Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 6:11 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, నేను దానిని పట్టుకోలేను. “వీధిలో ఉన్న పిల్లల మీద ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; భార్య భర్తలు, వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను యౌవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్తలును వయస్సుమీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 కాబట్టి నేను యెహోవా కోపంతో నిండిపోయాను. దాన్ని నాలోనే అణచుకోలేక నేను విసిగిపోయాను. వీధుల్లో తిరిగే పసిపిల్లలు, యువకులు, ఇలా ప్రతి ఒక్కరి మీదా దాన్ని కుమ్మరించాల్సి వస్తున్నది. భార్యతో బాటు భర్తనూ, వయస్సు మీరిన ప్రతి వాడితో కలిపి వృద్ధులందరినీ పట్టుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉంది! దానిని నేను లోపల ఇముడ్చుకోలేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, నేను దానిని పట్టుకోలేను. “వీధిలో ఉన్న పిల్లల మీద ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; భార్య భర్తలు, వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 6:11
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

యువత సొమ్మసిల్లి అలసిపోతారు, యువకులు తడబడి పడిపోతారు.


నేనిప్పుడు ఆనందించే వారితో కలిసి కూర్చోలేదు, వారితో ఎప్పుడూ సంతోషించలేదు. మీ చేయి నా మీద ఉంది మీరు నాలో కోపాన్ని నింపారు కాబట్టి నేను ఒంటరిగా కూర్చున్నాను.


నీవు నన్ను తిరస్కరించావు” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీవు విశ్వాసభ్రష్టత్వం కొనసాగిస్తూనే ఉన్నావు. కాబట్టి నేను నా చేయి చాపి నిన్ను నాశనం చేస్తాను; నీ మీద జాలి చూపడానికి నేను అలసిపోయాను.


కాబట్టి వారి పిల్లలను కరువుకు అప్పగించండి; ఖడ్గానికి వారిని అప్పగించండి. వారి భార్యలు సంతానం లేనివారుగా, విధవరాండ్రుగా ఉండాలి; వారి మనుష్యులు చంపబడాలి, వారి యువకులు యుద్ధంలో కత్తివేటుతో చంపబడాలి.


“దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను.


అందుకు నేను వారిని శిక్షించవద్దా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “ఇలాంటి దేశం మీద నేను ప్రతీకారం తీర్చుకోవద్దా?


“ ‘కాబట్టి ప్రభువైన యెహోవా ఇలా అంటున్నారు: నా కోపం నా ఉగ్రత ఈ స్థలంపై మనుష్యులపై మృగాలపై పొలాల్లో ఉన్న చెట్లపై మీ భూమి పంటలపై కుమ్మరించబడతాయి; అది కాలిపోతుంది, దాన్ని ఎవ్వరూ ఆర్పలేరు.


స్త్రీలారా, యెహోవా మాట వినండి; ఆయన నోటి మాటలకు మీ చెవులు తెరవండి. ఏడ్వడం ఎలాగో మీ కుమార్తెలకు నేర్పండి; ఒకరికొకరు ఎలా విలపించాలో బోధించండి.


మరణం మన కిటికీల గుండా ఎక్కి మన కోటల్లోకి ప్రవేశించింది; అది వీధుల్లో పిల్లలు లేకుండ బహిరంగ కూడళ్లలో యువకులు లేకుండ నాశనం చేస్తుంది.


“నా మధ్య ఉన్న బలవంతులందరినీ యెహోవా తిరస్కరించారు; నా యువకులను అణచివేయడానికి ఆయన నా మీదికి సైన్యాన్ని పిలిపించారు. కన్యయైన యూదా కుమారిని ప్రభువు తన ద్రాక్షగానుగలో త్రొక్కారు.


“చిన్నవారు, పెద్దవారు కలిసి వీధుల్లోని దుమ్ములో పడుకుంటారు; నా యువకులు, యువతులు ఖడ్గం చేత చంపబడ్డారు. మీరు కోప్పడిన దినాన మీరు వారిని చంపారు; మీరు జాలి లేకుండా వారిని వధించారు.


ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు.


అప్పుడు ఆత్మ నన్ను ఎత్తుకుని తీసుకెళ్లాడు. నేనలాగే కొట్టుకొని పోయాను. నా మనస్సులో పుట్టిన కోపానికి ఎంతో కలత చెందినప్పుడు యెహోవా చేయి నా మీదికి బలంగా వచ్చింది.


అప్పుడు ఆయన, “మనుష్యకుమారుడా, నేనిచ్చే ఈ గ్రంథపుచుట్టను తిని నీ కడుపు నింపుకో” అన్నారు. ఆయన చెప్పినట్లే ఆ గ్రంథాన్ని తిన్నాను. అది నా నోటికి తేనెలా తియ్యగా ఉంది.


ఎవరినీ విడిచిపెట్టకండి. వృద్ధులను, యువకులను, స్త్రీలను, తల్లులను పిల్లలను అందరిని చంపండి కాని ఆ గుర్తు ఉన్నవారిని మాత్రం ముట్టుకోవద్దు. నా పరిశుద్ధాలయం నుండి మొదలుపెట్టండి” అన్నారు. వెంటనే వారు మందిరం ముందున్న వృద్ధులతో మొదలుపెట్టారు.


నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, యెహోవా ఆత్మను పొంది శక్తితో నింపబడి ఉన్నాను, న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను.


ఆ రాత్రి ఒకే పరుపు మీద ఉన్న ఇద్దరిలో, ఒకరు కొనిపోబడతారు ఇంకొకరు విడవబడతారు.


పౌలు ఏథెన్సు పట్టణంలో వారి కోసం ఎదురుచూస్తూ, ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండి ఉందని చూసి ఎంతో దుఃఖించాడు.


సీల తిమోతిలు మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చినప్పుడు, పౌలు యేసే క్రీస్తు అని యూదులకు ప్రకటించడానికి, సాక్ష్యమివ్వడానికి తనను తాను ప్రత్యేకంగా అంకితం చేసుకున్నాడు.


మా మట్టుకైతే, మేము చూసినవాటిని విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు.


అప్పుడు దేవాలయంలో నుండి ఒక పెద్ద స్వరం ఏడుగురు దేవదూతలతో, “మీరు వెళ్లి దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి” అని బిగ్గరగా చెప్పడం విన్నాను.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ