Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




యిర్మీయా 51:19 - Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటివంటివాడు కాడు ఆయన సమస్తమును నిర్మించువాడు ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము సైన్యములకధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 యాకోబుకు చెందిన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన అన్నిటినీ రూపొందించేవాడు. ఇశ్రాయేలును ఆయన తన వారసత్వంగా ఎన్నుకున్నాడు. సేనల ప్రభువైన యెహోవా అని ఆయనకు పేరు.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

పవిత్ర బైబిల్

19 కాని యాకోబు స్వాస్థ్యము (దేవుడు) ఆ పనికి మాలిన విగ్రహాల్లాటివాడు కాదు. ప్రజలు దేవుణ్ణి చేయలేదు. దేవుడే తన ప్రజలను చేశాడు! దేవుడు సమస్తాన్నీ సృష్టించినాడు! ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ

తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు, ఆయన పేరు సైన్యాల యెహోవా.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




యిర్మీయా 51:19
19 ပူးပေါင်းရင်းမြစ်များ  

మన దేవుడు పరలోకంలో ఉన్నారు; ఆయనకు ఇష్టమైనదే ఆయన చేస్తారు.


యెహోవా తన కోసం యాకోబును ఎన్నుకున్నారు. ఇశ్రాయేలును తన విలువైన స్వాస్థ్యంగా ఎన్నుకున్నారు.


యెహోవా మీరు మాత్రమే నా భాగము, నా పాత్ర. మీరు నా భాగాన్ని భద్రపరుస్తారు.


యెహోవాను దేవునిగా కలిగిన దేశం ధన్యమైనది. తన వారసత్వంగా ఆయన తన కోసం ఎంచుకున్న ప్రజలు ధన్యులు.


నా శరీరం నా హృదయం నీరసిస్తాయేమో, కాని నిత్యం నా దేవుడు నా హృదయానికి బలం నిత్యం నా స్వాస్థ్యం.


మీ స్వాస్థ్య గోత్రాన్ని మీరు పూర్వం సంపాదించుకుని విమోచించిన మీ వారసత్వ సమాజాన్ని, మీరు నివసించిన సీయోను పర్వతాన్ని జ్ఞాపకం చేసుకోండి.


మన విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు ఆయన పేరు సైన్యాల యెహోవా.


ఆకాశాలను విస్తరింపజేసి భూమి పునాదులను వేసిన మీ సృష్టికర్తయైన యెహోవాను ఎందుకు మరచిపోయారు? బాధించేవాడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వాని కోపాన్ని చూసి ప్రతిరోజు ఎందుకు భయపడుతూ బ్రతుకుతున్నారు? బాధించేవాని కోపం ఏమయ్యింది?


అయితే దేవుడు తన శక్తితో భూమిని చేశారు; ఆయన తన జ్ఞానంతో లోకాన్ని స్థాపించారు, తన తెలివితో ఆకాశాన్ని వ్యాపింపజేశారు.


యాకోబులో భాగమైన వాడు వీటిలాంటివాడు కాదు, ఆయన తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు గోత్రంతో పాటు, అన్నిటిని సృజించారు. ఆయన పేరు సైన్యాల యెహోవా.


“యెహోవా ఇలా అంటున్నారు, ఆయన భూమిని సృష్టించారు, యెహోవా దానిని రూపించి, స్థాపించారు; యెహోవా అని పేరు కలిగినవారే ఇలా చెప్తున్నారు,


“నా స్వాస్థ్యాన్ని దోచుకునేవారలారా, అది మీకు సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది ధాన్యం నూర్పిడి చేస్తున్న దూడలా బలమైన గుర్రాల్లా మీరు సకిలిస్తున్నారు.


అయినా వారి విమోచకుడు బలవంతుడు; ఆయన పేరు సైన్యాల యెహోవా. ఆయన వారి దేశానికి విశ్రాంతిని తెచ్చేలా వారి పక్షాన వాదిస్తారు, బబులోనులో నివసించేవారికి అశాంతి కలుగుతుంది.”


ఎందుకంటే ఇశ్రాయేలు, యూదా దేశాలు ఇశ్రాయేలు పరిశుద్ధునికి వ్యతిరేకంగా చేసిన దోషాలతో నిండి ఉన్నప్పటికీ వారి దేవుడైన సైన్యాల యెహోవా వారిని విడిచిపెట్టలేదు.


నాలో నేను, “యెహోవా నా స్వాస్థ్యం; కాబట్టి నేను ఆయన కోసం వేచి ఉంటాను” అని అనుకుంటున్నాను.


యెహోవా ప్రజలే ఆయన భాగం, యాకోబు ఆయనకు కేటాయించబడిన వారసత్వము.


కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ