నాను, “అన్ని వైపుల భయం! అతన్ని ఖండించండి! అతన్ని ఖండిద్దాము.” నా స్నేహితులందరూ నేను జారిపడాలని చూస్తూ ఉన్నారు, “బహుశా అతడు మోసపోవచ్చు; అప్పుడు మనం అతనిపై విజయం సాధించి అతని మీద పగ తీర్చుకుందాము.”


అయితే ఈ ప్రజలు మొండితనం, తిరుగుబాటుతనం గల హృదయాలు కలిగి ఉన్నారు; వారు ప్రక్కకు తిరిగి వెళ్లిపోయారు.


వారు తిరస్కరించబడిన వెండి అని పిలువబడతారు, ఎందుకంటే యెహోవా వారిని తిరస్కరించారు.”


కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ఇది దాని దేవుడైన యెహోవాకు లోబడని దిద్దుబాటుకు స్పందించని దేశము. నమ్మకత్వం లేకుండా పోయింది; అది వారి పెదవుల నుండి మాయమై పోయింది.


“ఒక విలుకాడు బాణాలు వేయడానికి విల్లును సిద్ధం చేసుకున్నట్లు వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకను సిద్ధం చేసుకుంటారు; వారి అబద్ధం వల్లనే వారు దేశంలో బలవంతులయ్యారు కాని నాకు నమ్మకస్థులుగా ఉండి కాదు. వారు ఒక పాపం తర్వాత మరొక పాపం చేస్తారు; వారు నన్ను గుర్తించరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“ప్రతి ఒక్కరూ తన పొరుగువారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి; బంధువుల్లో ఎవరినీ కూడా నమ్మవద్దు, ఎందుకంటే వారిలో ప్రతివాడు ఒక మోసగాడు, స్నేహితుడు స్నేహితుని మీద అపనిందలు వేస్తాడు.


వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి.


“ ‘నీ అతి కామాతురతయే నీకున్న అపవిత్రత. నిన్ను పవిత్రపరచడానికి నేను ప్రయత్నించాను కాని నీవు శుద్ధి కాలేదు కాబట్టి నా ఉగ్రత నీమీద తీర్చుకునే వరకు నీవు పవిత్రం కావు.


“రాళ్లు ఊడదీసి ఇంటి గోడలను గీయించి కొత్త అడుసు పూసిన తర్వాత ఇంట్లో అపవిత్రమైన మరక తిరిగి కనిపిస్తే,


“ ‘మీ ప్రజల్లో కొండేలు వ్యాపింపచేస్తూ తిరగకూడదు. “ ‘మీ పొరుగువారి ప్రాణానికి అపాయం కలిగించేది ఏది చేయకూడదు. నేను యెహోవాను.


దేశాలు కోప్పడినందుకు నీ ఉగ్రత వచ్చింది. ఇక చచ్చినవారికి తీర్పు తీర్చడానికి, సేవకులైన ప్రవక్తలకు, నీ పేరుకు భయపడే నీ ప్రజలకు సామాన్యుల నుండి గొప్పవారి వరకు ప్రతిఫలాన్ని ఇవ్వడానికి, భూమిని నాశనం చేసేవారిని నాశనం చేయడానికి సమయం వచ్చింది.”


ఎందుకంటే ఆయన తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి. భూమిని తన వ్యభిచారంతో చెడగొట్టిన, ఆ మహావేశ్యకు ఆయన శిక్ష విధించారు. తన సేవకుల రక్తాన్ని కార్చిన ఆమెపై ఆయన పగతీర్చుకున్నారు.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ