Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 6:24 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 మేము వారి గురించిన వార్తలను విన్నాము, మా చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన మమ్మల్ని పట్టుకుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి, ప్రసవించు స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 వారి గురించిన వార్త విని నిస్పృహతో మా చేతులు చచ్చుబడి పోయాయి. ప్రసవించే స్త్రీ నొప్పుల వంటి వేదన పడుతున్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము. భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము. కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము. స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 మేము వారి గురించిన వార్తలను విన్నాము, మా చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన మమ్మల్ని పట్టుకుంది.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 6:24
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

వారిలో వణుకు పుట్టింది, ప్రసవ వేదనలాంటి బాధ వారికి కలిగింది.


కాబట్టి నా నడుము చాలా నొప్పిగా ఉంది, ప్రసవించే స్త్రీ వేదన నాకు కలిగింది; నేను విన్నదానిని బట్టి నేను తడబడ్డాను, నేను చూసిన దానిని బట్టి నేను దిగ్భ్రాంతి చెందాను.


అది వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని ఈడ్చుకెళ్తుంది; ప్రతి ఉదయం, ప్రతి పగలు, ప్రతి రాత్రి అది ఈడ్చుకెళ్తుంది.” ఈ సందేశాన్ని గ్రహించినప్పుడు చాలా భయం పుడుతుంది.


నీ ప్రత్యేక మిత్రులుగా నీవు చేసుకొన్న వారిని యెహోవా నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేమంటావు? ప్రసవిస్తున్న స్త్రీ పడే బాధలాంటి బాధ నీకు కలుగదా?


‘లెబానోనులో’ నివసించే నీవు దేవదారు భవనాలలో గూడు కట్టుకుని ఉన్న నీవు, ప్రసవ వేదనలో ఉన్న స్త్రీకి కలిగే నొప్పిలాంటి నొప్పులు నీకు వచ్చినప్పుడు ఎలా ప్రతిస్పందిస్తావో!


ఓ విషయం వారిని అడిగి చూడండి: పురుషుడు పిల్లలు కనగలడా? అలాంటప్పుడు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా పురుషులందరు ఎందుకు నడుముపై చేతులు పెట్టుకున్నారు? వారి ముఖాలు ఎందుకు వాడిపోయాయి?


ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, ఊపిరి కోసం అల్లాడుతూ, సీయోను కుమారి తన చేతులు చాచి, “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.


కెరీయోతు స్వాధీనం చేసుకోబడుతుంది, బలమైన కోటలు వారి స్వాధీనం అవుతాయి. ఆ రోజు మోయాబు యోధుల హృదయాలు ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ హృదయంలా ఉంటాయి.


దమస్కు బలహీనమైపోయింది, పారిపోవడానికి అది వెనుకకు తిరిగింది, భయం దాన్ని పట్టుకుంది; ప్రసవ వేదనలో ఉన్న స్త్రీలా దానికి వేదన, బాధ కలిగాయి.


బబులోను రాజు వారి గురించిన వార్తలను విన్నాడు, అతని చేతులు వణికిపోయాయి. స్త్రీకి కలిగే ప్రసవ వేదనలాంటి వేదన అతన్ని పట్టుకుంది.


ప్రతీ చేయి బలహీనం అవుతుంది; ప్రతీ కాలు మూత్రంతో తడిసిపోతుంది.


కాబట్టి బెల్షస్సరు రాజు ఇంకా భయపడ్డాడు, అతని ముఖం ఇంకా పాలిపోయింది. అతని అధికారులు కలవరపడ్డారు.


నేను వినగా నా గుండె కొట్టుకుంది, ఆ శబ్దానికి నా పెదవులు వణుకుతున్నాయి; నా ఎముకలు కుళ్లిపోతున్నాయి, నా కాళ్లు వణికాయి. అయినా మనపై దాడి చేస్తున్న దేశం మీదికి విపత్తు సంభవించే దినం వచ్చేవరకు నేను ఎదురుచూస్తూ ఉంటాను.


ప్రజలు, మేము, “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణి స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి వారు దాని నుండి తప్పించుకోలేరు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ